Trinayani June 19th: వల్లభ చిన్నపిల్ల తినడం గురించి కాస్త వెటకారంగా మాట్లాడటంతో వెంటనే అతనిపై నయని ఆగ్రహంతో ఊగిపోతుంది. ఇక విశాల్ ఇంట్లో అందరం ఉన్నప్పటికీ ఎవరు కూడా పట్టించుకోకుండా ఉన్నాము అని అలా అయితే అందరము అనాథలమే అని తన తల్లితో అంటాడు. అదే సమయంలో విశాలాక్షి అంతేకదా నాన్న అంటూ లోపలికి వస్తుంది.
ఇక హాసిని విశాలాక్షిని ఇంగ్లీషులో పలకరించడంతో తనకి ఇంగ్లీష్ ఎక్కడ వస్తుంది అని వల్లభ, తిలోత్తమా వెటకారం చేస్తూ ఉంటారు. అప్పుడే విశాలాక్షి ఇంగ్లీష్‌లో మాట్లాడటంతో షాక్ అవుతారు అంతా. ఇక మిగతా వాళ్ళందరూ విశాలాక్షిని అమ్మవార్లతో పోలుస్తూ పొగుడుతూ ఉంటారు. అదే సమయంలో విశాలక్ష్మీ అయితే అమ్మవారు అయిపోదు కదా అని తిలోత్తమా అంటుంది.
అయితే విశాలక్ష్మీ చేతిలో ఉన్న మూటను చూసి ఏంటవి అని అడగటంతో నగలు అని అంటుంది. దాంతో వల్లభ, తిలోత్తమా అవి గుడి నుంచి దొంగతనం చేసుకొచ్చిందేమో అని నిందలు వేస్తూ ఉంటారు. దానితో విశాల్ వారిపై కోప్పడుతూ ఉంటాడు. ఇక నగలు తెరిచి చూపించమని.. లేదంటే నగలు పోయాయని మనమీద నింద వేస్తుందని సుమన అనటంతో నయిని కోప్పడుతుంది.
ఆ తర్వాత నగలు సుమన తెరిచి చూడటంతో వెంటనే సుమన కళ్ళు చెదిరిపోతాయి. ఆమెతోపాటు అక్కడ ఉన్నవారందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత హాసిని ఆ నగలు తీసుకొని విశాలాక్షిని లోపలికి తీసుకొని వెళ్తుంది. కాసేపు తర్వాత తిలోత్తమా దగ్గరికి వల్లభ వచ్చి తను తేనెటీగల మూట తీసుకొచ్చాను అని చెప్పి అది విశాలాక్ష్మి గదిలో పెడితే తేనెటీగలన్నీ తనని కరుస్తాయి అని అనటంతో ఆ మూట తీసుకొని వెళ్లి అక్కడ పెట్టడానికి వెళ్తారు.
అదే సమయంలో సుమన కళ్ళు మంటతో ఇబ్బంది పడటంతో తన భర్త ఐ డ్రాప్ వేసి అక్కడ నుంచి వెళ్తాడు. ఇక డమక్క వాళ్లకి తేనెటీగలు మూట తీసుకొస్తున్నారు అనే విషయం విశాలాక్షికి చెప్పారు. అంతా చూశాను అని వాళ్లకు నా రూపాన్ని చూపిస్తాను అని చెబుతుంది. ఆ తర్వాత వల్లభ ఆ మూట తీసుకొని సైలెంట్ గా విశాలాక్షి గదిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
ఇక హాల్లో కూర్చొని ఉండగా అప్పుడే హాసిని వచ్చి వారితో వెటకారం చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక అందరూ రావటంతో విశాలాక్షి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే సుమన కూడా కళ్ళు మూసుకొని కిందికి వస్తుంది. విశాలాక్షి వచ్చాక కళ్ళు తెరుస్తాను అని అంటుంది. ఇక వల్లభ, తిలోత్తమా తనకు తేనెటీగలు కుట్టొచ్చు అని తెగ సంతోష పడుతూ ఉంటారు. కానీ అదే సమయంలో విశాలాక్షి అమ్మవారి రూపంలో తయారయ్యి వస్తుండడంతో అందరూ సంతోషపడగా తల్లి, కొడుకులిద్దరూ షాక్ అవుతారు.
Also Read: అఖిలకు వార్నింగ్ ఇచ్చిన గౌరీ- సునంద తీసుకున్న నిర్ణయానికి షాకైన సౌదామిని?