Sreemukhi Got Offer in Allu Arjun and Atlee Pan India Movie: బుల్లితెరపై శ్రీముఖి చేసే సందడి గురించి ప్రత్యేకం చెప్పనవసరం లేదు. ఆమె ఎక్కడ ఉన్న అల్లరి, నవ్వులే. తన వాక్చాతుర్యంతో ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుటుంది. 'ఆదివారం స్టార్‌ పరివారం' అంటూ స్టార్‌ మా షోలో తెగ సందడి చేస్తుంది ఈ బుల్లితెర రాములమ్మ. టీవీ సీరియల్స్ స్టార్స్‌ను తన షో పిలిచి వారితో ఆడిపాడుతుంది. అంతేకాదు అప్పుడప్పుడు పలు ఈవెంట్స్‌కి హోస్ట్‌గా కూడా వ్యవకహరిస్తుంది. మొత్తానికి బుల్లితెరపై యాంకర్‌గా ఫుల్‌ బిజీ బిజీ అయిపోతున్న శ్రీముఖి అప్పుడప్పుడు వెండితెరపై కూడా మెరుస్తుంది. హీరోలకు చెల్లి, అక్క పాత్రలు చేస్తూ వస్తుంది. 


కొంతకాలంగా శ్రీముఖీ సినిమాల్లో అసలు కనిపించడం లేదు. ఈ మధ్య కాస్తా సన్నబడిన పెద్ద మూవీ ఆఫర్స్‌ రావడం లేదు. అయితే తాజాగా శ్రీముఖీ ఓ బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిందంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. శ్రీముఖీ ఓ బిగ్‌ ప్రాజెక్ట్‌లో చాన్స్‌ కొట్టేసిందట. అదే ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌-తమిళ్‌ డైరెక్టర్‌ అట్లీ సినిమా. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ పాన్‌ ఇండియా మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేదు, ఈ ప్రాజెక్ట్‌ కన్‌ఫాం అయ్యిందనేది మాత్రం నిజం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుంది. ఈ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌ కూడా ఫిక్స్‌ అయ్యాడ. తమిళ్‌ యంగ్‌ సెన్సేషన్ అనిరుధ్‌ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంగీతం అందించబోతున్నాడట. అయితే ఇప్పుడు ఈ సినిమాల్లో శ్రీముఖీ ఓ పాత్రకు సెలక్ట్‌ అయ్యిందట. అయితే గతంలో అల్లు అర్జున్‌తో కలిసి ఆమె నటించిన సంగతి తెలిసిందే.






మరోసారి బన్నీతో కలిసి..


'జులాయి' సినిమాలో బన్నీకి చెల్లిగా నటించిన శ్రీముఖి.. ఇప్పుడు మరోసారి ఐకాన్‌ స్టార్‌తో స్క్రిన్‌ షేర్‌ చేసుకోబుతుందట. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు. కానీ, శ్రీముఖీ బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిందటూ కథనాలు వస్తున్నాయి. ఇవి చూసి ఆమె ఫాలోవర్స్‌ అంతా ఖుష్‌ అవుతున్నారు. ఇటీవల శ్రీముఖి చిరంజీవి భోళా శంకర్‌ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఖుషీ రీక్రియేషన్ సీన్‌లో చిరంజీవితో కలిసి నటించింది. ఇందులో భూమిక పాత్ర పోషించింది. ఈ సీన్‌కు థియేటర్లో ఈళలు పడ్డాయి. యాంకర్ రాణిస్తున్న ఆమె బిగ్‌బాస్‌లో షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ రియాలిటీ షో తనదైన ఆట తీరుతో శివంగిలా రెచ్చిపోయింది. ఇక టైటిల్‌ శ్రీముఖిదే అన్నట్టుగా ప్రచారం జరిగింది. కానీ, చివరిలో టైటిల్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ దక్కింది. శ్రీముఖి మత్రం రన్నరప్‌గా మిగిలింది. 


Also Read: 'ఆడు జీవితం' సంచలనం - 9 రోజుల్లోనే రూ.100 కోట్లకుపైగా గ్రాస్‌ వసూళ్లు, తొలి మలయాళ సినిమాగా రికార్డు