Sharmila Campaign :  వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసిన వారికే  జగన్ మళ్లీ టిక్కెట్ ఇచ్చారని .. హత్యా రాజకీయాలు పోవాలంటే జగనన్నను ఓడంచాలని వైఎస్ షర్మిల పిలుపునిచ్చరా.ు కడప జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని షర్మిల ప్రారంభించారు.  కడప లోక్ సభ ఎన్నికల్లో ఓ వైపు రాజశేఖరరెడ్డి బిడ్డ.. మరోవైపు వివేకాను హత్య చేయించిన అవినాశ్ రెడ్డి ఉన్నారని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. హంతకులు చట్ట సభలకు వెళ్లకూడదనే తాను కడప ఎంపీగా పోటీ చేస్తున్నానని చెప్పారు. ధర్మం కోసం ఒకవైపు తాను... డబ్బుతో అధికారాన్ని కొందామనుకునే వ్యక్తి మరోవైపు ఉన్నారని ఎవరిని గెలిపించాలనేది ప్రజలే నిర్ణయించుకోవాలని అన్నారు. 


వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఓ వైపు - వైఎస్ వివేకాను చంపిన వ్యక్తి మరో వైపు                         


వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి జగన్ మళ్లీ టికెట్ ఇచ్చారని విమర్శించారు. హంతకులను కాపాడేందుకే జగన్ సీఎం పదవిని వాడుకుంటున్నారని తీవ్రంగా విమర్శించారు.  హత్యా రాజకీయాలకు ముగింపు పలకాలంటే జగన్, అవినాశ్ ను ఓడించాలని అన్నారు. కడప జిల్లా కాశినాయన మండలం అమగంపల్లిలో ఆమె బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నో అద్భుత పథకాలను తీసుకొచ్చారని షర్మిల అన్నారు. 


వైఎస్ పథకాలు  అమలు చేయడం లేదు !                           


ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, ఫీజు రీయింబర్స్ మెంట్, రుణమాఫీ వంటి ఎన్నో పథకాలను అమలు చేశారని కొనియాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన జగన్... అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీకి తాకట్టు పెట్టారని విమర్శించారు.  ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు వచ్చి ఉండేవని చెప్పారు. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని... పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదని విమర్శించారు. కడప స్టీల్ ప్లాంట్ పై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉంటే అన్నీ పూర్తయ్యేవని చెప్పారు.


యాత్రలో పాల్గొన్న వైఎస్ సునీత                 


బస్సు యాత్రలో వైఎస్ సునీత కూడా పాల్గొన్నారు. తన తండ్రి వైఎస్ వివేకా  హత్య కేసులో నిందితులకు శిక్షపడే వరకూ పోరాడతానని ామె చెబుతున్నారు. మామూలుగా సునీత లేకపోతే సునీత తల్లి లోక్ సభకు పోటీ చేయాలని అనుకున్నారు. కానీ కాంగ్రెస్ హైకమండ్.. షర్మిలను పోటీ చేయమని ఆదేశించడంతో.. షర్మిల పోటీ చేస్తున్నారు. సునీత మద్దతుగా ఉండనున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి.. వివేకా  హంతకుడిగా అభివర్ణిస్తూ చేస్తున్న విమర్శలు హాట్ టాపిక్ అవుతున్నాయి. కడప జిల్లాలో వైఎస్ వివేకా హత్య అంశం కేంద్రంగానే ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది.