‘మా నాన్న సూపర్ హీరో’ ఫస్ట్ లుక్: సుధీర్ బాబుకు, కేరళ లాటరీకి లింకేంటో!


టాలీవుడ్ స్టార్ హీరో సుధీర్ బాబు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. గతేడాది ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు ఈ ఏడాది వరుస ప్రాజెక్టులు చేస్తున్నారు. ఆయన రీసెంట్ గా నటించిన సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. తెలుగులో ఎమోషనల్ హిట్ అయిన ‘లూసర్’ సిరీస్ దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకు సంబంధించిన ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. మూవీ టైటిల్ ను ‘మా నాన్న సూపర్ హీరో’ అని ఖరారు చేశారు. ఫాదర్స్ డే సందర్భంగా ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ పోస్టర్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


‘ది ఆర్చీస్’ ట్రైలర్‌: కాలాన్ని వెనక్కి తీసుకెళ్లిన స్టార్ కిడ్స్ - షారుఖ్‌, అమితాబ్, శ్రీదేవి వారసులు ఇరగదీశారంతే!


జోయా అక్తర్ దర్శకత్వంలో స్టార్-కిడ్స్ సుహానా ఖాన్ (షారూఖ్ ఖాన్ కుమార్తె), ఖుషీ కపూర్ (శ్రీదేవి కుమార్తె), అగస్త్య నంద (అమితాబ్ మనువడు) అరంగేట్రం చేస్తున్న చిత్రం ‘ది ఆర్చీస్’. నెట్ ఫ్లిక్స్ లో నేరుగా విడుదలకానున్న ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ తాజాగా విడుదల అయ్యింది. 1964వ సంవత్సరంలో జరిగిన కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కొండ ప్రాంత పట్టణం సెట్ లో ఈ సినిమాను రూపొందించారు. రాక్ ఎన్ రోల్ సంగీతం నుంచి, స్నేహం, ప్రేమ, బ్రేకప్ వరకు ఇందులో చూపించారు. ఈ చిత్రం భావోద్వేగంతో నిండిపోయినట్లు కనిపిస్తోంది. వాస్తవానికి ఈ సినిమాను ప్రకటించిన నాటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే, ఈ చిత్రంతో ముగ్గురు స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


యాంకర్ విష్ణు ప్రియతో జేడీ చక్రవర్తి పెళ్లి - అసలు సంగతి ఇదీ!


యాంకర్ విష్ణుప్రియతో జేడీ చక్రవర్తి పెళ్లి జరగనుందంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. జేడీ చక్రవర్తి గారి తల్లి ఒప్పుకుంటే తమ పెళ్లి జరుగుతుందని ఇటీవలే విష్ణు ప్రియ చెప్పడంతో ఈ రూమర్స్ కు మరింత ఆజ్యం పోసినట్టయింది. అసలు నిజంగా ఇది నిజమేనా... లేదంటే ఏదైనా ప్రమోషన్ ఫ్రంట్ లో భాగమా అని చాలా మంది పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ సందేహాలు, అనుమానాలను జేడీ చక్రవకర్తి తాజాగా నివృత్తి చేశారు. అసలేమైంది, ఎందుకు ఆ తరహా వార్తలొచ్చాయి.. నిజంగా విష్ణు ప్రియ చెప్పింది నిజమేనా.. ఒకవేళ అది నిజం కాకపోతే ఆమె అలా ఎందుకు చెప్తుంది.. లాంటి అనుమానాలపై జేడీ చక్రవర్తి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


'లస్ట్ స్టోరీస్ 2' నుండి కొత్త ప్రోమో రిలీజ్ - అంతా కామమే!


టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ఈమధ్య బాలీవుడ్ లో వరుస వెబ్ సిరీస్ లు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా 'జీ కర్దా' అనే వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ని పలకరించిన తమన్నా, ఇప్పుడు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో కలిసి మొదటిసారి ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఆ వెబ్ సిరీస్ పేరే 'లస్ట్ స్టోరీస్ 2'. బోల్డ్ కంటెంట్ తో రాబోతున్న ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి రీసెంట్ గానే టీజర్ రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే తాజాగా 'లస్ట్ స్టోరీస్2' కు సంబంధించి ఓ కొత్త ప్రోమోని విడుదల చేశారు. ఇక ఈ ప్రోమోలో విజయ్ వర్మ ప్రేమకు చెప్పిన నిర్వచనాలన్నింటిని 'కామం' అంటారని తమన్నా క్లారిటీ ఇస్తుంది. దిల్వాలే దుల్హనియా లేజాయేంగే సినిమాలోని ఓ సన్నివేశాన్ని చూసి విజయ్ 'నిజమైన ప్రేమ ఉంటే ఆమె కచ్చితంగా తిరుగుతుంది' అని చెప్పడంతో ఈ ప్రోమో స్టార్ట్ అవుతుంది. అలా చెప్తున్న సమయంలో తమన్నా విజయవర్మ ఆలోచనలన్నీ తుడిచిపెట్టి.. ‘‘చాలు.. ఇది ప్రేమ కాదు, కామం’’ అని చెప్తుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


'ఆదిపురుష్'లోని డైలాగ్స్‌పై విమర్శలు - కీలక నిర్ణయం తీసుకున్న మూవీ టీమ్


 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించిన పౌరాణిక, ఇతిహాస చిత్రం 'ఆదిపురుష్' జూన్ 16న విడుదలై ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఊహించలేని విజయాన్ని సొంతం చేసుకుంది. డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాను రామాయణం ఆధారంగా తెరకెక్కించారు. అన్ని వర్గాల వారిని ఆదిపురుష్ ఆకట్టుకుంటుండడంతో ఈ సినిమాకు రికార్డ్ స్థాయి కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఇక ఈ మూవీ మేకింగ్ లోని సాంకేతికత, భారీతనం, విజువల్స్ ప్రతి ఒక్కరికి కొత్త అనుభూతిని అందిస్తున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ఈ చిత్రంలోని కొన్ని డైలాగ్స్ విషయంలో కొంతమంది ప్రేక్షకులు సూచనలు చేస్తున్నారు. వాటిని మార్చుకోవాలని లేదా తీసివేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వారి సూచనలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)