Guppedantha Manasu Today Episode అనుపమ వెళ్లిపోతుంటే దేవయాని అడ్డుగా వస్తుంది. నిన్ను ఫాలో అవ్వకపోతే నాకు నిద్ర పట్టుదని.. నిన్ను ఫాలో అవ్వడమే పనిగా పెట్టుకున్నాను అని అనుపమతో అంటుంది. ఎక్కడకి వెళ్తున్నావ్ పారిపోతున్నావా అని దేవయాని అనుపమని అడుగుంది. దీంతో అనుపమ పారిపోవడం కాదు వెళ్లిపోతున్నా అంటుంది. 


దేవయాని: సర్లే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో కొంచెం క్లారిటిగా చెప్పు. అసలు నీ గతం ఏంటి. మను తండ్రి ఎవరు నాకైనా చెప్పు. అదే నీ భర్త ఎవరు.
అనుపమ: అది మీకు అనవసరం. 
దేవయాని: అది కాదు అనుపమ నీకు నీ భర్తకు గొడవలు ఉంటే నీ భర్తతో నేను మాట్లాడుతా.. లేదంటే అసలు నీకు పెళ్లే కాలేదా.. అయితే మరి ఈ మను ఎవరు. నిజంగా తను నీ కన్నబిడ్డేనా.. లేదంటే పెంచుకున్న బిడ్డేనా.. 
అనుపమ: అసలు నన్ను ప్రశ్నించడానికి నువ్వు ఎవరు.
దేవయాని: ఈ ప్రశ్నలన్నీ ఎదుర్కొలేక తప్పించుకుంటున్నావా.. నువ్వు జగతి ఫ్రెండ్ అంటే మంచి దానివి అనుకున్నా. నువ్వు డిగ్నిఫైడ్.. డీసెంట్ అనుకున్నా ఇలా చేస్తావ్ అనుకోలేదు.
అనుపమ: మీరు హద్దు దాటి మాట్లాడుతున్నారు. 
దేవయాని: అది కాదు అనుపమ తప్పు చేసేవాళ్లే పారిపోతారు. అంటే నువ్వు తప్పు చేశావా.. అందుకు సాక్ష్యమేనా ఈ...
మహేంద్ర: వదిన గారు.. మీరు ఇంకొక్క మాట్లాడితే బాగోదు. తనని ప్రశ్నించడానికి మీరు ఎవరు. 
దేవయాని: నా మనసు చలించిపోయి తనని వెళ్లనివ్వకుండా ఆపుతున్నా.
మహేంద్ర: మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారో ఎందుకు తనని అడ్డుకున్నారో తెలీనంత పిచ్చొడిని కాదు.
దేవయాని: మను తండ్రి ఎవరో తెలీక ఇబ్బంది పడుతున్నాడు కదా తెలుసుకొని మనుతో చెప్దామని ఆశపడ్డాను.
మను: మేడం మీరు ఏ విషయం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అసలు మీరు నాగురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. 
వసుధార: ఇక చాలు ఆపండి మేడం.. మేడం ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్లండి లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. ఫణేంద్ర సార్‌కి ఫోన్ చేయాలా వెళ్తారా.. వెళ్లండి తొందరగా.. 
మహేంద్ర: ఏంటి అనుపమ నువ్వు ఇలా లెటర్ పెట్టి వెళ్లిపోవడమేనా.. అందర్ని టెన్షన్ పెట్టి ఇలా వెళ్లిపోతావు. ఇన్నాళ్లు వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడు నీకు గాయం అయింది. ఈ లెటర్‌లో ఏం రాశావు. నువ్వు మాకు సమస్య అవుతున్నావు అని వెళ్లిపోతున్నా అన్నావ్. చెప్పామా మేం నీకు నువ్వు సమస్య అవుతున్నావ్ అని. 
అనుపమ: చెప్పాల్సిన అవసరం లేదు మహేంద్ర. నాకు అర్థమవుతుంది. 
మహేంద్ర: అరే ఆపు.. ఏంటి నీకు అర్థమైంది. అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావ్. ఇక్కడికి దూరంగా వెళ్తే నీ సమస్య తీరిపోతుందా.. నువ్వు ఒక్క ప్రశ్నకి భయపడి వెళ్లిపోతే అక్కడ ఇదే ఎదురవుతుంది.
వసుధార: మేడం ఇదంతా వదిలేయండి. మీరు ఏదో ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. అవన్నీ పక్కన పెట్టి మాతో వచ్చేయండి.
మహేంద్ర: మను నువ్వైనా చెప్పు. మీ అమ్మని ఇక్కడే ఉండమని చెప్పే అధికారం నీకు ఉంది.
మను: నాకు బాధలు, కష్టాలు మోయడం తప్ప ఎవరి మీద ఏ అధికారం లేదు సార్. 
మహేంద్ర: నువ్వు వెళ్లిపోతావ్ సరే మను పరిస్థితి ఆలోచించావా.. ఇంకా మనుని బాధ పెట్టాలి అని చూస్తున్నావా.. మనుకి తండ్రి ఎవరో చెప్పలేదు. ఇక నువ్వు కూడా వెళ్లి పోతే ఎన్ని అవమానాలు ఎదుర్కొవాల్సి వస్తుందో తెలుస్తుందా..


