అటు హాస్పిటల్ కి వెళ్లాలని కృష్ణ, స్టేషన్ కి వెళ్లాలని మురారీ హడావుడి చేస్తారు. మురారీ లెట్ చేశాడని కృష్ణ దెబ్బలాడుతూ కింద పబోతుంటే పట్టుకుంటాడు. టైమ్ అయిపోతుందని టిఫిన్ తినకుండా కృష్ణ వెళ్లిపోతుంటే ముకుంద ఆపి అడుగుతుంది. డ్యూటీకి టైమ్ అయ్యింది అందుకని టిఫిన్, లంచ్ బయట చేస్తామని చెప్పి వెళ్ళిపోతుంది. మీరు వెళ్ళండి నేను వస్తానని ముకుంద అనుకుంటుంది. కృష్ణ వాళ్ళు కారులో వెళ్తూ భార్యాభర్తలు మాదిరిగా మాట్లాడుకుంటారు. కాసేపు ఇద్దరూ అవి లేవు ఇవి లేవని పోట్లాడుకుంటారు. మనం నిజంగానే భార్యాభర్తలు అయితే బాగుండని మురారీ కోరుకుంటాడు. మీరు నన్ను శ్రీమతి గారు ని పిలవకూడదు ఏమే అని పిలవండని చెప్తుంది. అలా పిలవాలంటే కాస్త ఇబ్బందని అంటాడు.
Also Read: నిజం చెప్తే చచ్చిపోతానని బెదిరించిన స్వప్న- రిసెప్షన్ జరగకుండా కావ్య చేసిందన్న రాహుల్
రేవతి హోమంలో మురారీ వాళ్ళు చెప్పిన ప్రమాణాలు గురించి ఆలోచిస్తుంది. కృష్ణ, మురారీ వాలకం చూస్తుంటే అగ్రిమెంట్ మ్యారేజ్ లా అనిపించడం లేదు. ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. అది ఒకరి గురించి మరొకరికి తెలియకముందు పెట్టుకున్నారు. లేదంటే హోమంలో కూర్చుని ఆ ప్రమాణాలు ఎందుకు చెప్తారు. వాళ్ళ మనసు లోతుల్లో దాగి ఉన్న ప్రేమని బయటకి తీసి శాశ్వత బంధంగా మార్చాలని రేవతి డిసైడ్ అవుతుంది. మురారీ కృష్ణకి ఫోన్ చేసి ఆకలేస్తుందని వస్తే వెళ్దామని అంటాడు. మీరు స్టేషన్ నుంచి బయటకి వస్తే వెళ్దామని చెప్తుంది. మురారీ పైఆఫీసర్ తనని పక్కకి పిలిచి ప్రేమ విషయం చెప్పావా అని అడుగుతాడు. అది చెప్పడానికే తీసుకెళ్తున్నానని అంటాడు. ప్రేమలో పడటం లేట్ చేసినా పర్వాలేదు కానీ ఆ విషయం చెప్పడంలో లేట్ చేయకూడదని సలహా ఇస్తాడు.
Also Read: తల్లిదండ్రులకి నిజం చెప్పిన దివ్య- తల్లీమాటలు విని పెళ్ళాన్ని అసహ్యించుకుంటున్న విక్రమ్
పోలీస్ డ్రెస్ లో వెళ్తుంటే ఇదేంటి ఇలా వెళ్తావా కాస్త రొమాంటిక్ గా ఆలోచించమని చెప్తాడు. వెంటనే డ్రస్ మార్చుకుని వస్తాడు. కారులో వెళ్తున్నామని అంటే నువ్వేం మనిషివని తిడతాడు. ఇద్దరూ బైక్ మీద వెళ్తే భుజం మీద చెయ్యి వేస్తుంది ఆ టచ్ లో మ్యాజిక్ ఉంటుందని మురారీ వాళ్ళ ఆఫీసర్ చెప్తాడు. ఇదేంటి డ్రస్ మార్చుకున్నారని అంటే బయటకి వెళ్తూ పోలీస్ డ్రస్ ఎందుకని అంటాడు. అలా అని మీ కమిషనర్ చెప్తే మార్చుకున్నారా అని కృష్ణ అనేస్తుంది. ఇక రెస్టారెంట్ లో మురారీ తన ఫ్రెండ్ తో కూర్చుని మాట్లాడుతూ ఉండగా ముకుంద వస్తుంది. కృష్ణకి నీ మనసులో మాట చెప్పకుండా ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నావ్ నువ్వు తనని ప్రేమిస్తున్నట్టు ఏకాంతంగా ఉన్న టైమ్ లో చెప్పేయమని సలహా ఇస్తాడు. ఆ మాటలు ముకుంద వినేస్తుంది. ఇంట్లో చెప్పాలని అనుకుంటే ఎవరో ఒకరు ఉంటున్నారు పైగా ముకుంద వింటుందేమోనని భయమని మురారీ అనేసరికి ముకుంద షాక్ అవుతుంది. అంటే మురారీ కృష్ణని ప్రేమిస్తున్నాడా అనుకుంటుంది.