Top 5 Telugu Headlines Today 11 June 2023:  
రైతులకు ఉచిత విద్యుత్ 3 గంటలు చాలన్న రేవంత్‌- మండిపడుతున్న బీఆర్‌ఎస్‌
ఉచిత విద్యుత్‌పై పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి చేసిన కామెంట్స్‌ తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. ఆయన ఈ వ్యాఖ్యలు చేసి 24 గంటలక గడవక ముందే టీఆర్‌ఎస్‌ యుద్ధం ప్రకటించేసింది. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా దిష్టిబొమ్మల దహనాలు, నిరసనలకు పిలుపునిచ్చింది. రేవంత్ చేసిన కామెంట్స్‌ను ట్విటర్ వేదికగా మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఖండించారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానాలకు అద్దం పట్టిందన్నారు. ఈ విధానానికి వ్యతిరేకంగా మంగళవారం, బుధవారం తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు బీఆర్‌ఎస్‌ పిలుపునిస్తుందని తెలిపారు.  పూర్తి వివరాలు  


ఒక్క అడుగుతో ప్రారంభమై 2 వేల కిలోమీటర్లకు - యువగళం పాదయాత్రలో మరో మైలురాయి !
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్  పాదయాత్ర  2 వేల కిలోమీటర్లు పూర్తయింది.  నెల్లూరు జిల్లాలో శిలాఫలకాన్ని నారాలోకేష్ ఆవిష్కరించారు. జనవరిలో ప్రారంభమైన పాదయాత్ర నిరాటకంగా సాగుతోంది.  పండుగ రోజులు.. ఓ కుటుంబ కార్యక్రమం.. మరో సారి ఎన్నికల నిబంధనల పేరుతో అడ్డుకున్న సందర్భం తప్ప… లోకేష్ తనకు అనారోగ్యమని.. లేకపోతే మరో వ్యక్తిగత కారణంతో కానీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. కాళ్లకు బొబ్బలెక్కినా నిరంతరాయంగా నడుస్తూనే ఉన్నారు.  పూర్తి వివరాలు  


రేవంత్ వ్యాఖ్యలను అస్త్రంలా వాడుకున్న బీఆర్‌ఎస్‌- కౌంటర్ చేయడంలో కాంగ్రెస్ తడబడిందా?
అసలే ఎన్నికల సీజన్. ఈ టైంలో అరటి పండుతున్నా రాజకీయా పార్టీలకు పన్ను ఊడే పరిస్థితి ఉంటుంది. అందుకే ఆచితూచి మాట్లాతుంటారు. కొందరైతే ఈ ఎన్నికల సీజన్‌ పూర్తి అయ్యే వరకు మీడియా ఫోన్‌లకు కూడా దూరంగా ఉంటారు. సాధ్యమైనంత వరకు కాంట్రవర్సీలు లేకుండా ఉండాలని చూస్తుంటారు. ఇలాంటి సమయంలో ఎవరైనా నాయకుడు నోరు జారారా అంతే. ప్రత్యర్థులకు చిక్కినట్టే. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అలానే ఉంది.  ఉచిత విద్యుత్‌ పై పీసీసీ చీఫ్ రేవంత్ చేసిన కామెంట్స్‌ను టైమ్లీగా వాడుకుంది బీఆర్‌ఎస్‌. కర్ణాటక ఎన్నికల తర్వాత జోష్‌ మీద ఉన్న ఆపార్టీ మానసి స్థైర్యం దెబ్బ తీసేందుకు ఈ వ్యాఖ్యలపై దూకుడుగా వ్యూహాన్ని రచించింది.  పూర్తి వివరాలు  


అమరావతి కేసు డిసెంబర్ కు వాయిదా - ప్రతి వాదులందరికీ నోటీసులివ్వాలన్న సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టులో అమరావతి కేసులపై విచారణ డిసెంబర్‌కు వాయిదా పడింది.  ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనం ముందు..  వాదనలు వినిపించేందుకు 3 గంటల సమయం కావాలని కోరిన సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు. ఆయన ప్రభుత్వం తరపున వాదిస్తున్నారు. అయితే ఈ సందర్భంలో  ప్రతివాదులందరికీ నోటీసులు పంపే ప్రక్రియ పూర్తయిందా అని  ధర్మాసనం ప్రశ్నించింది.  ప్రతివాదుల్లో ఇద్దరు చనిపోయారని వెల్లడించిన అమరావతి రైతుల తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.  చనిపోయినవారిని జాబితా నుంచి తొలగించాలని కోరిన ఏపీ ప్రభుత్వం కోరింది.  పూర్తి వివరాలు


రాజయ్య కామెంట్స్‌పై పార్టీ హైకమాండ్ అసహనం- ప్రగతి భవన్‌ నుంచి పిలుపు!
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్యకు ప్రగతి భవన్‌ నుంచి పిలుపు వచ్చింది. ఆయన కొన్ని రోజులుగా చేస్తుున్న కామెంట్స్‌పై కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. అందుకే వాటిపై వివరణ అడిగేందుకే ప్రగతి భవన్‌కు పిలిచారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల రాజయ్య తరచూ కడియం శ్రీహరిని టార్గెట్‌ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఏకంగా ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా ఈ విభేదాల్లోకి లాగడంతో ఇష్యూ సీరియస్ అయింది. దీంతో రాజయ్యను అధిష్ఠానం పిలిచినట్టు తెలుస్తోంది.  పూర్తి వివరాలు