దివ్య రాజ్యలక్ష్మిని ఎదిరించి మరీ పుట్టింటికి వెళ్తానని అంటుంది. ఇంతక  ముందు ఇచ్చిన డోసు సరిపోలేదా అని రాజ్యలక్ష్మి అంటే అంతకమించి డబుల్ డోస్ ఇస్తానని దివ్య పనికిమాలిన వార్నింగ్ ఇస్తుంది. పని మనిషి రాలేదని మీ అత్త కూరగాయలు కట్ చేస్తుంటే నువ్వు పుట్టింటికి బయల్దేరతావా అని ప్రసన్న అడుగుతుంది. కావాలని రాకుండా చేశారా అని దివ్య ఎదిరించి వెళ్లిపోతే రాజ్యలక్ష్మి పగలబడి నవ్వుకుంటుంది. దివ్య ఇంటికి వచ్చి నందుని కౌగలించుకుంటుంది. ఇప్పుడు నన్ను అమ్మ మెడ పట్టుకుని బయటకి గెంటేయమని చెప్తుంది తోసేస్తావా అని నిలదీస్తుంది. అమ్మ నాతో మాట్లాడడు దూరంగా ఉంచుతుంది కానీ అల్లుడిని పిలిచి ఆరాలు తీస్తుంది నా ఏడుపు ఏదో నేను ఏడుస్తాను కదాని బాధపడుతుంది. మీ అమ్మకి నీమీద ఉంది కోపం, ద్వేషం కాదు. ఎవరో ఏదో హాని చేయడం కాదు అపార్థాలతో మనమే మన బంధాలని దూరం చేసుకుంటున్నామని నందు అంటాడు.


నందు: మీ అత్త ఇంట్లో నీ పరిస్థితి ఎలా ఉంది నిజం చెప్పు


దివ్య: నాకేం నన్ను అందరూ ప్రేమగా చూసుకుంటున్నారు


తులసి: మీ అత్తకూడనా? మీ అత్త బెదిరింపుల నుంచి తట్టుకుని నువ్వు సంతోషంగా ఉంచడం కోసం దూరం పెట్టాల్సి వస్తుంది


దివ్య: అత్త రాక్షసి కావచ్చు కానీ మా ఆయన మనసున్న మంచి మనిషి


Also Read: కృష్ణ, మురారీ ఆనందాన్ని చెడగొట్టాలని డిసైడ్ అయిన ముకుంద- ఎన్ని చేసిన బంధం విడిపోదన్న రేవతి


నందు: అల్లుడు మంచివాడే కానీ తల్లి ప్రేమ కప్పేస్తే ఏంటి పరిస్థితి


దివ్య: మీరేం టెన్షన్ పడకండి నా కష్టాన్ని నేనే తట్టుకుని నిలబడతాను


రాజ్యలక్ష్మికి లాస్య ఫోన్ చేసి ఇంట్లో జరిగింది చెప్తుంది. అదే ఇంట్లో ఉంటే మిమ్మల్ని తులసి ఎలా కలుసుకొనిస్తుందని అంటుంది. మేము కలవకుండా నువ్వే అడ్డు పడుతున్నావాని లాస్య అంటుంది. అదే దివ్య మా ఇంటికి వచ్చింది ఎందుకు రానిచ్చావని అడుగుతుంది. దివ్య వీళ్ళకి దగ్గరయితేనే నందుని పట్టుకోవడం కష్టమని లాస్య అంటుంది. ఇక నుంచి దివ్య తలనొప్పి నీకు ఉండదని రాజ్యలక్ష్మి మాట ఇస్తుంది.


Also Read: రాహుల్ పెళ్లి అయిపాయే- స్వప్నది దొంగ కడుపని తెలుసుకున్న రాజ్, కావ్య పరిస్థితి ఏంటి?


విక్రమ్ రావడం చూసి రాజ్యలక్ష్మి చేతికి కట్టుతో ఏడుస్తుంది. ఇదంతా నీ పెళ్ళాం చేసిందని ప్రసన్న చెప్తుంది. ఈరోజు పనిమనిషి రాలేదు కూరగాయలు తరుగుతుంటే దివ్య వచ్చి పుట్టింటికి వెళ్తున్నా అన్నది. పనిలో సాయం చేయవచ్చు కదా అంటే పూనకం వచ్చినట్టు వీరంగం ఆడి నన్ను వంట చేయమంటారా అని కూరగాయలు కోసే కత్తి విసిరేసిందని అబద్ధాలు చెప్తారు. అయినా ఆగకుండా పుట్టింటికి వెళ్లిపోయిందని అనేసరికి విక్రమ్ కోపంతో ఊగిపోతాడు. తన పాచిక పారినందుకు రాజ్యలక్ష్మి సంతోషపడుతుంది. అటు ఇంట్లో లాస్య బలమైన సాక్ష్యం తీసుకొచ్చి మళ్ళీ గృహహింస కేసు రీఓపెన్ చేయిస్తానని అనసూయ వాళ్ళని బెదిరిస్తుంది. నందు తనతో కలిసి ఉండేలా చేయకపోతే అందరినీ జైలుకి పంపిస్తానని అంటుంది.