ధరణి మహేంద్ర దగ్గరకి వచ్చి మాట్లాడుతుంది. ఒకప్పుడు చిన్నత్తయ్య మీరు కలిసి కాలేజ్ కి వెళ్ళే వాళ్ళు కానీ ఇప్పుడు మీరు వేరువేరుగా ఉంటుంటే నచ్చడం లేదని చెప్తుంది. జగతితో మాట్లాడకుండ ఉన్నానంటే నా మనసు ఎంత గాయపడిందోనని మహేంద్ర బాధపడతాడు. అసలు రిషిని ఎందుకు పంపించాల్సి వచ్చిందో కారణం చెప్పడం లేదు. అసలు నా రిషిని చూడకుండానే చనిపోతానేమోనని భయమేస్తుంది. డాడ్ అని ఎవరు పిలిచినా నా రిషి అనిపిస్తుంది. ఈ బాధ భరించడం నా వల్ల కావడం లేదు రోజురోజుకీ మనసులో బాధ పెరిగిపోతుంది. ఇది ఎంత దూరం పోతుందో అర్థం కావడం లేదని బాధపడతాడు. మిమ్మల్ని కొన్ని అడుగుతాను నిజాలు చెప్పండి చినమావయ్య అంటుంది ధరణి.


ధరణి: వసుధార ఏమి చెప్పలేదా?


మహేంద్ర: తనతో మాట్లాడాను కానీ తను ఏమి చెప్పలేదు


Also Read: స్వప్న ఆశల మీద నీళ్ళు చల్లేసిన రాహుల్- టామ్ అండ్ జెర్రీలా కీచులాడుకుంటున్న రాజ్, కావ్య


ధరణి అసలు విషయం చెప్పేలోపు శైలేంద్ర రావడం గమనించి కావాలని కాలు మీద బాటిల్ పడేలా చేసుకుంటుంది. తనని బయటకి తీసుకొచ్చి నిజంగానే బాటిల్ పడిందా నువ్వే పడేసుకున్నావా అని అడుగుతాడు. ఎలా జరిగినా దెబ్బ తగిలింది కదా అయినా మీరు కరెక్ట్ గా దెబ్బ తగిలే టైమ్ కి అక్కడికి ఎలా వచ్చారు చాలా ఆశ్చర్యంగా ఉందని ధరణి అనేసరికి శైలేంద్ర డౌట్ పడతాడు.


కేడీ బ్యాచ్ మొత్తం గార్డెన్ లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అటుగా రిషి వస్తాడు. వీడికి ఎలాగైనా ఝలక్ ఇవ్వాలని పాండ్యన్ అంటాడు. కొంతమంది స్టూడెంట్స్ రిషి దగ్గరకి వెళ్ళి ఏదో అడగబోతే అడగనీయకుండా చేస్తాడు. క్లాస్ కి టైమ్ అవుతుంటే ఇక్కడ ఏం చేస్తున్నారని క్వశ్చన్ చేస్తాడు. ఎన్విరాన్ మెంట్ క్లాస్ కదా అందుకే ప్రకృతిలో ఉన్నామని పాండ్యన్ అంటాడు. అవునా అయితే ప్రకృతి ఎంజాయ్ చేయాలంటే ముందు అది క్లీన్ గా ఉండాలి కదా చూడండి ఇక్కడ ఎంత చెత్త ఉందో ముందు అది శుభ్రం చేయమని రిషి ఆర్డర్ వేస్తాడు. మేం క్లీన్ చేయమని తన డ్రెస్ పాడైపోతుందని పాండ్యన్ చెప్తాడు. పక్కనే ఉన్న వేరేకడు మొన్న క్లాస్ గడియ పెట్టాడు ఇక్కడ ఏం చేస్తాడో ఏమోనని క్లీన్ చేయడానికి ఒప్పిస్తాడు. దీంతో బ్యాచ్ మొత్తం గార్డెన్ క్లీన్ చేస్తారు. జగతి మినిస్టర్ దగ్గరకి వస్తుంది.


మెడికల్ కాలేజ్ పనులు ఆలస్యమయ్యాయని అంటాడు. రిషి ఉంటే ఇలా జరిగేది కాదు, కానీ ఆరోజు మీరు రిషిని ఎందుకు పంపించారో అర్థం చేసుకున్నా. రిషికి ఏదో ఆపద ఉందని మీరు అలా చేశారు. మీకు రిషి అంటే ప్రాణమని నాకు తెలుసు తన ప్రాణాలకు ఎటువంటి ముప్పు రాకూడదని తన మీద నింద వేసి పంపించారని నాకు తెలుసు. అందుకే మీరు రిషికి వేసిన శిక్షకి నా మౌనం సమాధానంగా మారిందని మినిస్టర్ అంటాడు. ఏదో ఒక రోజు రిషి మీద పడిన నింద అబద్ధమని రుజువు చేస్తానని చెప్తుంది. వసుని కలిస్తే అన్నీ నిజాలు బయటకి వస్తాయని తను ఎక్కడ ఉందో తెలుసా అని జగతి మినిస్టర్ ని అడుగుతుంది. ఇప్పుడు మిషన్ ఎడ్యుకేషన్ పనులు మీద దృష్టి పెట్టమని సలహా ఇస్తాడు.


Also Read: వేదని చూసి కుళ్ళుకుంటున్న మాళవిక- బర్త్ డే రోజు తల్లికి అదిరిపోయే బహుమతి ఇచ్చిన ఖుషి


వసు, రిషి కాలేజ్ లో నడుస్తూ ఉంటారు. గతంలో వాళ్ళిద్దరూ ఒకరికోసం ఒకరు వెయిట్ చేసిన క్షణాలు తలుచుకుంటూ ఉంటారు. రిషి వెళ్తూ చీటీ రాసి చెట్టుకి పెడతాడు. అది వసు వచ్చి చూస్తుంది. గతం నాకు గుర్తు లేదు గుర్తు చేసే ప్రయత్నం నువ్వు చేయకని రాసిపెట్టి వెళ్ళిపోతాడు. మీతో గడిపిన క్షణాలతోనే బతుకుతున్నా ఏదో ఒకరోజు మీరు నన్ను క్షమిస్తారు మన బంధం నిలబడుతుందని అనుకుంటుంది. అటు రిషి కారులో వెళ్తూ వసుతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటాడు. ఎంత దూరం వెళ్దామని అనుకున్న జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. మీరు చేసిన ఒక తప్పు వల్ల జీవితాలు తలకిందులు అయ్యాయి. కానీ గతాన్ని గుర్తు చేసుకోవాలని అనుకోవడం లేదు. నేనెంటో తెలిసి కూడా అబద్ధం చెప్పి ఈ రిషిని చంపేశావు. ఏరోజు అయితే మీరు నా మీద నిందలు వేశారో అప్పుడే ఈ రిషి కాలిపోయాడు. నేను ఇప్పుడు ఒంటరి వాడినని బాధపడతాడు.