Top 5 Telugu Headlines Today 03 September 2023: 


ఐటీ నోటీసులు సాధారణమే, ఆధారాలు చూపాల్సిన పనేలేదు - చంద్రబాబు
ఆదాయపు పన్ను శాఖ నోటీసులకు ఆధారాలు చూపాల్సిన అవసరమే లేదని, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల సమయంలో తన పై ఇలాంటి ఆరోపణలు చేయటం సర్వసాధారణమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి ఐదేళ్ళకు ఒకసారి ఎన్నికలు వస్తుంటాయని, అలాటి సమయంలోనే తనపై  ప్రతి సారీ ఆరోపణలు చేస్తారని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నారంటూ ఐటీ నోటీసులు ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. అలాంటి వాటికి ఆధారాలు చూపాల్సిన అవసరమే లేదని చంద్రబాబు లైట్ తీసుకున్నారు. జగన్ పని అయిపోయిందని, జగన్ ఇంటికి పోవడం ఖాయమని వ్యాఖ్యానించారు.  పూర్తి వివరాలు


మరో వివాదంలో ఎమ్మెల్యే మైనంపల్లి, ఆ ఫిర్యాదుపై కలెక్టర్‌కు కీలక ఆదేశాలు
మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇటీవల వార్తల్లో ఎక్కువ నిలుస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ అగ్రనేతల్లో ఒకరైన మంత్రి హరీశ్ రావుపై వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అగ్రనేతల గురించి కూడా మాట్లాడిన ఆడియో రికార్డింగ్ లు బయటికి వచ్చాయి. తాను కేసీఆర్, కేటీఆర్ ఎవరికీ భయపడబోనని తేల్చి చెప్పారు. తాజాగా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మరో వివాదంలో చిక్కుకున్నారు. మైనంపల్లిపై బీజేవైఎం జాతీయ కోశాధికారి సాయి ప్రసాద్ రాష్ట్ర ఎన్నికల అధికారి, డీజీపీకి ఫిర్యాదు చేశారు.  పూర్తి వివరాలు


ఒంటరిగా వచ్చినా, గుంపులతో వచ్చినా జరిగేది అదే - జమిలీ ఎన్నికలపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు వేస్తోందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామన్న, సీఎం జగన్ పరిపాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అన్నారు. ఏపీలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడ లేవని, జగన్ మోహన్ రెడ్డిని ప్రజలు తిరిగి సీఎంగా చూడాలనుకుంటున్నారని అన్నారు. పూర్తి వివరాలు


కాంగ్రెస్‌లో చేరండి- తుమ్మలకు బట్టి విక్రమార్క ఆహ్వానం
మరో మూడు నెలల్లో ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పార్టీలు మారడాలు జోరందుకున్నాయి. వచ్చే ఎన్నికలు కాంగ్రెస్‌కు చావో రేవో అవడంతో అధికారం దక్కించుకోవడం కోసం ఆ పార్టీ అందిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది. ఇందులో భాగంగానే ఇతర పార్టీల్లోని అసంతృప్తి నేతలను తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. అధికార పార్టీ నేతలకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అందుకు ఇటీవల బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో అసంతృప్తి నేతలతో టచ్‌లోకి వెళ్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరితే మంచి భవిష్యత్ ఉంటుందని భరోసా కల్పిస్తోంది. పూర్తి వివరాలు


బీఆర్ఎస్ ప్రభుత్వంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్
బీఆర్ఎస్ ప్రభుత్వంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైరయ్యారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ కార్యక్రమాలను... అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు రాజకీయ వేదికలుగా వాడుకున్నారని మండిపడ్డారు. కొల్లూరులో డబుల్ బెడ్రూంల పంపిణీ కార్యక్రమానికి ఆహ్వానం వస్తే....వెళ్తానన్నారు రాజాసింగ్. మంత్రి హరీశ్​రావు చేతుల మీదుగా జరిగిన రెండు పడక గదుల ఇళ్ల పంపిణీని...బీజేపీని విమర్శించడానికి అధికార పార్టీ అనుకూలంగా మార్చుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  పూర్తి వివరాలు