సీఎం చంద్రబాబు అమరావతి పర్యటన


ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) గురువారం అమరావతిలో (Amaravathi) పర్యటిస్తున్నారు. ఉండవల్లి ప్రజావేదిక నుంచి పర్యటన ప్రారంభించిన ఆయన.. జగన్ ప్రభుత్వం కూల్చేసిన ప్రజావేదిక (Prajavedika) శిథిలాలను పరిశీలించారు. ఉద్దండరాయుని భూమి పూజ ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. అక్కడ చంద్రబాబు మోకాళ్లపై కూర్చుని సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం రాజధాని నిర్మాణాలను పరిశీలించనున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్, అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాన్ని పరిశీలిస్తారు. ఇంకా చదవండి


ఇకపై ఆయన ముద్రగడ పద్మనాభ రెడ్డి


ముద్రగడ పద్మనాభం పేరు ఇకపై ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారిపోయింది. ఆయన పేరు మార్పుపై అధికారిక ప్రకటన వెలువడింది. ఇకపై ఆయన్ని ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పిలవాలని అందులో పేర్కొన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి గెలవడంతో ముద్రగడ తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. ఈ మేరకు అధికారిక ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు గెజిట్ విడుదల చేశారు. ఇంకా చదవండి


బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహీపాల్ ఇంట్లో ఈడీ సోదాలు


బీఆర్ఎస్ నేత, పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి (Mahipal Reddy) ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) సోదాలు నిర్వహించింది. గురువారం ఉదయం 5 గంటల నుంచి పటాన్ చెరులోని ఆయన నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి నివాసంలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. పటాన్ చెరులోని 3 ప్రాంతాలతో పాటు నిజాంపేటలోని మహిపాల్ రెడ్డి బంధువుల నివాసాల్లోనూ సోదాలు చేస్తున్నారు. గతంలో లగ్డారం గనుల వ్యవహారంలో స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో మహిపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డిపైనా కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇంకా చదవండి


సీఎంగా ప్రజాధనం దుర్వినియోగం - రుషికొండ ప్యాలెస్‌పై జగన్ ఏం సమాధానం చెబుతారు?


మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో  సరిగ్గా రోడ్లను వేయలేకపోయారు. వాటికి కనీసం మరమ్మతులు కూడా చేపట్టలేకపోయారు. నిధుల లేమి కారణంగా ఎన్నో ప్రాజెక్టులు ఆగిపోయాయి. గ్రామాల్లో వాటర్ ట్యాంకర్లు సరఫరా చేసినందుకు కోవిడ్ సమయంలో పేషంట్లకు భోజనాలు సరఫరా చేసినందుకు బిల్లులు చెల్లించాలని కానీ ప్రభుత్వం ఇవ్వడం లేదని   చిన్న చిన్న కాంట్రాక్టర్లు లక్షల సంఖ్యలో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. ప్రతీ వారం అప్పులు తీసుకు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ వివరాలు  బయటకు రావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇంకా చదవండి


40 శాతం ఓట్లొచ్చినా జగన్ ఎందుకు గెలవలేదు - రోజా అనుమానాలు


రుషికొండ ప్యాలెస్‌పై జరుగుతున్న ప్రచారం అంతా తప్పేనని మాజీ పర్యాటక మంత్రి రోజా అన్నారు. ఓ టీవీ చానల్ తో మాట్లాడిన ఆమె రుషికొండపై కీలక వ్యాఖ్యలు చేశారు. రిషికొండలో పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా పర్యాటక శాఖ కట్టిన భవనాలు అవన్నారు. తామేమీ వర్షానికి కారిపోయే అసెంబ్లీ, సచివాలయం కట్టలేదని.. సెవెన్‌ స్టార్‌ రేంజ్‌లో పర్యాటక శాఖ భవనాలు నిర్మించామన్నారు. హైదరాబాద్‌లోని ఫలక్ నుమా ప్యాలెస్ అంత లగ్జరీగా నిర్మించామన్నారు. వేరే దేశాల నుంచి పర్యాటకులు వచ్చినప్పుడు అక్కడ ఉండొచ్చు.. లేదంటే ఎవరికైనా లీజుకు ఇచ్చుకోవచ్చన్నారు.  కట్టింది ఖరీదైన భవనం  కాబట్టి ఖరీదైన ఫర్నీచర్ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇంకా చదవండి