Today Top Headlines In AP And Telangana:


1. జగన్‌ పర్యటనపై ఎన్డీఏ నేతల కీలక నిర్ణయం


ఆంధ్రప్రదేశ్‌లో వారం రోజుల క్రితం మొదలైన తిరుపతి లడ్డూ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకరి తర్వాత ఒకరు ఈ విషయంపై ఏదో రూపంలో మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. రెండు రోజుల్లో ఆయన తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకోనున్నారు. అంత కంటే ముందే తిరుమల వెళ్లనున్నారు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి తిరుమల పర్యటన చుట్టూ వివాదం నడుస్తోంది. ఆయన పర్యటన అడ్డుకుంటామని కొందరు స్వామీజీలు పిలుపునిచ్చారు. ఇంకా చదవండి.


2. తిరుపతి లడ్డూ వివాదంతో అయోధ్య రామాలయ పూజారి సంచలన వ్యాఖ్యలు


తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఆలయాల్లో ప్రసాదం తయారీపై చర్చకు దారి తీసింది. గుడుల్లో ఇచ్చే ప్రసాదాన్ని పూర్తిగా ఆలయ పూజారుల పర్యవేక్షణలోనే తయారు చేయాలని అయోధ్య రామాలయ పూజారి సత్యేంద్ర దాస్‌ డిమాండ్ చేశారు. దేశంలోని అన్ని ఆలయాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని సూచించారు. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఆలయాల్లో ప్రసాదాల తయారీపై నిఘా పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రసాదం తయారీ పంపిణీ విషయంలో మార్పులు తేవాల్సిన అవసరాన్ని పూజారులు గుర్తు చేస్తున్నారు. ఇంకా చదవండి.


3. తిరుమల డిక్లరేషన్ చుట్టూ ఎందుకీ వివాదం


తిరుమల శ్రీవారి మహాదివ్య క్షేత్రం. ఇక్కడికి వచ్చే భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో స్వామి వారు కోరిన కోర్కెలు తీర్చే కోదండరాయుడిగా కీర్తిస్తూ ఉంటారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు అన్యమతస్తులు అయితే వారు డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. అసలు డిక్లరేషన్ అంటే ఏంటో చూద్దాం. తిరుమలను, ఆలయ పవిత్రతను ఎంతో మంది వందల సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నారు. రాజులు, బ్రిటిష్ ప్రభుత్వం, మహంతుల కాలం నుంచి తిరుమల పవిత్రతను... అక్కడ జరగాల్సిన పూజా కార్యక్రమాలను వైఖానస ఆగమ సాంప్రదాయం ప్రకారం వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇంకా చదవండి.


4. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు


తెలంగాణలో మరోసారి ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఏకంగా మంత్రి నివాసంలోనే సోదాలు చేయడం రాజకీయంగా కూడా కాక రేపుతోంది. సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసంలో తనిఖీలు సంచలనంగా మారుతున్నాయి. ఈ ఉదయం నుంచి ఏక కాలంలో 16 ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌డైరెక్టరేట్‌ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సీఆర్పీఎఫ్‌ భద్రత మధ్య సోదాలు జరుగుతున్నాయి. ఇంకా చదవండి.


5. ఎస్సై అత్యుత్సాహంతో వ్యక్తి ఆత్మహత్య


సినిమాల్లో చూపించినట్టు రియల్ లైఫ్‌లో చేద్దామని భావిస్తున్న కొందరు పోలీసు అధికారులు బోల్తా పడుతున్నారు. ఈ మధ్య కాలంలో పోలీసులోని కొందరు అధికారులు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఏదో అధికారిపై ఏదో ఆరోపణ వస్తూనే ఉంది. ఇటీవల జగిత్యాల జిల్లాలో ఓ మహిళపై ఓ ఏఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ కొట్టిన వీడియో వైరల్ అయింది. ఇది జనాలు మర్చిపోక ముందే జగిత్యాల జిల్లాలో మరో ఘటన వెలుగుచూసింది. ఇంకా చదవండి.