Stock Market Update: Q1FY24 ఎర్నింగ్స్ ప్రకటించే సీజన్ స్టార్ట్ కావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో, కొన్ని బ్రోకింగ్ కంపెనీలు నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్, ల్యాండ్‌మార్క్ కార్స్, అవలాన్ టెక్నాలజీస్, రేమండ్ కంపెనీ స్టాక్స్ మీద కొత్తగా కవరేజ్ ప్రారంభించాయి. ఈ కౌంటర్లలో వాల్యూ అన్‌లాకింగ్‌కు బలమైన అవకాశం ఉందని బ్రోకరేజ్‌లు చెబుతున్నాయి, ఈ స్టాక్స్‌కు ప్రైస్ టార్గెట్లను 28% వరకు పెంచాయి.
కవరేజ్ స్టార్ట్ చేసిన స్టాక్‌కు సంబంధించి ప్రతి చిన్న విషయాన్ని బ్రోకింగ్ కంపెనీలు పట్టించుకుంటాయి. కంపెనీ బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్స్, స్ట్రాటెజీలు, టాప్ మేనేజ్‌మెంట్ కెపాసిటీ సహా చాలా విషయాలను రాడార్‌లో పెట్టుకుంటాయి. స్టాక్‌కు సంబంధించి టెక్నికల్ అనాలసిస్ కూడా చేస్తాయి. ఈ అంశాలన్నింటినీ బేస్ చేసుకుని, ఆ స్టాక్‌కు రేటింగ్, టార్గెట్ ప్రైస్ ప్రకటిస్తాయి. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, ఒక కంపెనీ అభివృద్ధి మీద సంబధిత బ్రోకింగ్ కంపెనీ వేసిన అంచనాలు, పెట్టుకున్న నమ్మకాలు ఆ స్టాక్ రేటింగ్‌లో కనిపిస్తాయి. ఉదా.. ఒక బ్రోకింగ్ కంపెనీ ఒక స్టాక్‌కు "బయ్" రేటింగ్ ఇచ్చిందంటే, ఆ కంపెనీకి పాజిటివ్ ట్రిగ్గర్స్ కనిపిస్తున్నాయని అర్ధం. "సెల్" రేటింగ్ ఇచ్చిందంటే, నెగెటివ్ ట్రిగ్గర్స్ కనిపిస్తున్నాయని ఆ బ్రోకింగ్ ఫర్మ్ నమ్ముతోందని అర్ధం.
Q1FY24 ఫలితాలకు ముందు బ్రోకింగ్ సంస్థలు కవరేజ్ ప్రారంభించిన 4 స్టాక్స్:
నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ (Nexus Select Trust) | ప్రస్తుతం ఒక్కో షేర్ ధర: రూ. 112
బ్రోకింగ్ కంపెనీ కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్, నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ కౌంటర్‌పై కవరేజ్ ప్రారంభించింది. ఈ స్టాక్‌కు "యాడ్" రేటింగ్ ఇచ్చిన బ్రోకరేజ్, ప్రైస్ టార్గెట్‌గా రూ. 120 ప్రకటించింది. ప్రస్తుత షేర్ ధర నుంచి మరో 7% అప్‌సైడ్ పొటెన్షియల్‌ను ఈ టార్గెట్ ప్రైస్ సూచిస్తోంది.
ల్యాండ్‌మార్క్ కార్స్ (Landmark Cars) | ప్రస్తుతం ఒక్కో షేర్ ధర: రూ. 764
ల్యాండ్‌మార్క్ కార్స్‌పై కవరేజీని ఫిలిప్ క్యాపిటల్ స్టార్ట్ చేసింది. 903 రూపాయల టార్గెట్ ధర ప్రకటించింది. ల్యాండ్‌మార్క్ కార్స్ షేర్లు కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి మరో 18% జంప్ చేసే అవకాశం ఉందన్నది ఈ ప్రైస్ టార్గెట్ అర్ధం.
అవలాన్ టెక్నాలజీస్ (Avalon Technologies) | ప్రస్తుతం ఒక్కో షేర్ ధర: రూ. 612
దలాల్ & బ్రోచా స్టాక్ బ్రోకింగ్, "బయ్" రేటింగ్‌తో అవలాన్ టెక్నాలజీస్‌పై కవరేజ్ ప్రారంభించింది. బ్రోకరేజ్ సంస్థ, ఈ స్టాక్‌పై టార్గెట్ ధరను రూ. 781గా నిర్ణయించింది. ఇది, ప్రస్తుత మార్కెట్ ధర నుంచి 28% అప్‌సైడ్ పొటెన్షియల్‌ను సూచిస్తోంది.
రేమండ్ (Raymond) | ప్రస్తుతం ఒక్కో షేర్ ధర: రూ. 1,803
ఇన్‌క్రెడ్ ఈక్విటీస్, "యాడ్" రేటింగ్‌తో రేమండ్ స్టాక్‌ను రాడార్‌లోకి తీసుకుంది. ఈ స్టాక్‌పై టార్గెట్ ప్రైస్‌ను రూ. 2,200గా బ్రోకరేజ్ సంస్థ ఫిక్స్ చేసింది. ఈ స్టాక్ ప్రస్తుత మార్కెట్ ప్రైస్ నుంచి మరో 22% పెరిగేందుకు సిద్ధంగా ఉందని ఈ ప్రైస్ టార్గెట్ అర్ధం.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: పసిడి వెలుగు స్థిరం - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial