Rashmika Mandanna First Look From Pushpa 2: నేషనల్‌ క్రష్‌ బర్త్‌డే సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. నేడు రష్మిక మందన్నా బర్త్‌డే సందర్భంగా 'పుష్ఫ' టీం ఫ్యాన్స్‌కి ట్రీట్‌ ఇచ్చింది. 'పుష్ప: ది రైజ్‌' నుంచి శ్రీవల్లి లుక్‌ను రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం ఆమె లుక్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తుంది. ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో శ్రీవల్లి చాలా సీరియస్‌గా కనిపించింది. ఫస్ట్‌ పార్ట్‌లో మిడిల్‌ క్లాస్‌ పల్లెటూరి అమ్మాయి కనిపించిన శ్రీవల్లి.. పార్ట్‌ 2 మాత్రం రిచ్‌ లుక్‌లో ఉంది. పట్టుచీర, ఒంటినిండా నగలతో మెరిసిపోయింది. చూపుడు, బోటన వేలు మడతపెట్టి అందులో నుంచి చఆ సీరియస్‌గా చూస్తూ కనిపించింది. రష్మికను ఇలా చూస్తుంటే పార్ట్‌ 2లో ఆమె పాత్ర పవర్ఫుల్‌గా ఉంటుందనిపిస్తోంది.



ఇలా రష్మికను సీరియస్‌లో మోడ్‌లో చూసి పుష్పరాజ్‌ భార్య అంటే ఆ మాత్రం ఉంటుంది అంటూ ఫ్యాన్స్‌ అంతా కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా పార్ట్‌ 2లో పుష్పరాజ్‌లా తన పాత్ర కూడా చాలా పవర్ఫుల్‌గా ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగా రష్మిక ఈ లుక్‌లో బాస్‌ లేడీలా ఉంది. ప్రస్తుతం ఆమె ఫస్ట్‌కు మంచి రెస్పాన్స వస్తుంది. దీంతో సోషల్‌ మీడియా మొత్తం శ్రీవల్లి లుక్‌తో నిండిపోయింది. కాగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కితున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్‌ పార్ట్‌ బ్లాక్‌బస్టర్‌ కావడంతో పార్ట్‌ 2 మంచి బజ్‌ నెలకొంది. దీంతో ఈ సినిమా నుంచి వస్తున్న ఎలాంటి అప్‌డేట్‌ అయినా క్షణాల్లో వైరల్‌ అవుతుంది. ఆ వెంటనే ట్రెండీంగ్‌లో నిలుస్తుంది. 






అల్లు అర్జున్ బర్త్‌డే గిఫ్ట్‌గా టీజర్‌


ఈ మూవీ గ్లింప్స్‌ తర్వాత 'పుష్ప 2' టీం మరే అప్‌డేట్‌ ఇవ్వలేదు. ఎంతోకాలంగా అప్‌డేట్‌ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌, మూవీ లవర్స్‌ కోసం పుష్ప 2 టీం అల్లు అర్జున్‌ బర్త్‌డే గిఫ్ట్‌ ప్లాన్‌ చేసింది. బన్నీ పుట్టిన రోజు కానుకగా ఆ రోజు టిజర్‌ రిలీజ్‌కు ముహుర్తం ఫిక్స్‌ చేశారు. ఇటీవల దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. "పుష్ప మాస్‌ జాతర మళ్లీ మొదలైంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న'పుష్ప : ది రూల్‌' టీజర్‌ ఏప్రిల్‌ 8న విడుదల కాబోతుంది. ఆ రోజు పుష్పరాజ్‌ డబుల్‌ ఫైర్‌తో రాబోతున్నాడు. వేచి ఉండండి" అంటూ ఈ అప్‌డేట్‌ ఫ్యాన్స్‌లో క్యూరియసిటి పెంచింది మూవీ టీం. ఈ సందర్భంగా రిలీజ్‌ చేసిన పోస్టర్‌ ఆకట్టుకుంది. ఇందులో పుష్పరాజ్‌ కాలుకు గజ్జతో ఒంటి కాలిపై నిలుచుకుని ఉన్న పోస్టర్‌ రిలీజ్‌ చేశారు.


అయితే ఒక్క కాలును మాత్రమే చూపించడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. నేడు శ్రీవల్లి ఫస్ట్‌లుక్‌ రావడం, మరో మూడు రోజుల్లో పుష్ప 2 టీజర్‌ రావడంతో నిజంగానే బన్నీ ఫ్యాన్స్‌కి మాస్‌ జాతర మొదలైనట్టు అనిపిస్తుంది. ఈ మూవీ ఈ ఏడాది ఆగస్ట్‌ 15న విడుదల చేయనున్నారు. సెకండ్‌ పార్ట్‌లో 'పుష్పరాజ్‌' మలయాళి స్టార్‌ హీరో ఫహాద్ ఫాజిల్ పోటీ పడనున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం అల్లు అర్జున్‌ స్మగ్లర్‌ కాగా.. ఫహాద్‌ పవర్ఫుల్‌ విలన్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఫస్ట్‌ పార్ట్‌ వీరిద్దరి పరిచయం చేశారు. ఇక సెకండ్‌ పార్ట్‌ పుష్పరాజ్‌, భన్వర్‌ సింగ్‌ల హోరహోరి పోరు ఉండబోతుంది. ఇక ఈ చిత్రంలో ఫహాద్‌తో పాటు జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేనీ, యలమంచిలి రవిశంకర్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.