Top Headlines In Telugu States On 9th April: 


1. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్


ఢిల్లీ లిక్కర్ కేసులో (Delhi Liquor Scam) ఎమ్మెల్సీ కవితకు (Kavitha) మరోసారి షాక్ తగిలింది. రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 23 వరకూ ఆమెకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించింది. మంగళవారంతో కవిత 14 రోజుల కస్టడీ ముగియగా ఈడీ అధికారులు ఆమెను న్యాయమూర్తి జస్టిస్ కావేరీ బవేజా ముందు హాజరుపరిచారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీ లాండరింగ్ కు సంబంధించి కేసు దర్యాప్తు కొనసాగుతోందని.. ఆమె బయట ఉంటే దర్యాప్తు ప్రభావితం అవుతుందని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వాదనలు వినిపించింది. మరో 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని కోర్టును కోరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


2. కవిత సంచలన లేఖ


ఢిల్లీ లిక్కర్ కేసుతో (Delhi Liquor Case) తనకు ఎలాంటి సంబంధం లేదని.. తాను బాధితురాలిని అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Mlc Kavitha) అన్నారు. లిక్కర్ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఆమెకు రౌస్ అవెన్యూ కోర్టు విధించిన 14 రోజుల కస్టడీ మంగళవారంతో ముగియగా.. ఈడీ అధికారులు ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో కవిత కోర్టులో మాట్లాడేందుకు న్యాయమూర్తి అంగీకరించక పోవడంతో ఆమె 4 పేజీల లేఖను విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


3. 106 మంది ప్రభుత్వ ఉద్యోగులపై వేటు


ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన 106 మంది ప్రభుత్వ ఉద్యోగులపై వేటు పడింది. ఈ మేరకు సిద్దిపేట (Siddipet) జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ సభల్లో పాల్గొనడం, వారి వెంట తిరగడం వంటివి చేయకూడదు. అయితే, ఈ నెల 7న సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్ లో ఉపాధి హామీ, సెర్ఫ్ ఉద్యోగులతో మెదక్ లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, సుడా మాజీ ఛైర్మన్ రవీందర్ రెడ్డి, మరికొందరు నాయకులు సమావేశం నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


4. వాలంటీర్లకు చంద్రబాబు ఆఫర్


తెలుగు వారు గొప్పగా నిర్వహించుకునే పండుగ ఉగాది అని.. కొత్త ఏడాదిలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఆకాంక్షించారు. ఉగాది సందర్భంగా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కొత్త ఏడాది మొదటి రోజు, ఈ చైత్ర మాసంలో ప్రజా చైతన్యం కొత్తపుంతలు తొక్కుతూ, మన జీవితాలు ముందుకు తీసుకుని వెళ్లాలని అన్నారు. ఈ సందర్భంగా వాలంటీర్లకు తీపికబురు అందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


5. పిఠాపురం ఇంట్లో పవన్ ఉగాది వేడుకలు


కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ ఉగాది వేడుకలు చేసుకున్నారు. చేబ్రోలులో కొత్తగా తీసుకున్న ఇంట్లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజక వర్గం టీడీపీ ఇంఛార్జి ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, పిఠాపురం నియోజక వర్గం బీజెపీ ఇంఛార్జి కృష్ణం రాజు తదితరులు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.