బహుముఖ ఆరోగ్య ప్రయోజనాలు అందించే ఆమ్లా లేదా ఉసిరి భారతీయ మూలికల్లో ఒకటి. మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. ఈ సూపర్ ఫుడ్ లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం, జీర్ణ సమస్యలు రాకుండా రక్షించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉసిరి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. హార్మోన్ల సమతుల్యతను కాపాడుతూ శరీరం నుంచి విషాన్ని తొలగిస్తుంది. అయితే ఈ ఆరోగ్యాన్ని ఇచ్చే పండుఅతిగా తీసుకుంటే అనారోగ్యానికి దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఉసిరిలో 600-700 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ విటమిన్ సి ఉన్నందున ఆమ్లా రెండవ అతిపెద్ద సహజమైన విటమిన్ సి అందించే పండుగా పేరొందింది. దీన్ని అధికంగా వినియోగిస్తే పోషకాలని తీసుకోవడంలో చాలా ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. వాటిలో కొన్ని ఇవి..


అసిడిటీ


ఉసిరిలో ఆమ్లత్వం ఎక్కువ. కడుపు సమస్యల్ని తగ్గించడంలో సహాయపడుతుంది. కానీ పచ్చి పండ్లు అతిగా తింటే గుండెల్లో మంటను పెంచుతుంది. హైపర్ అసిడిటీ చరిత్ర కలిగిన వాళ్ళు ఖాళీ కడుపుతో ఉసిరి తినకూడదని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఇది పొట్ట లైనింగ్ ని చికాకు పెడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యల్ని ప్రేరేపిస్తుంది. ఇందులో ఫైబర్ చాలా ఎక్కువ. రోజులో ఒకటి మించి ఎక్కువ తింటే మలబద్ధకం ఏర్పడవచ్చు.


రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది


ఉసిరిలో యాంటీ ప్లేట్ లెట్ లక్షణాలు కలిగి ఉండి. ఇది రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది. రక్త సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే ఉసిరి తీసుకోకపోవడమే మంచిది. వివిధ అధ్యయనాల ప్రకారం యూరోపియన్ హార్ట్ జర్నల్ ప్రచురించిన నివేదికని బట్టి ప్లేట్ లెట్స్ తగ్గిస్తుంది.


హైపోక్సేమియాకు కారణం కావచ్చు


ఉసిరి అతిగా తినడం వల్ల హైపోక్సేమియా లేదా రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఏర్పడే పరిస్థితి తలెత్తుతుంది. ఇది శ్వాస లేదా రక్తప్రసరణతో ముడిపడి ఉన్న సమస్యకి సంకేతం కావచ్చు. తీవ్రమైన అసిడోసిన్ కి దారి తీస్తుంది. అంటే శరీరంలోని పలు అవయవాలు పని చేయవు. శస్త్రచికిత్సకి కనీసం రెండు వారాల ముందు ఉసిరి తినడం మానేయాలని వైద్యులు ఎప్పుడు సలహా ఇస్తారు.


రక్తంలో షుగర్ లేవల్స్ తగ్గుతాయి


ఉసిరి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించడంలో సహాయపడినప్పటికీ యాంటీ డయాబెటిస్ మందులతో పాటి దీన్ని ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. దీన్ని అతిగా తింటే గ్లూకోజ్ స్థాయిలు అత్యల్ప స్థాయికి పడిపోయే ప్రమాదం ఉండి. రక్తంలో షుగర్ లెవల్స్ తక్కువగా ఉన్నవారు అంటే హైపోగ్లైసిమియా పరిస్థితి ఉన్న వాళ్ళు తీసుకోకపోకూడదు. ఏకాగ్రత సమస్యలు, తిమ్మిరి, మగత, మాటల్లో తడబాటు వంటి సంకేతాలు కనిపిస్తాయి. రకంట్లో గ్లూకోజ్ స్థాయిలు చాలా కాలం పాటు తక్కువగా ఉంటే అది మూర్చలు, కోమా మరణానికి కూడా కారణమవుతుంది.


తల్లి పాలివ్వడంలో అసౌకర్యం


ఇది పోషకాలు కలిగినప్పటికీ ఇందులోని అదనపు ఆమ్లాలు గర్భిణీ, పాలిచ్చే తల్లుల ఆరోగ్యానికి హానికరం. అసౌకర్యాన్ని కలిగిస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: 'నాన్నకు ప్రేమ'తో.. ఫాదర్స్ డే రోజు మీ నాన్నని ఇలా సర్ ప్రైజ్ చేయండి