వేద కంట్లో నలక పడితే దాన్ని తీసేందుకు యష్ ట్రై చేస్తాడు. అది చూసి మాళవిక కుళ్ళుకుంటుంది. అదంతా అభిమన్యు వ్యయాలు చూస్తూ ఉంటారు. ఆ లవ్ బర్డ్స్ ని చూసి ఈ లవ్ బర్డ్ మొహం చూశావా ఎలా మాడిపోయిందోనని అనుకుంటారు. రొమాంటిక్ కపుల్ మీకు రొమాన్స్ కావాలి నాకు రివెంజ్ కావాలి ఇంకెప్పుడు టైమ్ వస్తుందోనని మాళవిక రగిలిపోతుంది. ఖుషి బర్త్ డే పార్టీలో మందు కొట్టడానికి రత్నం, శర్మ విలవిల్లాడిపోతారు. తాగాలని అనిపిస్తుందని అంటుండగా వసంత్ రెండు కొబ్బరి బొండాలు తీసుకొచ్చి ముందు పెడతాడు. మా బాధ నీకు అర్థం కావడం లేదు అల్లుడు వెళ్ళు అని అంటారు. ఇవి మామూలు బోండాలు కాదు గోవా బోండాలని చెప్పి అందులో మందు కలిపి తీసుకొస్తాడు. తమ కోరిక తీరిందని ఇద్దరూ సంబరపడిపోతారు.
Also Read: దివ్య మీద చెయ్యి ఎత్తిన విక్రమ్ - తులసికి షాకిచ్చి, లాస్యని సపోర్ట్ చేసిన రాములమ్మ
వాళ్ళు క్లోజ్ గా ఉంటే నాకెందుకు కోపం వస్తుంది. నేను వద్దనుకునే కదా వదిలేసింది. అయినా ఎందుకు రాదు నేను ఉన్న స్థానంలోకి కదా అది వచ్చింది. ఏదో ఒకటి చేసి తలరాతలు తారుమారు చేయాలని మాళవిక అనుకుంటుండగా వేద వచ్చి ఫంక్షన్ లోపలికి రమ్మని పిలుస్తుంది. నా కూతురు ఖుషి కూడా నన్ను లెక్క చేయడం లేదు. పొద్దున అందరూ బర్త్ డే విషెస్ చెప్తుంటే నన్ను మాట్లాడనివ్వలేదు కనీసం నన్ను చూడలేదు. కడుపున పుట్టిన వాళ్ళు లెక్కచేయకపోతే ఇక మిగతా వాళ్ళు ఏం విలువ ఇస్తారు. ఈ లోకంలో నాకు ఎవరూ లేరని మొసలికన్నీరు కారుస్తుంది. ఎంత మన పిల్లలు అయినా కొంత దూరం అయినప్పుడు దగ్గర అవడానికి టైమ్ పడుతుందని ఖుషికి దగ్గర అవమని మాళవికకి వేద సలహా ఇస్తుంది. నువ్వు రావాలి ఖుషి బర్త్ డే నీ చేతుల మీద జరగాలని చెప్తుంది. అది జరగదని మాళవిక అంటుంది. అసలు ఎన్ని సార్లు ప్రయత్నించావ్, నువ్వు ఈ ఇంటి ఆడపిల్లకి తల్లివి వేడుక రోజు కన్నీళ్ళు పెట్టుకోకూడదని నచ్చజెపుతుంది.
Also Read: రేవతి ఊహించని నిర్ణయం- మురారీ మనసులో మాట తెలుసుకున్న ముకుంద
ఓడిపోయిన ఇదే అత్తింట్లో తిరిగి మాళవిక జెండా పాతుతాను చూస్తూ ఉండు వేద అని మాళవిక తన మనసులో కుట్ర బయట పెడుతుంది. రత్నం వాళ్ళు తాగేసి తూలుతూ ఫంక్షన్ అంతా తిరుగుతూ గోల గోల చేస్తారు. వసంత్ వాళ్ళ నోరు మూయించి తీసుకొచ్చి ఫంక్షన్ లో కూర్చోబెడతాడు. ఖుషి కేక్ కట్ చేయడానికి ముందు ఇక్కడున్న అందరితో మాట్లాడాలని చెప్తుంది. ఈరోజు ఒక మనిషికి థాంక్స్ చెప్పాలని ఇక్కడిదాకా వచ్చాను. నేను ఇంత సంతోషంగా ఉన్నాను అంటే డానికి కారణం మా అమ్మ. ఒక అమ్మ నన్ను చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయింది అప్పుడు వచ్చింది మా అమ్మ దేవుడు ఇచ్చిన అమ్మ వేద అమ్మ. మా నాన్న దగ్గరకి వచ్చి నన్ను కన్నా కూతురిలాగా చూసుకుంది. అమ్మ లేని లోటు లేకుండా చూసుకుంది. అందుకే వేద అమ్మ నాకు అమ్మ అని చెప్తుంది. యష్ వేద చేతికి ప్రేమగా ఉంగరం తొడుగుతాడు. అది చూసి మాళవిక జలస్ గా ఫీల్అవుతుంది.