Raw Onion: ఎంతోమంది మహిళలు నెలసరి సమయంలో ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. కొందరికి వికారంగా అనిపిస్తుంది. మరికొందరికి పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. పొట్టలో తిప్పినట్లు, తిమ్మిరి పట్టినట్లు అనిపిస్తుంది. తీవ్రమైన నొప్పితో బాధపడే వారు కూడా ఎంతోమంది. ఈ నెలసరి సమస్యల నుంచి ఉపశమనం కలగాలంటే ప్రతిరోజు ఒక పచ్చి ఉల్లిపాయను తినడం అలవాటు చేసుకోవాలి. పచ్చి ఉల్లిపాయలో నెలసరి సమస్యలను తగ్గించే శక్తి ఉంది. క్రమ పద్ధతిలో నెలసరి రాకపోయినా పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల మేలు జరుగుతుంది.


ఉల్లిపాయను కూరల్లో ఇగురు కోసమే ఎక్కువ మంది ఉపయోగిస్తారు. ఉల్లిపాయతో పెద్దగా ప్రయోజనాలు లేవనుకుంటారు. కానీ పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో మన ఆరోగ్యాన్ని పెంచే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. డయాబెటిక్ రోగులు రోజూ ఉల్లిపాయను తినడం అలవాటు చేసుకోవాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. మధుమేహ రోగులకు పచ్చి ఉల్లిపాయ ఒక ఔషధం అని చెప్పుకోవచ్చు.


గుండె ఆరోగ్యానికి పచ్చి ఉల్లిపాయలు ఎంతో మేలు చేస్తాయి. రక్తం గడ్డ కట్టడం వంటివి జరగకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల గుండెపై ఒత్తిడి పడదు. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి గుండె జబ్బులు బారిన పడినవారు, గుండె సమస్యలు లేని వారు కూడా రోజూ తినడం అలవాటు చేసుకోవాలి.


పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల రోగనిరోధక శక్తి బలంగా మారుతుంది. ముఖ్యంగా మధుమేహ రోగులకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వారు పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. పిల్లలకు కూడా పచ్చి ఉల్లిపాయ తినడం అలవాటు చేస్తే వారు త్వరగా జలుబు, జ్వరం, దగ్గు వంటి వాటి బారిన పడకుండా ఉంటారు. ఉల్లిపాయల్లో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే శక్తి ఉంది. కాబట్టి గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాలను ఇది తగ్గిస్తుంది.


వేసవిలో కచ్చితంగా పచ్చి ఉల్లిపాయలను తినాలని చెబుతారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే ఇవి శీతలీకరణ లక్షణాలను కలిగి ఉంటాయి. శరీరానికి చలువ చేస్తాయి. వడదెబ్బ నుంచి మిమ్మల్ని కాపాడతాయి. నిద్రలేమి వంటి సమస్యలు రాకుండా ఇది అడ్డుకుంటుంది. లైంగిక శక్తిని పెంచడంలో కూడా ఇవి ముందుంటాయి.  క్యాన్సర్ ను అడ్డుకునే శక్తి దీనికి ఉంది. దీనిలోని పోషకాలు అనేక రకాల క్యాన్సర్లను అడ్డుకుంటాయి.



Also read: తరచూ తలనొప్పి వస్తుందా? కంటి చూపు కూడా తగ్గుతోందా? బ్రెయిన్ ట్యూమర్ ఏమో అనుమానించాల్సిందే




Also read: పిల్లలకే కాదు పెద్దవారు కూడా కచ్చితంగా తీసుకోవాల్సిన వ్యాక్సిన్లు ఇవిగో






































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.