CKS vs SRH Match In Hyderabad: ఉప్పల్(Uppal) మ్యాచ్ రికార్డులతో ఎంత ఫేమస్ అయిందో వివాదాలతో కూడా అంతే ఫేమస్. కీలకమైన ఐపీఎల్ (IPL 2024) మ్యాచ్ జరుగుతున్న టైంలో విద్యుత్ శాఖతో ఇచ్చిన ఝలక్‌కు నిర్వాహకులకు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి ఏర్పండి. విద్యుత్ బకాయిలు ఉన్నాయని చెప్పి మ్యాచ్‌కు 24 గంటల ముందు ఉప్పల్ స్టేడియానికి సరఫరాల నిలిపేయడం పెను సంచలనంగా మారింది. ఈ వార్త జాతీయ స్థాయిలో కూడా మోతమోగిపోయింది.
ఉప్పల్‌లో మొన్న జరిగిన మ్యాచ్‌లో రికార్డుల వర్షం కురిసింది. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక పరుగులు రికార్డు బ్రేక్ అయింది. అతి పెద్ద జట్టు అయిన ముంబైపై హైదరాబాద్ టీం చరిత్ర తిరగరాయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అలాంటి టైంలో అదే వేదికపై చెన్నై లాంటి దిగ్గజ జట్టుతో తలపడుతుంది అంటే ఎంత హైప్ ఉంటుంది.
ఇంతటి హైప్ ఉన్న మ్యాచ్ మరో 24 గంటల్లో జరగనున్న తరుణంలో విద్యుత్ కోత విధించడంతో అంతా విస్మయం చెందారు. అసలు ఏం జరుగుతోందో అన్న చర్చ నడిచింది. అయితే దీనికి విద్యుత్ శాఖ ఓ కారణం చెబుతుంటే... హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాత్రం వేరే కారణం చెబుతోంది.
ఉప్పల్ స్టేడియం నిర్వాహకులు కొన్ని నెలల నుంచి విద్యుత్ బకాయిలు చెల్లించడం లేదని విద్యుత్ శాఖాధికారులు చెబుతున్నారు. వాటి వసూల కోసం చాలా సార్లు నోటీసులు పంపించినా ఎవరూ స్పందించడం లేదన్నది విద్యుత్ అధికారులు వాదన.
ఉప్పల్ స్టేడియానికి విద్యుత్ సరఫరా నిలిపేయడంపై హబ్సిగూడ ఎస్.ఈ రాముడు స్పందిస్తూ... " చాలా కాలంగా ఉప్పల్ స్టేడియం నిర్వాహకులు విద్యుత్ బిల్లులు చెల్లిచండం ేదు. 1.67 కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. 2015లో దీనిపై కేసు నమోదు అయింది. 15 క్రితం కూడా నోటీసులు పంపించాం. అయినా స్పందించే వాళ్లు లేరు. అందుకే ఇప్పుడు సరఫరా నిలపేశాం. ఇప్పుడు విద్యుత్ చౌర్యం కేసు కూడా నమోదు చేశాం." అని చెప్పారు.
కీలకమైన మ్యాచ్ ముందు ఇలా టెన్షన్ పెట్టడంపై ఉప్పల్ స్టేడియం నిర్వహాకులు మండిపడుతున్నారు. తమకు టికెట్లు కావాలని అధికారులు అడిగారని.. అవి ఇవ్వకపోవడంతో ఇలా ఇబ్బంది పెడుతున్నారని ఉప్పల్ స్టేడియం నిర్వహాకులు ఆరోపిస్తున్నారు.
దీనిపై జోక్యం చేసుకున్న హెచ్‌సీఏ ఉన్నతాధికారులు సమస్యను పరిష్కరించారు. కీలకమైన మ్యాచ్ ఉన్న టైంలో సమస్యలు సృష్టించడం సరికాదని విద్యుత్ శాఖాధికారులతో మాట్లాడి విద్యుత్ పునరుద్ధరించారు. అర్థరాత్రి తర్వాత సమస్యకు పరిష్కారం లభించింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.