Horoscope Today 19th June 2023: జూన్ 19 మీ రాశిఫలితాలు
మేష రాశి ఈ రోజు మీకు అనుకూలమైన రోజు. ఆలోచనల ప్రవాహానికి ప్రశాంతత చేకూరుతుంది. నిర్ణయాల విషయంలో కొంత ఇబ్బంది ఉంటుంది కానీ సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. వ్యాపారంలో లాభపడతారు, ఉద్యోగులకు, రచయితలకు మంచిరోజు. సన్నిహితులెవరితోనూ వివాదానికి దిగకండి. పాత స్నేహితులను కోల్పోతారు.
వృషభ రాశిఈరోజు మానసికంగా ఇబ్బంది పడతారు. వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది. కొన్ని వివాదాల విషయంలో రాజీ పడడమే మంచిది. క్రీడాకారులకు రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఏ కొత్త పనిని ప్రారంభించవద్దు.
మిథున రాశిఈ రోజు అదృష్టం మీ వెంటే ఉంటుంది. మంచి ఆహారంతో ఎంజాయ్ చేస్తారు. మీరు మీకోసం కొత్త బట్టలు, నగలు కొనుగోలు చేస్తారు. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. పొదుపుపై దృష్టి పెట్టండి. వృధా ఖర్చులు లేకుండా చూసుకోవాలి. ప్రతికూల ఆలోచనలు మీ మనస్సులోకి ప్రవేశించనివ్వవద్దు.
Also Read: దేవాలయాల్లో ఈ దానం చేస్తే పదితరాలకు మంచి జరుగుతుంది!
కర్కాటక రాశి ఈ రోజు ఏదో ఒక విషయంలో గందరగోళం ఉంటుంది. ప్రతికూల ఆలోచనల కారణంగా కుటుంబ సభ్యుల నుంచి కొన్ని ఇబ్బందుల ఎదురవుతాయి. ఖర్చులు పెరుగుతాయి. మాటల విషయంలో సంయమనం పాటించాలి. ఎవరి పట్లా ఎలాంటి దురుద్దేశాలు పెట్టుకోవద్దు. మీ లోపాలను మీరు గుర్తించి సరిచేసుకోవడం మంచిది. ధననష్టం కలగవచ్చు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు.
సింహ రాశి ఈ రోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. ధార్మిక ప్రదేశాన్ని సందర్శించే అవకాశం ఉంది. గందరగోళంగా ఉంటారు. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. కుటుంబ వ్యవహారంపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వ్యాపారంలో ఆర్థిక లాభం ఉంటుంది.
కన్యా రాశి ఈ రోజు మీరు కొత్త పనిని ప్రారంభిస్తారు. వ్యాపారం, ఉద్యోగం, వృత్తులవారికి మంచి సమయం ఇది. ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశాలున్నాయి. తండ్రి నుంచి ప్రయోజనం ఉంటుంది. సంతోషంగా ఉంటుంది శారీరక బాధలు తగ్గుతాయి. స్నేహితునితో రాజకీయ చర్చలో పాల్గొనవచ్చు.
తులా రాశి వ్యాపార రంగంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. సహోద్యోగుల నుంచి సహాయం అందుతుంది. పర్యాటక ప్రదేశాన్ని సందర్శించడానికి ఒక కార్యక్రమం ప్లాన్ చేసుకుంటారు. మీరు స్నేహితుడితో పబ్లిక్ ఈవెంట్‌లో చురుకుగా ఉంటారు. విదేశాల నుంచి స్నేహితులు , ప్రియమైనవారి నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి ఈ రోజు మీకు ప్రశాంతమైన రోజు అవుతుంది. యువతకు మేలు జరుగుతుంది. వృత్తిలో పురోగతి ఉంటుంది. ఏ పనిలోనైనా అపజయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంటి మరమ్మత్తులు ప్రారంభించవద్దు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి. ఖర్చులు పెరగడం వల్ల కూడా ఆర్థిక సంక్షోభం తలెత్తవచ్చు. వాహన సుఖం లభిస్తుంది. సాంకేతిక అవాంతరాల వల్ల పని దెబ్బతింటుంది.
ధనుస్సు రాశి ఈరోజు మీ మనసు సంతోషంగా ఉంటుంది. మీరు కొత్త స్నేహితులను కలుసుకుని ఆనందిస్తారు. వ్యాపార పనులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారంలో ప్రయోజనం పొందుతారు. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది
Also Read: ఈ రాశులవారికి ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం - జూన్ 19 నుంచి 25 వరకూ వారఫలాలు
మకర రాశిఈ రోజు మీరు వ్యాపారాన్ని పెంచుకోవడానికి కొన్ని ప్రత్యేక ప్రయత్నాలు చేస్తారు. డబ్బు లావాదేవీల్లో సౌలభ్యం ఉంటుంది. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి సహకారం అందుతుంది. విదేశాల్లో చదువుకోవాలి అనుకున్న వారికి అడుగు ముందుపడుతుంది.
కుంభ రాశి ఈరోజు తొందరపాటు వల్ల నష్టాలు రావొచ్చు. మాటల విషయంలో సంయమనం పాటించాలి. ప్రయాణాలను నివారించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త పని పట్ల మీ ఆసక్తి అలాగే ఉంటుంది. మేధోపరమైన చర్చలో పాల్గొనే అవకాశాన్ని పొందవచ్చు. ఆకస్మిక ఖర్చులు పెరుగుతాయి.
మీన రాశి ఈ రోజు కుటుంబ సభ్యులతో వాదోపవాదాలు జరుగుతాయి. తల్లి ఆరోగ్యం మీకు ఆందోళన కలిగిస్తుంది. నిద్రలేమి కారణంగా ఇబ్బందులకు గురవుతారు. సంభాషణలో జాగ్రత్తగా ఉండండి. ధన నష్టం కలగవచ్చు. ఉద్యోగాలు చేసే వారు ఏదో ఒక ఆందోళనలో ఉంటారు. పూర్వీకుల విషయాలలో ప్రయోజనం ఉంటుంది.