కృష్ణ తనకి ఏడేడు జన్మలకి భార్యగా రావాలని కోరుకుంటున్నట్టు మురారీ అగ్నిసాక్షిగా ప్రమాణం చేస్తాడు. ఇది హోమంలాగా లేదు అగ్నిసాక్షిగా మురారీ వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేస్తున్నట్టు ఉందని అనుకుని ముకుంద కళ్ళు తిరిగి పడిపోతుంది. మురారీ వాళ్ళు పీటల మీద నుంచి లేవబోతుంటే రేవతి కూర్చోమని చెప్పి హోమం ఆపొద్దని పంతులికి చెప్తుంది. రేవతిని ముకుంద గదిలోకి తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది. నువ్వు ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకోమని చెప్పి రేవతి వెళ్ళిపో ఎన్ని ప్రయత్నాలు చేసిన హోమం ఆగదు, వాళ్ళ బంధం తెగిపోదని చెప్పేసి వెళ్ళిపోతుంది. పంతులు మళ్ళీ ప్రమాణాలు చేయిస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కృష్ణ చేయి వదలనని ప్రమాణం చేస్తాడు. మురారీ అనే అబ్బాయిని ఏడేడు జన్మలకి భర్తగా పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని కృష్ణ చెప్తుంది. వాళ్ళని చూసి ముకుంద గుండె ముక్కలైపోతుంది.


Also Read: రాహుల్ పెళ్లి అయిపాయే- స్వప్నది దొంగ కడుపని తెలుసుకున్న రాజ్, కావ్య పరిస్థితి ఏంటి?


మురారీ జంట అగ్ని చుట్టు ఏడు ప్రదక్షిణలు చేస్తారు. ఇన్నాళ్ళూ నా ప్రేమపై పెట్టుకున్న ఆశలు అగ్నిలో దహనం అయిపోతుంది. నా ప్రేమ సజీవ దహనం అయిపోతుందని ముకుంద కన్నీళ్ళు పెట్టుకుంటుంది. హోమంలో కృష్ణ మనస్పూర్తిగా చెప్పినట్టు అనిపించదని మురారీ అనుకుంటాడు. కృష్ణ కూడా దీని గురించే ఆలోచిస్తూ మనసులో ఉన్నది అడిగేయాలని అనుకుంటుంది. ఇద్దరూ ఒకేసారి మాట్లాడాలని పిలుచుకుంటారు. కృష్ణ అసలు విషయం అడగకుండా ముకుంద గురించి అడుగుదామని అనేసరికి మురారీ టెన్షన్ పడతాడు. హోమం బాగా జరిగిందని అనుకుంటారు. కృష్ణ మనసులో తను ఉన్నాడో లేదో తెలుసుకోవాలని ఆరాటపడతాడు కానీ అడగకుండా వెనకడుగు వేస్తాడు. హోమంలో అంత సేపు కూర్చుంటానని అనుకోలేదు కానీ కూర్చున్న తర్వాత టైమ్ తెలియలేదని కృష్ణ చెప్తుంది. ఏసీపీ సర్ కూడా ఇదే మాట చెప్తే డైరీ అమ్మాయి ఆయన మనసులో లేదని అర్థమని ఆ మాట చెప్తాడని ఎదురుచూస్తుంది. కానీ మురారీ మాత్రం హోమం ఎందుకు చేశారని అడుగుతారు. భార్యాభర్తలు కలిసి ఉండాలని చేశారని కృష్ణ అనేసరికి ఇద్దరూ సిగ్గుపడతారు. ఇక నా ఊపిరి ఉన్నంత వరకు మీరే నా భర్త అని కృష్ణ మనసులో అనుకుటుంది.


Also Read: యష్, వేదని చూసి అసూయతో రగిలిపోతున్న మాళవిక- అభిమన్యు ఏం చేయబోతున్నాడు?


ముకుంద: నీకు ఏ మాత్రం ఇష్టం లేకున్నా హోమం ఆపేవాడివి ఆపలేదంటే ఇష్టం ఉన్నట్టే కదా. మన ప్రేమని మర్చిపోయావా లేదా మనసు మారిపోయిందా ఎందుకు మురారీ ఇలా చేశావ్? నిన్ను తలుచుకొని క్షణం ఉండదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం మన ప్రేమని మంటల్లో కలిపేశావా? గురువుగారి మాటకు కట్టుబడి తన అమాయకత్వానికి ఇంప్రెస్ అయి భార్యగా అంగీకరించావా? మరి నేనేం అయిపోవాలి. నువ్వు నన్ను మర్చిపోయినట్టు నేను నిన్ను మర్చిపోలేను అది నా వల్ల కాదు. నిన్ను వదులుకోలేను, నీమీద పుట్టిన ప్రేమ అంతమైపోదు. నువ్వు నాకు ఇచ్చిన మాట తప్పి కృష్ణని ఎలా భార్యగా అంగీకరిస్తావో నేను చూస్తాను