బీఆర్ఎస్ ప్రభుత్వంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైరయ్యారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ కార్యక్రమాలను... అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు రాజకీయ వేదికలుగా వాడుకున్నారని మండిపడ్డారు. కొల్లూరులో డబుల్ బెడ్రూంల పంపిణీ కార్యక్రమానికి ఆహ్వానం వస్తే....వెళ్తానన్నారు రాజాసింగ్. మంత్రి హరీశ్​రావు చేతుల మీదుగా జరిగిన రెండు పడక గదుల ఇళ్ల పంపిణీని...బీజేపీని విమర్శించడానికి అధికార పార్టీ అనుకూలంగా మార్చుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ఎమ్మెల్యేలకు ఏ వేదికపై ఏం మాట్లాడాలో కూడా తెలియదని రాజాసింగ్ మండిపడ్డారు. ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలియని ఎమ్మెల్యేలతో అధికార పార్టీ నిండిపోయిందంటూ విమర్శించారు. బీఆర్ఎస్ శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి....ఏ సమావేశాల్లో ఎలా మాట్లాడాలి...ఏ సందర్భంగా ఎలా ఉండాలో శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని కేసీఆర్ కు సూచించారు. 


కొల్లూరులో డబుల్ బెడ్రూం ఇళ్లను...ఆర్థిక మంత్రి హరీశ్ రావు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే...చేతల సర్కార్ అని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ పేదలకు ఇలాంటి ఇళ్లను ఏ ప్రభుత్వం పంపిణీ చేయలేదన్నారు. బీజేపీ నేతల మాటలు కోటలు దాటుతాయని...చేతలు మాత్రం గడప కూడా దాటవని విమర్శించారు. లక్షల విలువ చేసే భూమిలో....సీఎం కేసీఆర్ ఇళ్లు కట్టించారని అన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లను రాజకీయంగా వాడకోవడంపై రాజాసింగ్ మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు సిఫార్సులు చేసిన వారికే డబుల్ బెడ్రూం ఇస్తున్నారని ఆరోపించారు. ఇళ్లు ఉన్న వారికే ఇళ్లు మళ్లీ ఇస్తున్నారని అన్నారు. అర్హులకు ఇళ్లు ఇవ్వకుండా....అనర్హులకు ఇవ్వడాన్ని రాజాసింగ్ తప్పు పట్టారు. 


రాజాసింగ్...తెలుగుదేశం పార్టీ తరపున రాజకీయాల్లోకి ప్రవేశించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ విజయం సాధించారు. ఆ తర్వాత  2014 ఎన్నికల్లో బీజేపీ తరపున గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం పోటీ చేసి గెలుపొందారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లోనూ...అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన...రెండో సారి శాసనసభకు ఎన్నికయ్యారు. వివాదాస్పద కామెంట్లతో నిత్యం వార్తల్లో నిలిచే రాజాసింగ్ పై...సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో ఆయన బీఆర్ఎస్ లోకి వెళ్తారన్న ప్రచారం జరిగింది. పార్టీ మార్పుపై రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు. తాను లౌకికవాద పార్టీల్లోకి వెళ్లేది లేదని స్పష్టం చేశారు.