వారాహి యాత్రలో భాగంగా ఇవాళ పెడన సభలో సభ జరగనుంది. ఈ సభలో ప్రభుత్వం అసాంఘిక శక్తులతో దాడులు చేయించేందుకు కుట్ర చేస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపణలు చేశారు. ఈ కామెంట్స్‌ ఒక్కసారిగా కలకలం సృష్టిస్తున్నాయి. తీవ్ర ఆరోపణలపై పోలీసులు స్పందించారు. 


పవన్ చేసిన ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సమర్పించాలని జనసేన అధినేతకు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ సమాచారానికి బేస్ ఏంటని ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా వ్యాఖ్యలు, ఆరోపణలు చేయడం సరికాదని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా కౌంటర్ ఇచ్చారు. తాము ఇచ్చిన నోటీసులకు రిప్లై రాలేదని అలా రాని పక్షంలో ఆయన చేసిన ఆరోపణలు నిజం కావని అభిప్రాయపడాల్సి ఉంటుందన్నారు. 


పవన్‌ కల్యాణ రెచ్చగొట్టే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని అందుకే నోటీసులు ఇచ్చామన్నారు పోలీసులు. దాడులు జరగుతాయనే సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని కోరినట్టు పేర్కొన్నారు. తాము పంపిన నోటీసులకు పవన్‌ నుంచి ఎలాంటి రిప్లై రాలేదని పోలీసులు వివరించారు. రిప్లై రాలేదంటే ఆయన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారాని అనుకోవాలా? అని ప్రశ్నించారు. ఎటువంటి సమాచారంతో పవన్‌ వ్యాఖ్యలు చేశారని నిలదీశారు. 


సరైన ఆధారాల్లేకుండా వ్యాఖ్యలు, ఆరోపణలు చేయకూడదని పోలీసులు హితవు పలికారు. ఇంకా ఏమన్నారంటే...బాధ్యతారాహిత్యంగా ఆరోపణలు చేస్తే పర్యవసానాలు ఉంటాయి. రెచ్చగొట్టే భాష, సైగలు మానుకుని మాట్లాడాలి. మా సమాచార వ్యవస్థ మాకుంది. పవన్‌ కంటే నిఘా వ్యవస్థ మాకు బలంగా ఉంది. అసాంఘిక శక్తులుంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం’’ అని ఎస్పీ జాషువా అన్నారు. 


 


పవన్ ఏమన్నారంటే?


పెడనలో జరగనున్న వారాహి యాత్రలో అలజడి సృష్టించేందుకు  వైఎస్ఆర్‌సీపీ గూండాలు, రౌడీలతో ప్రయత్నిస్తోందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. రాళ్ల దాడులు చేసి రక్తపాతం సృష్టించాలని అనుకుంటున్నారని  మచిలీపట్నంలో ఆరోపించారు. ఈ అంశంపై తనకు స్పష్టమైన సమాచారం ఉందని.. వైసీపీ వాళ్లు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని పార్టీ శ్రేణులను కోరారు. వారాహి యాత్రపైకి రాళ్లతో ఎవరైనా దాడులకు వస్తే వారిపై దాడి చేయవద్దని పట్టుకుని పోలీసులకు అప్పగించాలన్నారు. 


రెండు, మూడు వేల మందితో దాడి చేసే ప్రయత్నం          


పెడనలో రెండు, మూడు వేల మంది రౌడీముకలు రాళ్ల దాడుల కోసం వచ్చే అవకాశం ఉందన్నారు. పెడనలో జరిగే పరిణామాలకు ప్రభుత్వం, డీజీపీ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పులివెందుల రౌడీయిజం చేయాలని చూస్తే  ఊరుకోమని ఈ అంశంపైతమకు స్పష్టమైన  సమాచారం ఉందన్నారు.  జగన్ రెడ్డి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలేస్తే భవిష్యత్‌లో దారుణమైన పరిస్థితులు ఉంటాయని గుర్తుంచుకోవాలని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. 


జోగి రమేష్ వ్యవహారశైలిపై అనుమానాలు