Top Headlines in Telugu States on April 5th:


1. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం ప్రారంభం


వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసిన వారికే జగన్ మళ్లీ టిక్కెట్ ఇచ్చారని.. హత్యా రాజకీయాలు పోవాలంటే జగనన్నను ఓడించాలని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. కడప జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని ఆమె ప్రారంభించారు. కడప లోక్ సభ ఎన్నికల్లో ఓ వైపు రాజశేఖరరెడ్డి బిడ్డ.. మరోవైపు వివేకాను హత్య చేయించిన అవినాశ్ రెడ్డి ఉన్నారని అన్నారు. హంతకులు చట్ట సభలకు వెళ్లకూడదనే తాను కడప ఎంపీగా పోటీ చేస్తున్నానని చెప్పారు. ధర్మం కోసం ఒకవైపు తాను... డబ్బుతో అధికారాన్ని కొందామనుకునే వ్యక్తి మరోవైపు ఉన్నారని ఎవరిని గెలిపించాలనేది ప్రజలే నిర్ణయించుకోవాలని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


2. ధర్మవరంలో పొలిటికల్ హీట్


ధర్మవరం నియోజకవర్గం(Dharmavaram assembly constituency) లో రాజకీయ వాతావరణం హీటెక్కింది. వైసీపీ (YSRCP) తరఫున ఇక్కడ కేతిరెడ్డి వెంకట్‌రామిరెడ్డి(Kethireddy Venkatarami Reddy) పోటీ చేస్తుంటే కూటమి తరఫున బీజేపీ లీడర్‌ సత్యకుమార్(Satya Kumar) బరిలో ఉన్నారు. గుడ్‌మార్నింగ్ ధర్మవరం అంటూ నిత్యం ప్రజల్లోనే ఉంటూ వచ్చారు కేతిరెడ్డి. సత్యకుమార్ తాజాగా ప్రచారం ప్రారంభించారు. మరి ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది. ఎవరిపై ఎవరు పైచేయి సాధిస్తారనే ఉత్కంఠ నెలకొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


3. కాంగ్రెస్ లో చేరిన కూన శ్రీశైలం గౌడ్


బీజేపీ నాయకుడు కూన శ్రీశైలం‌గౌడ్ కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు. పార్టీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఓ సారి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా  గెలిచారు. ఆ ప్రాంతంలో గట్టి పట్టుకున్న నేత కూడా.  మాస్ లీడర్‌గా కూన శ్రీశైలంగౌడ్ మాంచి పేరుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కుత్బుల్లాపూర్‌లో రెండో స్థానంలో నిలిచారు. ఆయనకు  లక్షకు పైగా ఓట్లు వచ్చాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


4. టీఎస్ ఎప్ సెట్ అభ్యర్థులకు అలర్ట్


తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కోసం నిర్వహించనున్న 'టీఎస్ ఈఏపీసెట్-2024' దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 26న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎప్‌సెట్ దరఖాస్తు గడువు ఏప్రిల్ 6తో ముగియనుంది. అభ్యర్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇక రూ.250 ఆల‌స్య రుసుమతో ఏప్రిల్ 9 వ‌ర‌కు, రూ.500 ఆల‌స్య రుసుముతో ఏప్రిల్ 14 వరకు, రూ.2500 ఆల‌స్య రుసుముతో ఏప్రిల్ 19 వ‌ర‌కు, రూ.5000 ఆల‌స్య రుసుముతో మే 4 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. దరఖాస్తు వివరాల్లో ఏమైనా తప్పులుంటే ఏప్రిల్ 8 నుంచి 12 వరకు ఎడిట్ చేసుకోవ‌చ్చు. రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలోనే ఈడ‌బ్ల్యూఎస్ అభ్యర్థులు త‌మ వివ‌రాల‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


5. మ్యాచ్ కు ముందు ఉప్పల్ లో కరెంట్ ఫైట్


ఉప్పల్‌(Uppal) మ్యాచ్‌ రికార్డులతో ఎంత ఫేమస్ అయిందో వివాదాలతో కూడా అంతే ఫేమస్‌. కీలకమైన ఐపీఎల్ (IPL 2024) మ్యాచ్ జరుగుతున్న టైంలో విద్యుత్‌ శాఖతో ఇచ్చిన ఝలక్‌కు నిర్వాహకులకు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి ఏర్పండి. విద్యుత్ బకాయిలు ఉన్నాయని చెప్పి మ్యాచ్‌కు 24 గంటల ముందు ఉప్పల్ స్టేడియానికి సరఫరాల నిలిపేయడం పెను సంచలనంగా మారింది. ఈ వార్త జాతీయ స్థాయిలో కూడా మోతమోగిపోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.