Top 5 Telugu Headlines Today 04 October 2023:


తెలంగాణ బీజేపీలో తగ్గని అసంతృప్త నేతలు - నిజామాబాద్ సభకూ డుమ్మా ! వాట్ నెక్ట్స్
ప్రధాని మోడీ నిజామాబాద్ భారీ బహిరంగ సభకు పలువురు సీనియర్లు మరోసారి గైర్హాజరయ్యారు. మొన్నటికి మొన్న పాలమూరు సభకు అటెండ్ అవ్వని నేతలంతా ఈ సభకు కూడా హాజరు కాలేదు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాలమూరు సభకు హాజరై.. నిజామాబాద్ సభకు వెళ్లలేదు. ఇకపోతే మాజీ ఎంపీ వివేక్ పాలమూరు సభ సందర్భంగా శంషాబాద్ వరకు వెళ్లి ప్రధానికి స్వాగతం పలికారు. కానీ సభకు వెళ్లలేదు. ప్రధాని నిజామాబాద్‌లో ఉండగా.. వివేక్ ఢిల్లీకి వెళ్లడం గమనార్హం. అక్కడ రాష్టప్రతి ద్రౌపది ముర్మును ఆయన కలిశారు. కాగా ఈ సభకు విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి సైతం గైర్హాజరయ్యారు. పూర్తి వివరాలు


త్వరలోనే బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో-మహిళలకు శుభవార్త రాబోతోందన్న మంత్రి హరీష్‌రావు
తెలంగాణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు హామీలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీలు ప్రకటించింది. అయితే... కాంగ్రెస్‌ గ్యారెంటీల కంటే  మిన్నగా ఉండేలా బీఆర్‌ఎస్‌ కూడా మేనిఫెస్టో రూపకల్పన చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో రాబోతోందని మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. అంతేకాదు..  మహిళ ఆర్థికాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టిపెట్టారన్నారు. కొత్త మేనిఫెస్టోలో మహిళల ఆర్థిక బలోపేతం కోసం హామీలు ఉంటాయన్నారు. ఆ హామీలు ఏంటో.  త్వరలోనే తెలుస్తుందని చెప్పారు. ఆ శుభవార్తను త్వరలోనే అందరూ వింటారని కూడా చెప్పారు మంత్రి హరీష్‌రావు. పూర్తి వివరాలు


పవన్‌కు కృష్ణా జిల్లా పోలీసుల నోటీస్‌- ఆధారాలు సమర్పించాలని ఆదేశం
వారాహి యాత్రలో భాగంగా ఇవాళ పెడన సభలో సభ జరగనుంది. ఈ సభలో ప్రభుత్వం అసాంఘిక శక్తులతో దాడులు చేయించేందుకు కుట్ర చేస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపణలు చేశారు. ఈ కామెంట్స్‌ ఒక్కసారిగా కలకలం సృష్టిస్తున్నాయి. తీవ్ర ఆరోపణలపై పోలీసులు స్పందించారు. పవన్ చేసిన ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సమర్పించాలని జనసేన అధినేతకు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ సమాచారానికి బేస్ ఏంటని ప్రశ్నించారు. పూర్తి వివరాలు


వైసీపీలో త్వరలో నామినేటెడ్‌ పదవుల భర్తీ-ఎన్నికల వేళ సీఎం జగన్‌ వ్యూహం
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలలే సమయం ఉంది. ఈసారి 175కి 175 కొట్టాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తోంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ. ప్రజలకు ఇచ్చిన  హామీలన్నీ నెరవేస్తున్న సీఎం జగన్‌... పార్టీపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. టికెట్ల కేటాయింపు తర్వాత... నేతల్లో అసంతృప్తి పెరగకుండా ముందస్తుగానే చర్యలు  తీసుకుంటున్నారు. ఇప్పటికే పార్టీ నేతలకు ఆ దిశగా.. కీలక సూచనలు కూడా చేశారు. ఆశించిన వారందరికీ టికెట్లు ఇవ్వలేకపోయినా బాధపడాల్సి అవసరం లేదని... వారికి  అండగా ఉంటామని ప్రకటించారు సీఎం జగన్‌. టికెట్లు రానివారు తన వారు కాదని అనుకోవద్దని ముందస్తు సూచనలు చేశారు. పూర్తి వివరాలు


తెలంగాణలో కాంగ్రెస్ జాబితా మరింత ఆలస్యం, ఆశావాహుల్లో పెరిగిపోతున్న టెన్షన్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ ఆశావహుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఈ నెల మొదటి వారంలో తొలి జాబితా విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ...అనుకోని పరిస్థితులతో వాయిదా పడినట్లు తెలుస్తోంది. కేంద్రం ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికే తెలంగాణలో పర్యటిస్తున్నారు. రాజకీయ పార్టీలు, జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించింది. ఎన్నికల సన్నద్దతపై పలు సూచనలు చేసింది. పూర్తి వివరాలు