Rouse Avenue Court Extended Kavitha Judicial Custody Extended: ఢిల్లీ లిక్కర్ కేసులో (Delhi Liquor Scam) ఎమ్మెల్సీ కవితకు (Kavitha) మరోసారి షాక్ తగిలింది. రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 23 వరకూ ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. మంగళవారంతో కవిత 14 రోజుల కస్టడీ ముగియగా ఈడీ అధికారులు ఆమెను న్యాయమూర్తి జస్టిస్ కావేరీ బవేజా ముందు హాజరుపరిచారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీ లాండరింగ్ కు సంబంధించి కేసు దర్యాప్తు కొనసాగుతోందని.. ఆమె బయట ఉంటే దర్యాప్తు ప్రభావితం అవుతుందని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వాదనలు వినిపించింది. మరో 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని కోర్టును కోరింది. అయితే, కవిత కస్టడీ పొడిగించడానికి ఈడీ వద్ద కొత్తగా ఏమీ లేవని ఆమె తరఫు న్యాయవాది రానా కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కవితకు కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమెను ఈడీ అధికారులు తీహార్ జైలుకు తరలించనున్నారు. మరోవైపు, కవితను మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కవిత తరఫు న్యాయవాది కోర్టును కోరగా.. ఆమె నేరుగా మాట్లాడేందుకు న్యాయమూర్తి నిరాకరించారు. కోర్టు హాలులో భర్త, మామను కలిసేందుకు జడ్జి అనుమతి ఇవ్వడంతో వారు కవితను కలిశారు.
వరుస షాక్ లు
కాగా, ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు వరుస షాక్ లు తగులుతున్నాయి. తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం విచారించిన రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ పిటిషన్ ను కొట్టేసింది. చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున ఈ నెల 16 వరకూ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఏప్రిల్ 4న తీర్పును రిజర్వ్ చేసింది. నిన్న బెయిల్ పిటిషన్ కొట్టేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. మరోవైపు, కవిత సాధారణ బెయిల్ పిటిషన్ పై మాత్రం ఈ నెల 20న ఇరు వర్గాల వాదనలు వింటామని న్యాయస్థానం ఇదివరకే తెలిపింది. కాగా, కవితను మార్చి 15న హైదరాబాద్ లో ఈడీ అరెస్ట్ చేయగా.. 16న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. తొలిసారి 2 రోజులు, రెండోసారి 3 రోజులు.. కోర్టు అనుమతితో మొత్తం 10 రోజులు ఆమెను కస్టడీలోకి తీసుకున్న ఈడీ విచారించింది. న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించడంతో మార్చి 26న కవితను తీహార్ జైలుకు తరలించారు. మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఈ నెల 4న విచారణ జరగ్గా.. తీర్పు రిజర్వ్ చేసిన అనంతరం తాజాగా తీర్పు వెలువరించింది.
Also Read: Telangana News: తెలంగాణ సీనియర్ అధికారి రాజీవ్ రతన్ హఠాన్మరణం- సంతాపం తెలిపిన సీఎం