Prema Entha Madhuram June 19th: మాన్సీ పంపిన జోగమ్మ వచ్చి ఆర్యకు మరణగండం ఉందని చెప్పటంతో అందరూ షాకవుతారు. ఆర్య కూడా గతంలో జరిగిన ప్రమాదాల గురించి తలుచుకుంటాడు. ఇక దీనికి మార్గం చెప్పమని శారదమ్మ అడగటంతో.. కొన్ని రోజులు ఎక్కడికెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని చెబుతుంది. కానీ ఆర్య అది కుదరదంటూ అనుని తీసుకొచ్చే వరకు నేను దేని పైన ధ్యాస పెట్టనని అంటాడు.


జోగమ్మ మాత్రం అలా చేస్తే మీరిద్దరి విడిపోతారని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు మాన్సీ వారి మాటలు వింటూ ఉంటుంది. ఇక ఆర్య అక్కడి నుండి వెళ్తుండగా శారదమ్మ ఆపుతుంది. వద్దని చెబుతూ భయపడుతుంది. అంజలి కూడా వద్దని చెబుతుంది. కానీ ఆర్య మాత్రం వెళ్లాలని బయలుదేరుతుండగా.. శారదమ్మ ఆపేస్తుంది. అను కూడా మీకు క్షేమాన్ని కోరుకుంటుంది కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని ఇంట్లో వాళ్ళందరూ సలహా ఇస్తూ ఉంటారు.


ఇక ఆర్య తను మాత్రం అను ఆలోచనలోనే ఉన్నాను అంటూ.. ఇక్కడుంటే మరింత డిప్రెషన్ అవుతానని అంటుంటాడు. కానీ ఇంట్లో వాళ్ళు బాగా ఎమోషనల్ అవుతూ బ్రతిమాలటంతో ఆగిపోతాడు. మాన్సీ తన ప్లాన్ వర్కౌట్ అవుతుందని సంతోషపడతాడు. మరోవైపు మదన్ తన పిన్నితో ఫోన్ మాట్లాడి కట్ చేస్తాడు.


అంతలోనే అను బిడ్డని ఎత్తుకొని రోడ్డుపై కూరగాయలు అమ్ముతూ కనిపిస్తుంది. అను ఇక్కడుంది ఏంటని ఆశ్చర్యపోతాడు. వెంటనే అను ఫోటో తీసి ఆర్యకు పంపించాలని అనుకుంటాడు. కానీ అంతలోపే అనుతో ఒక ఆట ఆడుకోవాలని చూస్తుంటాడు. ఇక అను దగ్గరికి వెళ్లి ఆర్య చాలా బాధపడుతున్నాడని చెబుతాడు. ఇల్లెందుకు వదిలేసి వచ్చావని ప్రశ్నలు వేస్తూ ఉంటాడు.


ఇక ఈ విషయాన్ని ఇప్పుడే ఆర్యకు ఫోన్ చేసి చెబుతానని ఫోన్ చేస్తూ ఉండగా అను వద్దని అంటుంది. కానీ మదన్ వినకుండా ఫోన్ చేస్తూ ఉండటంతో వెంటనే అను ఆ ఫోన్ దూరంగా విసిరేస్తుంది. ఇక మదన్ ఎందుకలా చేశావని చెప్పి అక్కడి నుంచి ఫోన్ తెచ్చుకోవడానికి వెళ్లగా వెంటనే అను అక్కడి నుంచి పారిపోయి ఒక చోట దాచుకుంటుంది.


ఇక మదన్ ఈ విషయాన్ని ఆర్యకు చెప్పి మంచి మార్కులు కొట్టాలని ఆర్య దగ్గరకు బయలుదేరుతాడు. ఇంట్లో అందరూ మౌనంగా కూర్చుని ఉంటారు. ఆర్య కు ధైర్యం ఇస్తూ ఉంటారు. అప్పుడే మదన్ వచ్చి అనుని అందరూ సంతోషపడతారు. మాన్సీ మాత్రం షాక్ అవుతుంది. మదన్ జరిగిన విషయం చెప్పటంతో ఆర్య బాధపడతాడు. వెంటనే అను కోసం వెతకడానికి బయలుదేరుతూ ఉండగా శారదమ్మ బయటికి వెళ్లొద్దని అడ్డు ఆపుతుంది. కానీ ఆర్య వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉండగా బయటికి వెళ్తే తన మీద ఒట్టు అని అంటుంది శారదమ్మ. దాంతో ఆర్య షాక్ అవుతాడు.


Also Read: Rangula Ratnam June 17th: వర్ష దాచిన విషయాన్ని తెలుసుకొని బాధపడుతున్న ఆకాష్-రేఖకు షాకిచ్చిన శంకర్ ప్రసాద్?