Satyabhama Today Episode సత్య క్రిష్‌ని తాడుతో కట్టేసి నోటికి ప్లాస్టర్ వేస్తుంది. బుద్ధిగా ఉంటాను అంటేనే కట్లు విప్పుతాను అని చెప్తుంది. దీంతో సరే అని క్రిష్ చెప్పడంతో కట్లు విప్పుతుంది. నన్నెందుకు కట్టావ్ అని క్రిష్‌ అడుగుతాడు. దాంతో రాత్రి ఏం మాట్లాడావో గుర్తులేదా అని అంటుంది. అంతా ఓవర్ యాక్షన్ చేశానా అని క్రిష్ అడిగితే సత్య వీడియో చూపిస్తుంది. క్రిష్ గాడు బలవంతం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా అని అంటూ ఉంటాడు. 


సత్య: మొదటి రాత్రి ఏమన్నావో గుర్తుందా.. నువ్వు ప్రేమించింది నా అందాన్ని కాదు నా మనసును ఆ మనసును గెలుచుకున్నంత వరకు నా దగ్గరకు రాను అన్నావు మరి ఏమైంది. హా.. రెండో రాత్రికే మత్తెక్కిందా.. నీ ప్రేమ పూర్తిగా అబద్ధం..
క్రిష్‌: మనసులో.. ఇప్పుడు ఏం మాట్లాడినా నా మీద ఒంటి కాలితో లేస్తుంది. మౌనంగా ఉండటమే బెటర్. గదిలో చాలా కత్తులు ఉండటం చూసి ఇవెందుకు ఇక్కడికి వచ్చాయి.
సత్య: నేనే తెప్పించా నా సెక్యూరిటీ కోసం.
క్రిష్‌: నీకు సెక్యూరిటీగా నేను ఉన్నాను కదా.
సత్య: ఇది నీ నుంచి నన్ను నేను రక్షించుకోవడానికే. నీకు చిన్న కత్తి సరిపోదు కదా.. అందుకే ఆ సైజు కత్తులు రెడీ చేసి పెట్టా. నీ మూడ్ బట్టి కత్తులు వాడుదామని.
క్రిష్‌: అసలు నిన్ను సంపంగి అని కాదు శివంగి అని పిలవాలి. జర జాగ్రత్తగా ఉంటా. అమ్మో దీనితో చాలా జాగ్రత్తగా ఉండాలి.


నందిని టైం పాస్ కావడం లేదు అంటుంది. దాంతో శాంతమ్మ వంటింటికి వెళ్తే చాలా పనులు ఉంటాయి అంటుంది. దానికి నందిని నేను వంట చేస్తే మీ కోడలికి పని ఉండదు అంటుంది. ఇంతలో తన ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే బోర్ కొడుతుంది. వెంటనే రండి అని చెప్తుంది. ఏర్పాట్లు అదరగొడతాను అని చెప్తుంది. ఇక తన అత్తయ్యకి భోజనం గ్రాండ్‌గా ఉండాలి అని చెప్తుంది. హోటల్‌లో చెప్పినట్లు చాలా ఐటెమ్స్ చెప్తుంది. దీంతో అవన్నీ కుదరవు అని శాంతమ్మ అంటుంది. ఇక విశాలాక్షి నందినితో నీ ఫ్రెండ్స్‌కి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటానంటుంది. 


బాబీ మాటలు గుర్తు చేసుకున్న క్రిష్ సత్యను ఇంప్రెస్ చేయడానికి లవర్ బాయ్‌లా రెడీ అవుతాడు. సత్య కూడా రెడీ అవుతుంటే అలా చూస్తూ ఉండిపోతాడు. సత్య క్రిష్‌ని చూసి గుడ్లగూబ కళ్లు అంటుంది. కళ్లు ఇంత పెద్దవి చేసుకొని చూస్తున్నావ్ అని అంటుంది. దీంతో క్రిష్ సత్యని లక్క పిడత ముఖం అంటాడు. సత్య బుంగ మూతి పెట్టుకుంటుంది. దీంతో క్రిష్‌ సత్యని ఏడిపించడానికి నీ కంటే లక్క పిడతే నీ కంటే బాగుంటుంది అంటాడు. ఇక సత్య క్రిష్‌ని దువ్వెనతో కొడితే దాన్ని పట్టుకొని క్రిష్ ఇది నీదే కదా.. దువ్వెనను ముద్దు పెట్టుకుంటాడు. 


క్రిష్‌: నీకు కూడా నన్ను ముద్దు పెట్టుకోవాలి అని మనసులో ఉంది కదా. నేను ఏమైనా అనుకుంటా అని మొహమాటం అడ్డొస్తుంది కదా..
సత్య: కాదు నీ చెంప పగల గొట్టాలి అనిపిస్తుంది. సంస్కారం అడ్డొస్తుంది. నువ్వు కట్టిన తాళి అడొస్తుంది. 
క్రిష్‌: సంతోషం కనీసం నేను కట్టిన తాళి అలా అయినా ఉపయోగపడుతుంది.
సత్య: తిడుతున్నాను. సిగ్గుగా లేదా..
క్రిష్‌: మొగుడు పెళ్లం మధ్య ఉండకూడనివి రెండే రెండు. ఒకటి రహస్యాలు.. రెండు సిగ్గు మెహమాటం. నేను నీ దగ్గర ఏ రహస్యాలు దాచిపెట్టలే. అన్నీ నిజాలు చెప్తా. ఇక నిన్ను చూస్తే అందమే సిగ్గు పడుతుంది. నేను ఎంత.
సత్య: ఇందాకే కదా లక్క పిడత ముఖం అన్నావు.
క్రిష్‌: నేను అన్నానా.. ఇక సత్యని ఫేస్ లెఫ్ట్‌కి తిప్పు రైట్‌కి తిప్పు అని చూసి నీది లక్క పిడత ముఖమే అంటాడు. దీంతో సత్య క్రిష్‌ వెంట పడితే క్రిష్‌ పరుగులు పెడతాడు. ఇంతలో భైరవి వస్తుంది. 
భైరవి: ఏరా నేను నీకు ఏం చెప్పాను నువ్వేం చేస్తున్నావ్.. పెళ్లాన్ని తీసుకురారా అంటే ఇక్కడ ముచ్చట్లు పెడుతున్నావా..
సత్య: అత్తయ్య అసలు ఏం జరుగుతుంది. ఇంట్లో ఏం జరుగుతుంది ఇంత హడావుడి, డెకరేషన్ చేస్తున్నారు.
క్రిష్‌: అర్థమైంది కదా జల్దీ రెడీ అయ్‌రా.. ఇక క్రిష్ సూపర్ అని సత్యని సైగ చేస్తాడు. 


క్రిష్ ఇంట్లో హోమానికి ఏర్పాట్లు చేస్తారు. అందరూ కూర్చొంటారు. సత్య ఇంకా రాకపోవడంతో భైరవి చిరాకు పడుతుంది. ఇక సత్య ఈ పూజ ఎందుకు చేస్తున్నారు. అడుగుతుంటే ఎందుకు ఎవరూ ఏం చెప్పడం లేదు అని సత్య మనసులో అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  


Also Read: గుప్పెడంత మనసు సీరియల్: కొడుకు కాలర్ పట్టుకున్న అనుపమ.. మహేంద్రకు చేతులెత్తి మొక్కి ఆ సాయం చేయమన్న మను!