Meghasandesham Serial: జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారం అవుతున్న మేఘసందేశం సీరియల్‌ రోజురోజుకు టీఆర్పీ రేటింగ్‌లో దూసుకుపోతుంది. ఇప్పటికే 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ సీరియల్‌ ను బుల్లి తెర ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే మేఘసందేశం సీరియల్‌  హీరోయిన్‌ గా యాక్ట్‌  చేస్తున్న భూమి గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలను. ఆమె ఆందుకున్న అవార్డులను ఆమె బ్యాక్‌ గ్రౌండ్‌ ఎంటో  ఈ కథనంలో తెలుసుకుందాం.


మేఘసందేశం సీరియల్‌ లో తన అందంతోనూ యాక్టింగ్‌ తోనూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న భూమి  అసలు పేరు  భూమికా రమేష్‌. భూమి స్వస్థలం కర్ణాటక రాష్ట్రం.  ఆమె కన్నడ నటి. భూమి వయసు ఇప్పుడు 20 సంవత్సరాలు.  అయితే భూమి చైల్డ్‌ ఆర్టిస్టుగా బుల్లితెర  ప్రేక్షకులు సుపరిచితురాలు. కన్నడలో వచ్చిన డాన్సింగ్‌ స్టార్‌ అనే ఫ్రోంగ్రాంలో పాల్గొనడమే కాకుండా  పది సంవత్సరాల క్రితం తెలుగులో వచ్చిన  బుల్లితెర సంచలనం ఆట జూనియర్స్‌ ఫ్రోగ్రాం లో పాల్గొనడమే కాకుండా  చైల్డ్‌  డాన్సర్‌ గా తన టాలెంట్‌తో ఎంతో మంది ప్రేక్షకులు అభిమానాన్ని సంపాదించుకుంది. ఆట జూనియర్స్‌ కార్యక్రమానికి జడ్జిగా చేసిన ప్రముఖ కొరియోగ్రాఫర్‌ సుందరం మాస్టర్‌.. భూమి డాన్స్‌ చూసి ఆశ్యర్యపోయారు. ఆమె ఫెర్మామెన్స్‌ కు ఫిదా అయిన సుందరం మాస్టర్‌ భూమి మంచి డాన్సరే కాదు గుడ్‌ యాక్టర్‌ కూడా అవుతుందని ఆయన మెచ్చుకున్నారు. ఆయన చెప్పినట్లుగానే భూమి ఇప్పుడు మేఘసందేశం సీరియల్‌ ద్వారా తెలుగు ప్రేక్షకుల అభిమాన నటిగా మారిపోయింది.


ALSO READ: ఇంట్లో బల్లులతో విసిగిపోయారా? ఇలా చేయండి బల్లులన్నీ పరార్


భూమి తనకు  చిన్నప్పటి నుంచి యాక్టింగ్‌ అంటే చాలా ఇష్టమని అందుకే డాన్స్‌ కూడా నేర్చుకున్నాని చెప్పింది. చిన్నప్పటి నుంచే ఆడిషన్స్‌కు వెళ్లేదాన్ని అని చెప్పిన భూమి తనకు  కొద్ది సంవత్సరాల క్రితం ఓ కన్నడ సీరియల్‌ లో  హీరోయిన్‌ గా నటించే అవకాశం వచ్చిందని అయితే వయసు తక్కువగా ఉందన్న కారణంతో  ఆ సీరియల్‌ నుంచి తనను తప్పించినట్లు తెలిపింది. తర్వాత కొద్ది సంవత్సరాలకు కన్నడలో ఫేమస్‌ సీరియల్ అయిన భాగ్యలక్ష్మీలో వన్‌ ఆఫ్‌ ది మేయిన్ లీడ్‌ క్యారెక్టర్‌ లో నటించే చాన్స్‌ వచ్చింది. ఆ చాన్స్‌ తాను వదులుకోలేదని ఆ పాత్రతో తనకు చాలా తక్కువ టైంలోనే ఎక్కువ గుర్తింపు వచ్చిందని చెప్పుకొచ్చింది భూమి. తన భరటనాట్యంలో ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకున్నట్లు.. ఆమె తెలపారు.



భూమి తండ్రి పేరు రమేష్‌. తండ్రి పేరునే తీసుకుని తాను భూమికా రమేష్‌గా పెట్టుకుంది. భూమి ప్రస్తుతం మేఘసందేశం సీరియల్‌ లో యాక్టింగ్‌ చేస్తూనే డిగ్రీ చదువుతోందట. ఇక ఇదే కాకుండా భరతనాట్యంలో ప్రొఫెసనల్‌ కోర్స్‌ కూడా చేస్తున్నట్లు భూమి ఓ ప్రయివేటు చానెల్‌ కు ఇచ్చిన  ఇంటర్వూలో చెప్పింది. నా అదృష్టం కొద్ది మేఘసందేశం సీరియల్‌ లో కూడా నాకు డాన్సర్‌గా చేసే పాత్ర వచ్చిందని భూమి చెప్తుంది. మొదట్లో అటు డాన్స్‌ నేర్చుకోవడం చదువుకోవడం సీరియల్‌ లో నటించడం కష్టంగా ఉండేదని.. చాలా ఇబ్బదులు ఎదుర్కొన్నానని అయితే  ఇప్పుడు అంతా అలవాటు అయిపోయిందని భూమి చెప్తుంది.


ALSO READ: అదృష్టాన్ని తీసుకొచ్చే పుట్టుమచ్చలు, శరీరంపై ఎక్కడ ఉంటే ఏం ప్రయోజనమో తెలుసా?