Belly Fat: బరువు పెరిగిన ప్రతి ఒక్కరిలో పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవడం సహజం. దీనివల్ల అందవికారంగా కనిపిస్తారు. పొట్ట దగ్గర చేరిన కొవ్వును కరిగించడం కాస్త కష్టమైన పని. వ్యాయామాలు చేసి, ఆహార పద్ధతులను మార్చుకోవడం ద్వారా పొట్ట దగ్గర కొవ్వును కరిగించవచ్చు. అలాగే మూడు రకాల టీలను రోజూ తాగడం వల్ల కూడా ఆ కొవ్వును కరిగించవచ్చని చెబుతున్నారు పోషకాహారనిపుణులు.  వీటిలో క్యాలరీలను బర్నింగ్ చేసే శక్తి ఉంటుంది. ఆ మూడు టీలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


అల్లం టీ 
అల్లం టీని ఇష్టపడేవారు చాలా ఎక్కువ. కానీ రోజూ తాగరు. చక్కెర కలిపిన టీ తాగడానికే ఎక్కువమంది ఇష్టపడతారు. అల్లం... ఔషధ గుణాలున్న ఒక మసాలా ఇది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అల్లం పైన తొక్కను తీసి సన్నగా తురమండి. స్టవ్ పై గిన్నె పెట్టి నీళ్ళు పోయండి. ఆ నీళ్లను మరగబెట్టండి. నీళ్లు సలసలా మరుగుతున్నప్పుడు అల్లం తురుమును వేయండి. పావుగంట సేపు మరగనివ్వండి. దాన్ని గోరువెచ్చగా అయ్యాక వడకట్టి, ఆ నీటిలో తేనె, నిమ్మరసం కలుపుకొని తాగండి. రోజు తాగుతూ ఉంటే పొట్ట దగ్గర కొవ్వు సులభంగా కరుగుతుంది.


కాశ్మీరీ టీ 
ఈ కాశ్మీరీ టీని కహ్వా అని కూడా పిలుస్తారు. ఇది ఒక సుగంధ పానీయం దీని రుచి అదిరిపోతుంది. అతిధులకు అందించేందుకు ఇది ప్రత్యేకమైన టీ గా చెప్పుకోవచ్చు. ఈ టీ లో ఎన్నో మసాలా దినుసులు కలిసి ఉంటాయి. అలాగే గ్రీన్ టీ కూడా  దీనిలో కలిసి ఉంటుంది. కాబట్టి పోషకాలు రెట్టింపుగా లభిస్తాయి. స్టవ్ మీద గిన్నె పెట్టి నీళ్ళు పోయాలి. నీరు మరిగిన తర్వాత అందులో కుంకుమపువ్వు రేకులు, దాల్చిన చెక్క, లవంగం, యాలకులు, ఎండిన గులాబీ రేకులు వేసి మూడు నుంచి నాలుగు నిమిషాలు మరగబెట్టాలి. తర్వాత స్టవ్ కట్టేయాలి. వాటిని ఒక గ్లాసులో వేసి వడకట్టాలి. ఆ టీలో గ్రీన్ టీ పొడిని కూడా కలుపుకోవాలి. అంతే కాశ్మీర్ టీ ఘుమఘుమలాడిపోతుంది. దీని రుచి అందరికీ నచ్చుతుంది. 


గ్రీన్ టీ 
గ్రీన్ టీ చేసే మేలు ఎంత చెప్పినా తక్కువే. గ్రీన్ టీని రోజుకు రెండుసార్లు తాగడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. గ్రీన్ టీ సాచెట్లు బయట దొరుకుతున్నాయి. మరిగించిన నీళ్లలో గ్రీన్ టీ సాచెట్ వేసి బాగా కలిపి, కాస్త తేనె కలుపుకొని తాగితే మేలు జరుగుతుంది.


ఈ మూడు రకాల టీలలో పొట్ట దగ్గర పట్టిన కొవ్వును కరిగించే లక్షణం ఉంది. 


Also read: ఇక్కడున్న అంకెల్లో తేడాగా ఉన్న అంకె ఎక్కడుందో కనిపెట్టండి, అది కూడా పది సెకన్లలో...


Also read: నా భర్త తమ్ముడే నా మాజీ లవర్, ఈ విషయం నా భర్తకి ఎలా చెప్పాలి?












































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.