AP TS Power Issue :   ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ  మధ్య ఏర్పడిన విద్యుత్ బకాయిల వివాదంలో కేంద్రం జోక్యం చేసుకుంది. ఏపీకి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలని ఆదేశించింది. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు రాజకీయ దురుద్దేశంతో ఇచ్చినవి , పూర్తి అసంబ‌ద్ద‌మైన ఉత్త‌ర్వులు అని తెలంగాణ విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డి మండిప‌డ్డారు. కేంద్రం జారీ చేసిన‌ విద్యుత్ ఉత్తర్వులపై న్యాయపోరాటం చేస్తామ‌ని పేర్కొన్నారు. తెలంగాణ‌ రాష్ట్రంలో విద్యుత్ కోతలు రావాలని కేంద్రం కుట్రలు చేస్తోందని విమర్శించారు. కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగా కేంద్ర ఉత్తర్వులు ఉన్నాయని మంత్రి తెలిపారు. 


ఏపీ నుంచి తమకే రావాలంటున్న తెలంగాణ


కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని కేసీఆర్ దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతారని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ‌కు రూ. 12,941 కోట్లు రావాలని చెబుతున్నా పట్టించుకోవడంలేదన్నారు. తెలంగాణ వాదనలు వినకుండా ఆంధ్ర వాదనలు విని కేంద్ర ఏకపక్ష ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. విద్యుత్ రంగంలో బీజేపీ సాధించలేని విజయాన్ని తెలంగాణా సాధించిందని అక్కసు వెళ్ల‌గ‌క్కుతుంద‌న్నారు. సంవత్సర కాలంగా తెలంగాణ విద్యుత్ సంస్థలను ఇబ్బందులకు గురి చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బీజేపీ వైఫల్యాలపై కేసీఆర్ ప్రశ్నిస్తునందునే తెలంగాణ రాష్ట్రాన్ని టార్గెట్ చేస్తున్నారు. 


"రైతు రాజకీయం" సాధ్యమేనా ? కేసీఆర్ జాతీయ రాజకీయాల " ఈక్వేషన్స్ " వర్కవుట్ అవుతాయా?


రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం బీజేపీకి రుచించడం లేదు 


డబుల్ ఇంజిన్ సర్కార్లు విఫలమైన సందర్భంలో నూతన రాష్ట్రం తెలంగాణ విజయపథంలో దూసుకెళ్తుండటంతో దుగ్దతో కుట్రలు చేస్తున్నార‌ని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు.అందుబాటులో ఉన్న వనరులతో దేశం మొత్తం రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇవ్వొచ్చని కేసీఆర్ చెప్పడం బీజేపీకి రుచించడం లేద‌ని జ‌గ‌దీశ్ రెడ్డి అన్నారు. పునర్విభజన చట్టంలో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోవడంలేదని ప్రశ్నించారు. ఏపీ నుంచి రూ.12,940 కోట్ల బకాయిల విషయం కేంద్ర ప్రభుత్వ దృష్టిలో ఉన్నదని, కానీ, ఈ రోజు కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని, 30 రోజుల్లో బకాయిలను ఏపీకి చెల్లించాలంటూ తెలంగాణకు ఆదేశాలిచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ఎవరు ఎవరికి బాకీ ? ఏపీ, తెలంగాణ విద్యుత్ బకాయిల వివాదం పూర్తి డీటైల్స్ ఇవిగో !


కేంద్ర ప్రభుత్వం దుర్మార్గానికి పాల్పడుతోంది !


‘నెల రోజుల్లో చెల్లించాలనడం ముమ్మాటికీ దుర్మార్గమే. జాతీయ ప్రభుత్వంగా చెయ్యాల్సింది కాదు. తెలంగాణను చీకట్లోకి పంపేందుకే ఈ నిర్ణయాలు. మోటర్లకు మీటర్లు పెట్టనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించినందుకే కేంద్రం ఈ దుశ్చర్యకు దిగింది. కేంద్రానికి ఏపీ లేఖలే కనపడుతున్నాయి. తెలంగాణ లేఖలను మోదీ సర్కార్‌ పట్టించుకోవడం లేదు’ అని మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఈ అంశంపై న్యాయపోరాటానికి తెలంగాణ సర్కార్ మొగ్గు చూపుతోంది. 


ఘన్‌పూర్‌లో TRS వర్గపోరు: నీ చరిత్ర తీస్తే బయటతిరగలేవు - రాజయ్యకు కడియం స్ట్రాంగ్ కౌంటర్