Nara Lokesh 2000KM :  తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్  పాదయాత్ర  2 వేల కిలోమీటర్లు పూర్తయింది.  నెల్లూరు జిల్లాలో శిలాఫలకాన్ని నారాలోకేష్ ఆవిష్కరించారు. జనవరిలో ప్రారంభమైన పాదయాత్ర నిరాటకంగా సాగుతోంది.  పండుగ రోజులు.. ఓ కుటుంబ కార్యక్రమం.. మరో సారి ఎన్నికల నిబంధనల పేరుతో అడ్డుకున్న సందర్భం తప్ప… లోకేష్ తనకు అనారోగ్యమని.. లేకపోతే మరో వ్యక్తిగత కారణంతో కానీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. కాళ్లకు బొబ్బలెక్కినా నిరంతరాయంగా నడుస్తూనే ఉన్నారు  [ 





 


బ్రేక్ లేకుండా పాదయత్ర
 
అసలు ఒక్క రోజు విరామం ఇద్దామనే ఆలోచనే రానీయడం లేదు. పైగా రోజంతా లోకేష్ షెడ్యూల్ చాలా బిజీగా ఉంటుంది. తెల్లవారు జాము నుంచి అర్థరాత్రి వరకూ ఆయన ప్రజలు , పార్టీ క్యాడర్ మధ్యే ఉంటున్నారు. రోజూ వందల మందికి సెల్ఫీలు ఇస్తున్నారు. తనతో కలిసి నడిచేందుకు వస్తున్నవారందరితో మాట్లాడుతున్నారు. ఉదయం.. మధ్యాహ్నం… సాయంత్రం ఇలా ప్రతి సందర్భంలోనూ ఆయనచుట్టూ వందల మంది ఉంటున్నారు. అయినా ఎక్కడా చిన్న రిమార్క్ లేకుండా చిరునవ్వుతోనే ఉంటున్నారు. ప్రజల మధ్య ఉండటం తనకు ఇష్టమని చేతలతో చూపిస్తున్నారు. అదే సమయంలో తన పాదయాత్ర లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి ఆయన విభిన్న వర్గాలతో సమావేశం అవుతున్నారు. వారికి భరోసా ఇస్తున్నారు. ఎవరికైనా సాయం అవసరం అనుకుంటే తక్షణం చేస్తున్నారు. 


లోకేష్ పట్టుదలకు టీడీపీ క్యాడర్ ఫిదా 


పాదయాత్రకు రాను రాను ఆదరణ పెరుగుతోందని టీడీప నేతలంటున్నారు.  మొదట కుప్పంలో పాదయాత్ర ప్రారంభమైన తర్వాత చిత్తూరు జిల్లాలో పాదయాత్రకు జనం లేరంటూ చెప్పడానికి ప్రత్యర్థులు ప్రయత్నించారు కానీ ఇప్పుడు ఆ సాహసం చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఎక్కడికక్కడ లోకేష్ వెంట నడిచేవారిలో పది వేల మంది కంటే తక్కువ ఎక్కడా ఉండటం లేదు. నిజానికి లోకేష్ సీఎం అభ్యర్థి కాదు.. ఓ పార్టీ అధ్యక్షుడు కాదు.. ఏ ప్రత్యేకమైన పదవిలో లేరు. కానీ పార్టీ కోసం పని చేసిన ఇమేజ్ ఆయనకు ఇలా అటెన్షన్ తీసుకొచ్చింది. పట్టుదలతో తన ఇమేజ్ మేకోవర్ చేసుకోవడంలో లోకేష్ అద్భుతమైన పురోగతి సాధించారని టీడీపీ క్యాడర్ సంతోషపడుతోంది.  చివరికి లక్ష్యం చేరగలడని అందరిలోనూ నమ్మకం కలిగించారని అంటున్నారు. 
 
అభినందిస్తున్న పార్టీ నేతలు , సానుభూతిపరులు 


లోకేష్ పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లు పూర్తయింది. మరో రెండు వేల కిలోమీటర్ల దూరం సాగనుంది. నాలుగు వందల రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని నారా లోకేష్ పెట్టుకున్నారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకూ యాత్ర సాగనుంది. రెండు వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయిన సందర్భంగా పలువురు సోషల్ మీడియాలో నారా లోకేష్ ను అభినందించారు.