Stock Market Today, 19 June 2023: ఇవాళ (సోమవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 9 పాయింట్లు లేదా 0.05 శాతం గ్రీన్ కలర్‌లో 18,906 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ ఫ్లాట్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
కళ్యాణ్ జ్యువెలర్స్: ప్రైవేట్ ఈక్విటీ సంస్థ వార్‌బర్గ్ పింకస్ యాజమాన్యంలోని హైడెల్ ఇన్వెస్ట్‌మెంట్, శుక్రవారం, ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా కళ్యాణ్ జ్యువెలర్స్‌లో కొంత వాటాను విక్రయించింది.
టాటా స్టీల్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ & అంతర్జాతీయ కార్యకలాపాల కోసం రూ. 16,000 కోట్ల మూలధన వ్యయానికి (capex) ప్లాన్ చేస్తున్నట్లు టాటా స్టీల్ తెలిపింది.
PNB హౌసింగ్ ఫైనాన్స్: ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన, రూ. 5,000 కోట్ల వరకు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల (NCDs) జారీని పరిశీలించడానికి, ఆమోదించడానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఈ నెల 22న సమావేశం అవుతుంది.
ధని సర్వీసెస్: 5 సంవత్సరాల కాలానికి గుర్బన్స్ సింగ్‌ను (Gurbans Singh) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా, హోల్ టైమ్ డైరెక్టర్‌గా కంపెనీ డైరెక్టర్ల బోర్డు నియమించింది.
కల్పతరు ప్రాజెక్ట్స్: ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన, నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లను జారీ చేసి డబ్బు సమీకరించే ప్రతిపాదనను పరిశీలించి, ఆమోదించడానికి కంపెనీ బోర్డు ఈ నెల 21న సమావేశం అవుతుంది.
HDFC బ్యాంక్: హెచ్‌డిఎఫ్‌సీ ఇప్పటి వరకు జారీ చేసిన కమర్షియల్ పేపర్స్‌ను వాటి మెచ్యూరిటీ వరకు హోల్డ్ చేయడానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ను RBI నుంచి అనుమతి లభించింది. హెచ్‌డీఎఫ్‌సీ-హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మెర్జింగ్ పూర్తయిన తేదీ నుంచి ఆ కమర్షియల్ పేపర్స్ రోల్ ఓవర్ చేయకూడదు, రీఇష్యూ కూడా చేయకూడదు.
యాక్సిస్ బ్యాంక్: బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్, NS విశ్వనాథన్‌ను నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా మూడు సంవత్సరాల కాలానికి నియమించింది. ఈ ఏడాది అక్టోబర్ 27 నుంచి ఈ అప్పాయింట్‌మెంట్ అమలులోకి వస్తుంది.
ఫియెమ్ ఇండస్ట్రీస్: కంపెనీలో జరిగిన ఇటీవలి అగ్ని ప్రమాదం తర్వాత, భవనంలోని పాడైపోని భాగంలో ఉత్పత్తిని పునఃప్రారంభించినట్లు ఫియెమ్ ఇండస్ట్రీస్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. అగ్నిప్రమాదం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసే పని జరుగుతోంది, బీమా క్లెయిమ్ ప్రాసెస్‌లో ఉందని ఎక్సేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది.
క్యాస్ట్రోల్ ఇండియా: క్యాస్ట్రోల్ ఆటో సర్వీస్ వర్క్‌షాప్‌లు ప్రారంభించడానికి మహీంద్ర ఇన్సూరెన్స్ బ్రోకర్స్‌తో క్యాస్ట్రోల్ ఇండియా పార్ట్‌నర్‌షిప్ ప్రకటించింది. ఈ ఒప్పందం ప్రకారం, క్యాస్ట్రోల్ ఆటో సర్వీస్ వర్క్‌షాప్‌ల ద్వారా వెహికల్ ఇన్సూరెనస్ పాలసీలను డిస్ట్రిబ్యూట్ చేస్తారు.
ZEE: జీ ఎంటర్‌ప్రైజెస్ విషయంలో SATకి సెబీ ఇచ్చిన సమాధానంలో, ఈ కంపెనీ చైర్మన్ సుభాష్ చంద్ర, మేనేజింగ్ డైరెక్టర్ & CEO పునీత్ గోయెంక ప్రజల సొమ్మును ప్రైవేట్ సంస్థలకు మళ్లించారని మార్కెట్స్ రెగ్యులేటర్ వెల్లడించింది.
మరో ఆసక్తికర కథనం: ఆర్‌బీఐ ప్రెస్‌ల నుంచి ₹500 నోట్లు మాయం!? సెంట్రల్ బ్యాంక్ క్లారిఫికేషన్
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.