OMG 2 Teaser Release : అక్షయ్ కుమార్ లేటెస్ట్ మూవీ 'ఓ మై గాడ్ 2' (OMG 2) ఆగస్టు 11న రిలీజ్ కానున్న నేపథ్యంలో మూవీ మేకర్స్ టీజర్‌‌ రిలీజ్ చేశారు. అక్షయ్ శివుడి అవతారం వేరే లెవల్ లో ఉంది. ఈ టీజర్ లో శివుని భక్తుడిగా నటించిన పంకజ్ త్రిపాఠి.. తన జీవితంలోని అన్ని అడ్డంకుల నుంచి విముక్తి చేయాలని ప్రార్థించడం సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. ఈ సందర్భంగా టీజర్ వీడియోను షేర్ చేసిన అక్షయ్ కుమార్.. "విశ్వాసం ఉంచండి.. OMG 2 టీజర్ ఇప్పుడే విడుదలైంది. ఆగస్ట్ 11న థియేటర్లలో రానుంది" అంటూ క్యాప్షన్ లో రాసుకొచ్చారు.


'OMG 2' సినిమా 2012 లో వచ్చిన సూపర్ కామెడీ-డ్రామాగా తెరకెక్కిన 'ఓ మై గాడ్' (OMG)కు సీక్వెల్. ఇందులో అక్షయ్ కుమార్ కృష్ణ వాసుదేవ్ యాదవ్ పాత్రను పోషించాడు. అతను చివరికి శ్రీకృష్ణుడు అని తెలుస్తుంది. పరేష్ రావల్, మిథున్ చక్రవర్తి, మహేష్ మంజ్రేకర్, ఓం పూరి, మురళీ శర్మ, గోవింద్ నామ్‌డియో, తదితర నటులు ఈ సినిమాలో నటించారు. 'రోడ్ టు సంగమ్' (2009), 'చీర్ హరన్' (2021) వంటి చిత్రాలను రూపొందించిన అమిత్ రాయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.



ఈ అవైటెడ్ సీక్వెల్ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుండడంతో అక్షయ్ ఫ్యాన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'ఓ మై గాడ్ 1'లో కృష్ణుడిగా ఆదరించిన అక్షయ్ ని.. ఈ సారి శివుడిగా ఎలా చూస్తారోనని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా రిలీజైన ఈ మూవీ టీజర్ నెటిజన్లను కూడా బాగా ఆకట్టుకుంటోంది. అక్షయ్‌ను శివుని వేషంలో చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీ ఖచ్చితంగా బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని, చరిత్రలో నిలిచిపోతుందని అభిమానులు ఆశిస్తున్నారు.






11 ఏళ్ల తర్వాత ‘ఓ మై గాడ్’ సినిమాకు సీక్వెల్ చేస్తున్న అక్షయ్ కుమార్.. ఇటీవలే అతని ఫస్ట్ లుక్ పై మరింత ఆసక్తిని పెంచేలా అప్ డేట్ ఇచ్చారు. అప్పటికే టీజర్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు మంచి బూస్టప్ అందించారు. 'ఓఎంజీ2' టీజర్ రిలీజ్ డేట్‍ను ఓ ప్రోమో వీడియోతో అక్షయ్ వెల్లడించాడు. తాను శివుడి వేషంలో ఉన్న ఓ వీడియోను అక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నలుపు రంగు దుస్తులు ధరించి.. పొడవైన జుట్టు, కళ్లకు కాటుక ఇంకా నుదుటిపై నామాలతో అక్షయ్ ఈ వీడియోలో కనిపించి అందర్నీ మెస్మరైజ్ చేశాడు. శివుడి వేషధారణలో చాలా ఇంటెన్స్‌గా ఈ ప్రోమోలో నడిచాడు అక్షయ్. బ్యాక్‍గ్రౌండ్‍లో 'హర హర మహాదేవ్' నినాదాలు అభిమానుల్ని మరో లోకంలోకి తీసుకెళ్లాయి. ఇక ఈ 'ఓఎంజీ 2' టీజర్‌ను జులై 11వ తేదీన  విడుదల చేయనున్నట్టు కూడా అప్పట్లో అక్షయ్ కుమార్ తెలిపాడు. 


ఈ సినిమాతో బాలీవుడ్ లో మరో మాస్టర్ పీస్ మూవీ వచ్చేస్తోందంటూ ఫ్యాన్స్ ఎంతో సంతోషపడుతున్నారు. అయితే, ఈసారైనా ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా జాగ్రత్త పడాలని అభిమానులు చిత్రయూనిట్‍ని సూచిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే హిందూ నేపథ్యంలో వచ్చిన 'బ్రహ్మస్త్ర', 'ఆదిపురుష్' సినిమాలు పలువురు మనో భావాలు దెబ్బ తీశాయని ఈసారి అలా కావొద్దంటూ హెచ్చరిస్తున్నారు. కాగా తాజాగా రిలీజైన ఈ టీజర్‌కు సెన్సార్ బోర్డు యూ సర్టిఫికేట్ ఇచ్చిందని సమాచారం.


Read Also : Rashmika: రష్మిక చేతిలో ఫోన్ లాగేసుకున్న బౌన్సర్ - ట్విస్ట్ ఎమిటంటే..


ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial