Naga Chaitanya and Allu Aravind happy with Family Star result?: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పేర్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఓవర్సీస్ నుంచి 'ఫ్యామిలీ స్టార్' రిపోర్ట్స్ వచ్చినప్పటి నుంచి వాళ్లిద్దరూ హ్యాపీగా ఉన్నారని మీమ్స్ పడుతున్నాయి. డైరెక్టర్ పరశురామ్ పెట్లను పట్టుకుని చైతూ ఫ్యాన్స్ పిచ్చ పిచ్చ తిట్లు తిడుతున్నారు. డైరెక్టర్ చేసిన పనికి హీరో విజయ్ దేవరకొండ ట్రోల్ అవుతున్నాడు. రీజన్స్ ఏంటనేది చూస్తే...
చైతూకు హ్యాండ్ ఇచ్చిన పరశురామ్!
'గీత గోవిందం' సక్సెస్ తర్వాత చైతూతో సినిమా చెయ్యడానికి డైరెక్టర్ పరశురామ్ పెట్ల అడ్వాన్స్ తీసుకున్నాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్లో మూవీ స్టార్ట్ చేశాడు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసే ఛాన్స్ రావడంతో చైతూకి హ్యాండ్ ఇచ్చి అటు వెళ్ళిపోయాడు. పోనీ 'సర్కారు వారి పాట' తర్వాత సినిమా చేస్తాడని అనుకుంటే అదీ చెయ్యలేదు. చైతూతో మూవీ పక్కనపెట్టి విజయ్ దేవరకొండ దగ్గరకు వెళ్ళాడు. చైతూకు అలా రెండుసార్లు హ్యాండ్ ఇచ్చాడు పెట్ల. ఒక ఇంటర్వ్యూలో అతని గురించి ప్రశ్నిస్తే ఆ డైరెక్టర్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అని చైతు ఆన్సర్ ఇవ్వడంలో ఆయన ఎంత ఫీల్ అయ్యాడో తెలుస్తుంది.
Also Read: ఆ హిట్ సినిమాలు మిక్సీలో వేస్తే వచ్చిన కిచిడీ 'ఫ్యామిలీ స్టార్' - రామ రామ... ఏంటిది పరశురామా?
అల్లు అరవింద్ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నా...
'గీత గోవిందం' ప్రొడ్యూస్ చేసిన అల్లు అరవింద్ దగ్గర పరశురామ్ పెట్ల అడ్వాన్స్ తీసుకున్నారు. అయితే, మూవీ చెయ్యలేదు. '2018' మూవీ ప్రెస్‌మీట్‌లో ఇన్ డైరెక్ట్‌గా పెట్ల మీద అల్లు అరవింద్ సెటైర్స్ వేశాడు. చందూ మొండేటికి టెంప్టింగ్ ఆఫర్స్ వచ్చినా తనకు సినిమా చేస్తానని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాడని, కొందరు అలా చెయ్యడం లేదని గీత దాటారని చెప్పాడు. పరశురామ్ పెట్ల గురించి అలా మాట్లాడాడని ఫిల్మ్ ఇండస్ట్రీ గుసగుస.
Also Read: 'సాహో' హీరోయిన్ దొరికేసిందా? లేదంటే కావాలని అలా చేసిందా?
పరశురామ్ పెట్లతో సినిమా చెయ్యడానికి అల్లు అరవింద్, నాగ చైతన్య రెడీగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరికీ హ్యాండ్ ఇచ్చాడు ఆ డైరెక్టర్. ఇప్పుడు ఆయన తీసిన 'ఫ్యామిలీ స్టార్' మూవీకి గొప్ప టాక్ రాలేదు. ఫ్లాప్ దిశగా వెళుతోంది. దాంతో చైతు, ఆరవింద్ హ్యాపీగా ఉండి ఉంటారని ట్వీట్స్ చేశారు నెటిజన్స్. ఆ ట్వీట్స్ చూస్తే నవ్వు ఆగదు. కర్మ అనేది వదిలి పెట్టదురా పరశురామ్ పెట్ల అని చైతు ఫ్యాన్ ఒకడు కోపం చూపించాడు.