Rashmika's First Look From The Girlfriend Movie : గత ఏడాది 'యానిమల్' మూవీ తో పాన్ ఇండియా హిట్ అందుకున్న రష్మిక మందన ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తోంది. శుక్రవారం (ఏప్రిల్ 5) ఆమె పుట్టినరోజు కావడంతో తన లేటెస్ట్ మూవీస్ నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ టీం ఫ్యాన్స్ కి ఓ సర్ప్రైజ్ అందించారు. రష్మికకి బర్త్ డే విషెస్ అందజేస్తూ 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.


ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంటున్న రష్మిక


'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లో రష్మిక ట్రెడిషనల్ లుక్ తో ఆకట్టుకుంటుంది. ఇందులో ఆమె డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం 90 ల కాలం నాటిని తలపిస్తుంది. చేతికి ఓల్డ్ మోడల్ వాచ్ ధరించి కాలేజ్ అమ్మాయిగా రష్మిక డీసెంట్ లుక్ అదిరిపోయింది.' ఆమె పెదాల కంటే ముందు కళ్ళు చిరునవ్వులను చిందిస్తాయి. ఆమె మాట్లాడడానికి కంటే ముందు ఆ కళ్ళు ఎన్నో అందమైన భావాలను పలికిస్తాయి' అనే క్యాప్షన్ తో ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. తాజాగా రిలీజ్ అయిన 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 







రష్మిక సరసన 'దసరా' హీరో


'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ లో రష్మిక మందన జోడిగా 'దసరా' మూవీ ఫేమ్ దీక్షిత్ శెట్టి నటిస్తున్నాడు. పలు కన్నడ సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దీక్షిత్ శెట్టి.. నాని నటించిన 'దసరా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో నాని ప్రాణ స్నేహితుడి పాత్రలో ఆకట్టుకున్నాడు. 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీలో ఏకంగా నేషనల్ రష్మిక మందనకు బాయ్ ఫ్రెండ్ గా కనిపించబోతున్నాడు. 


'మన్మథుడు 2' తర్వాత


'ది గర్ల్ ఫ్రెండ్' మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. 'అందాల రాక్షసి' సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్ 'చి.ల.సౌ.' అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత నాగార్జునతో 'మన్మధుడు 2' చేశాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. దాంతో సుమారు ఐదేళ్లపాటు డైరెక్షన్ కి దూరంగా ఉన్న రాహుల్ రవీంద్రన్ మళ్లీ 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీతో మెగా ఫోన్ పట్టాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాని ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అల్లు అరవింద్ సమర్పణలో మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మోగిలేని ఎంటర్టైన్మెంట్ సంస్థలపై విద్యా నొప్పినీడి, ధీరజ్ మిగిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. కృష్ణన్ వసంత సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం సమకూరుస్తున్నారు.


Also Read : మోడలింగ్‌ నుంచి పాన్ ఇండియా రేంజ్ వరకు - రష్మిక గురించి ఈ విషయాలు తెలుసా?