టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ఈమధ్య బాలీవుడ్ లో వరుస వెబ్ సిరీస్ లు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా 'జీ కర్దా' అనే వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ని పలకరించిన తమన్నా, ఇప్పుడు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో కలిసి మొదటిసారి ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఆ వెబ్ సిరీస్ పేరే 'లస్ట్ స్టోరీస్ 2'. బోల్డ్ కంటెంట్ తో రాబోతున్న ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి రీసెంట్ గానే టీజర్ రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే తాజాగా 'లస్ట్ స్టోరీస్2' కు సంబంధించి ఓ కొత్త ప్రోమోని విడుదల చేశారు. ఇక ఈ ప్రోమోలో విజయ్ వర్మ ప్రేమకు చెప్పిన నిర్వచనాలన్నింటిని 'కామం' అంటారని తమన్నా క్లారిటీ ఇస్తుంది. దిల్వాలే దుల్హనియా లేజాయేంగే సినిమాలోని ఓ సన్నివేశాన్ని చూసి విజయ్ 'నిజమైన ప్రేమ ఉంటే ఆమె కచ్చితంగా తిరుగుతుంది' అని చెప్పడంతో ఈ ప్రోమో స్టార్ట్ అవుతుంది. అలా చెప్తున్న సమయంలో తమన్నా విజయవర్మ ఆలోచనలన్నీ తుడిచిపెట్టి.. ‘‘చాలు.. ఇది ప్రేమ కాదు, కామం’’ అని చెప్తుంది.


అప్పుడు విజయ్ తమన్నా వాదనను ఖండిస్తూ "రాజ్, రాహుల్, ప్రేమ్ లాగా మొదటి చూపులోనే ప్రేమలో పడితే ఎలా?" అని అడిగాడు. "తొలి చూపులోనే ఇది కోరిక, ప్రేమకు సమయం పడుతుంది" అని తమన్నా మళ్లీ సమాధానం ఇచ్చింది. అంతేకాకుండా విజయ వర్మ ఈ ప్రోమోలో తనకు వచ్చిన డౌట్స్ అన్నిటిని తమన్నాకు చెబుతూ వాటిపై ఒక క్లారిటీ తీసుకుంటాడు. మీకు రాత్రులు సరిగ్గా నిద్ర పట్టకపోతే అప్పుడు మీ మనసులో ఏదో తెలియని అనుభూతి కలిగి ఉంటే ఉంటే అప్పుడు మీరు ‘లస్ట్ స్టోరిస్ 2’ కోసం ఎదురు చూస్తున్నట్లే" అంటూ ఈ ప్రోమోతో వెబ్ సిరీస్ పై మరింత ఆసక్తిని పెంచారు మేకర్స్. దీంతో ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  కాగా ఇప్పటికే 'లస్ట్ స్టోరీస్' సీజన్ వన్ ఎంత పెద్ద సంచలనాన్ని సృష్టించిందో తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ, రాధిక ఆప్టే, భూమి పెడ్నేకర్, మనీషా కొయిరాలా ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ వెబ్ సిరీస్ లో వీళ్ళ శృంగార సన్నివేశాలపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.


ఈ వెబ్ సిరీస్ ప్రశంసలతో పాటు పలు విమర్శలు, వివాదాలను సైతం ఎదుర్కొంది.. ఇక ఈ వెబ్ సిరీస్ తర్వాత బోల్డ్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లు చాలానే వచ్చాయి. కానీ లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి. ఇక ఇప్పుడు లస్ట్ స్టోరీస్ సీజన్ 2 లో కూడా నాలుగు కథల్ని చూపించనున్నారు. వీటిలో ఒక్కో కథకు ఒక్కొక్కరు దర్శకత్వం వహించారు. ఇక 'లస్ట్ స్టోరీస్ 2' వెబ్ సిరీస్ ని సుజోయ్ ఘోష్, ఆర్. బల్కి, నటి కొంకణ్ సేన్ శర్మ, అమిత్రవీంద్రనాథ్ శర్మ నలుగురు దర్శకులు తెరకెక్కించారు. తమన్నా, మృనాల్ ఠాకూర్ విజయ్ వర్మ, అమృతా సుభాష్, అంగద్ బేడీ,కాజోల్, నీనా గుప్తా, కుముద్ మిశ్రా, తిలోత్తమా షోమే నటించారు. ఇక ఇందులో తమన్నా, విజయవర్మల మధ్య వచ్చే బోల్డ్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని అంటున్నారు. తమన్న్నా కూడా విజయవర్మతో ఆ సీన్స్ లో రెచ్చిపోయి మరి నటించిందట. జూన్ 29న ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.