మెగా లీక్స్... తెలుగు ప్రేక్షకులకు అలవాటైన పదం! వెరీ పాపులర్ కూడా! మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి తన కొత్త సినిమా కబుర్లు లీక్ చేయడం అలవాటు. ఈసారి ఏకంగా లుక్ లీక్ చేశాడు. తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చిన ఆనందంలో లుక్ బయటకు వెళుతుందనే సంగతి ఆయన గుర్తించలేకపోయారు. దాంతో ఫాంటసీ ఫిలింలో మెగా లుక్ బయటకు వచ్చింది. అసలు వివరాల్లోకి వెళితే... 


'విశ్వంభర'లో చిరంజీవి లుక్ చూశారా?
చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా సోషియో ఫాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్ 'విశ్వంభర' (Vishwambhara Movie). ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని పోచంపల్లి ప్రాంతంలో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడికి సోమవారం తమ్ముడు పవన్ వెళ్లారు. అన్నయ్య చిరును కలిశారు. తమ్ముడు వచ్చిన ఆనందంలో మేకప్, కాస్ట్యూమ్స్ వేసుకుని వచ్చేశారు. జనసేన పార్టీకి ఐదు కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. వీడియో & ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. దాంతో లుక్ ఎలా ఉంటుందనే ఆడియన్స్‌కు తెలిసింది. 


Also Read: మైదాన్ రివ్యూ: ఫుట్‌ బాల్ కోచ్ రహీమ్ బయోపిక్ - అజయ్ దేవగణ్ సినిమా ఎలా ఉందంటే?










బ్లాక్ కలర్ ప్యాంటు, మెరూన్ టైపు కలర్ షర్టులో చిరంజీవి భలే ఉన్నారు. ఈ లుక్ ఫైట్ సీక్వెన్సులోనిది. చిరు ఇష్టదైవం ఆంజనేయుడి విగ్రహం ముందు ఈ ఫైట్ తీస్తున్నారు. ''ధర్మ యుద్ధం మొదలు... విశ్వంభర విజృంభణం '' అంటూ దర్శకుడు వశిష్ఠ ట్వీట్ చేశారు.


Also Readఆ హిట్ సినిమాలు మిక్సీలో వేస్తే వచ్చిన కిచిడీ 'ఫ్యామిలీ స్టార్' - రామ రామ... ఏంటిది పరశురామా?






బ్లాక్ బస్టర్ హిట్ 'బింబిసార' తర్వాత మెగాస్టార్ ఇమేజ్, ఆయన నుంచి ప్రేక్షకుల కోరుకునే అంశాలతో దర్శకుడు వశిష్ఠ 'విశ్వంభర' కథ రాశారు. ఇందులో చిరు సరసన సౌత్ క్వీన్ త్రిష నటిస్తున్నారు. యువి క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, ప్రమోద్, వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను జనవరి 10న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్, కాస్ట్యూమ్ డిజైనర్: సుశ్మితా కొణిదెల, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర రావు & సంతోష్ కామిరెడ్డి, మాటలు: సాయి మాధవ్ బుర్రా, పాటలు: శ్రీ శివ శక్తి దత్తా & చంద్రబోస్, స్క్రిప్ట్ అసోసియేట్స్: శ్రీనివాస గవిరెడ్డి - గంటా శ్రీధర్ - నిమ్మగడ్డ శ్రీకాంత్ - మయూఖ్ ఆదిత్య, ఛాయాగ్రహణం: ఛోటా కె. నాయుడు, సంగీతం: ఎంఎం కీరవాణి.


Also Readనాగ చైతన్య, అల్లు అరవింద్ సేఫ్ - కర్మ అనేది వదిలి పెట్టదురా పెట్ల!