ED Searches In BRS MLA Mahipal Reddy House: బీఆర్ఎస్ నేత, పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి (Mahipal Reddy) ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) సోదాలు నిర్వహించింది. గురువారం ఉదయం 5 గంటల నుంచి పటాన్ చెరులోని ఆయన నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి నివాసంలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. పటాన్ చెరులోని 3 ప్రాంతాలతో పాటు నిజాంపేటలోని మహిపాల్ రెడ్డి బంధువుల నివాసాల్లోనూ సోదాలు చేస్తున్నారు. గతంలో లగ్డారం గనుల వ్యవహారంలో స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో మహిపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డిపైనా కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. బినామీ పేర్లతో మైనింగ్ వ్యాపారాలు చేస్తున్నట్లు గుర్తించారు. రియల్ ఎస్టేట్స్ వ్యాపారంలో బినామీ పేర్లతో పెట్టుబడి పెట్టినట్లు ఈడీ అధికారులు పేర్కొంటున్నారు.


Also Read: Hyderabad News : హైదరాబాద్‌ నుంచి కౌలాలంపూర్‌ వెళ్లే విమానంలో మంటలు- టేకాఫ్ అయిన కాసేపటికే ఘటన