అనుపమ మను కాలర్ పట్టుకొని రేయ్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావ్‌రా అని ప్రశ్నిస్తుంది. వసు వద్దు అని చెప్తే వసూని ఆపేస్తుంది. నన్ను వేధించడానికే ఇక్కడికి వచ్చావ్ కదా.. నిన్ను రావొద్దు అన్నా సరే ఎందుకు వచ్చావ్ అని అడుగుతుంది. దీంతో మహేంద్ర క్లాప్స్ కొట్టి తనని వేదనకు గురి చేసింది నువ్వేకదా.. నీ వల్లే తనకు అవమానం కానీ తన వల్ల నీకు కాదు అంటాడు. నువ్వు ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్తే అన్నీ సక్కబడతాయి అంటాడు. మహేంద్ర అనుపమను దబాయించి ప్రశ్నించడంతో మను బాధ పడతాడు.


మను: సార్ మీరు మేడంని అడిగే ప్రశ్నలు వేధిస్తున్నాయి. అందుకే తను ఇక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధం అయ్యారు. మీకు నా మీద గౌరవం ఉంటే మీరు నాకోసం ఆవిడకు ఇంకెప్పుడు ఈ ప్రశ్నలు అడగకండి. తన దగ్గర ఈ టాపిక్ తీసుకురావొద్దు. అని చేతులు జోడిస్తాడు.
మహేంద్ర: అనుపమ నీ ప్రాబ్లమ్ ఇదే అయితే మనుకోసం నీ దగ్గర ఈ టాపిక్ తీసుకురాను. అని చెప్పడంతో అనుపమ వసు వాళ్లతో వెళ్తుంది. 


ఇక దేవయాని డల్‌గా ఉంటడం చూసి ఏమైందని శైలేంద్ర అడుగుతాడు. దీంతో దేవయాని ప్లాన్ ఫెయిల్ అయిందని అనుపమని ఇక్కడి నుంచి పంపించలేకపోయాను అని అంటుంది. చివర్లో మను, వసు, మహేంద్రలు వచ్చి తనని అక్కడి నుంచి పంపేశారు అని అంటుంది. ఇక ఒంటరిగా కాకుండా రాజీవ్, నువ్వు, నేను ముగ్గురం కలిసి ప్లాన్ చేసి వాళ్ల అంతు చూడాలి అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: దీప తలపై రాడ్‌తో కొట్టిన రౌడీ, ఇన్నాళ్లకు కన్న తల్లిదండ్రుల చెంతకు దీప.. అక్క అని పిలిచిన జ్యోత్స్న!