'Karthika Deepam 2' TRP Rating: అప్పుడే రికార్డుల వేట మొదలు పెట్టిన 'కార్తీక దీపం 2' - టాప్‌ టీఆర్పీ రేటింగ్‌తో దూసుకుపోతున్న 'వంటలక్క'

Karthika Deepam 2: బుల్లితెరపై 'కార్తీక దీపం' సీరియల్‌ మరోసారి సత్తా చాటుకుంది. హిస్టరి రిపీట్‌ అంటూ మళ్లీ తన స్థానానికి చేరుకుంది. ఇలా వచ్చిందో లేదో అప్పుడే రికార్డుల వేట మొదలు పెట్టేసింది.

Continues below advertisement

Karthika Deepam 2 Serial TRP Rating: బుల్లితెరపై 'కార్తీక దీపం' సీరియల్‌ మరోసారి సత్తా చాటుకుంది. హిస్టరి రిపీట్‌ అంటూ మళ్లీ తన స్థానానికి చేరుకుంది. ఇలా వచ్చిందో లేదో అప్పుడే రికార్డుల వేట మొదలు పెట్టేసింది. మార్చి 25 నుంచి బుల్లితెరపై 'కార్తీక దీపం' సీరియల్‌ సందడి మళ్లీ మొదలైన సంగతి తెలిసిందే. 'కార్తీక దీపం 2- ఇది నవవసంతం' (Karthika Deepam 2 Idi Nava Vasantham) అంటూ ఫస్ట్‌ పార్ట్‌కు సీక్వెల్‌గా వచ్చింది. ఇది దానికి కొనసాగింపు కాదు. ఇది కొత్త కథ. అదే కార్తీక్‌, దీపలు. మిగతా వారంత కొత్త వారు. ఆడియన్స్‌కి కూడా కావాల్సింది కూడా అదే. వంటలక్క, డాక్టర్‌ బాబు జంటను తెరపై కనిపిస్తే చాలు అదే సందడే వేరు అంటున్నారు.

Continues below advertisement

'కార్తీక దీపం 2' ఫస్ట్ వీక్ టీఆర్పీ రేటింగ్

అన్నట్టుగానే గతవారం నుంచి ప్రసారంకు వచ్చేసిన ఈ సీరియల్‌ అప్పుడే టాప్‌లో దూసుకుపోతుంది. అన్ని సీరియల్స్‌ని వెనక్కి నెట్టి అగ్రస్థానం కొట్టేసి దట్‌ ఈజ్‌ 'కార్తీక దీపం' అనిపించుకుంటుంది. సీరియల్‌ రిలీజ్‌ అయిన ఫస్ట్‌ వీక్‌లోనే టాప్‌ టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. అలా తొలివారం ఈ కార్తీక దీపం 2 ఇది నవవసంతం..  12.93 టీఆర్పీ(Karthika Deepam TRP Rating) రేటింగ్ సాధించింది. అర్బన్‌లో 10.40 రేటింగ్ నమోదు చేసుకోగా.. రూరల్‌లో 12.93 టీఆర్పీ రేటింగ్‌ సాధించింది. 

ఈ సారి కొత్త కథతో వచ్చినా.. పాత రికార్డ్స్‌నే రిపీట్‌ చేస్తుంది. దీంతో మరోసారి వంటలక్క, డాక్టర్‌ బాబు జంటకు ఉన్న క్రేజ్‌ను ఎలాంటి ఈ టీఆర్పీ రేటింగ్‌ గుర్తుచేసింది. ఈ సీరియల్‌కు ఫస్ట్‌ పార్ట్‌ అయినా 'కార్తీక దీపం' ఆరేళ్ల పాటు సక్సెస్‌ ఫుల్‌గా కొనసాగింది. ఐపీఎల్‌ సీజన్‌లోనూ ఈ సీరియల్‌ టాప్‌ టీఆర్పీ రేటింగ్‌ను సొంతంగా చేసుకుంది. బుల్లితెర చరిత్రలోనే ఎన్నడు లేని విధంగా అత్యధికంగా 21.07 టీఆర్పీ రేటింగ్‌ సొంతంగా చేసుకుని నేషనల్‌ వైడ్‌గా టాప్‌ సీరియల్‌గా నిలిచింది. ఏ భాషల్లోనూ ఏ సీరియల్‌కు కూడా ఇంతటి టాప్‌ రేటింగ్‌ ఎప్పుడు నమోదు కాలేదు. ఇదే హయ్యేస్ట్‌ టీఆర్పీ రేటింగ్‌.

Also Read: క్రేజీ అప్‌డేట్‌ - నెల రోజుల్లోనే ఓటీటీకి వచ్చేస్తున్న 'టిల్లు స్క్వేర్‌'? స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే!

అదీ కూడా ఒక తెలుగు సీరియల్‌కు రావడమంటే నిజంగా చరిత్రలోనే నిలిచే రికార్డు అని చెప్పాలి. అంతగా కార్తీక దీపం సీరియల్‌ నడిపించాడు డైరెక్టర్‌ కాపుగంటి రాజేంద్ర. ఇక ఈసారి అంతే బలమైన కథలో కార్తీక దీపం 2 సీరియల్‌ని తీసుకువచ్చారు. తొలి ఎపిసోడ్‌లోనే స్టార్‌ సినిమా రేంజ్‌లో ట్విస్ట్‌ ఇచ్చారు. దీప పుట్టుక చూట్టూ కథ అల్లుతూ ఆడియన్స్‌లో క్యూరియసిటీ పెంచారు. ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కో ట్విస్ట్‌ ఇస్తూ తొలివారంలో ఆడియన్స్‌ని టీవీలకే అతుక్కుపోయేలా చేశాడు డైరెక్టర్‌. దీంతో ఈ సీరియల్‌ టాప్‌ టీఆర్పీ రేటింగ్‌ నమోదు చేసుకుని మళ్లీ బుల్లితెరపై రికార్డు వేట కొనసాగిస్తుంది. మరి భవిష్యత్తులోనూ ఇదే రేటింగ్‌ను కొనసాగిస్తుందో లేదో చూడాలి. 

Continues below advertisement