కృష్ణ వంశీ.. తెలుగు సినిమా పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు. విభిన్న కథాంశాలతో సినిమాలు తెరకెక్కించి మంచి సక్సెస్ అందుకున్నారు. క్రియేటివ్ దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు. ఆయన దర్శకత్వంలో గులాబీ, సింధూరం, ఖడ్గం, అంతఃపురం వంటి సినిమాలు తెరకెక్కాయి. ఇండస్ట్రీకి హిట్స్ అందుకున్నాయి. అలాంటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కృష్ణ వంశీ తాజాగా తెరకెక్కిస్తున్న సినిమా 'రంగమర్తాండ'. నక్షత్రం మూవీ తర్వాత సుమారు ఐదేండ్లకు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. డిఫరెంట్ కాన్సెఫ్ట్ తో రూపొందిన ఈ సినిమాలో రమ్యకృష్ణ సైతం కీలక పాత్ర చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు రెడీ అవుతుంది.
అటు స్టార్ హీరోయిన్‌గా, గ్లామర్ బ్యూటీగా తెలుగు సినిమా పరిశ్రమను ఓ ఊపు ఊపింది రమ్యకృష్ణ. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ పలు సినిమాలు చేశారు. సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో ఆమె సెకెండ్ ఇన్నింగ్స్ ను గ్రాండ్ గా ఆరంభించారు. ఈ సినిమాలో శివగామి దేవిగా అద్భుత నటన కనబర్చి సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా లైగర్ సినిమాలోనూ నటించి మెప్పించారు. ఆమె పవర్ ఫుల్ పాత్రకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తాజాగా ఆమె నటించిన 'రంగమర్తాండ' సినిమా విడుదలకాబోతుంది. కెరీర్ పీక్స్ లో ఉండగానే దర్శకుడు కృష్ణ వంశీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
వాళ్లు చెన్నైలో.. నేను హైదరాబాద్ లో..
తాజాగా 'రంగమర్తాండ' సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో కృష్ణ వంశీ యాక్టివ్ గా పాల్గొంటున్నారు. అన్ని ఛానెళ్లకు వరుసబెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా సినిమాలతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడిస్తున్నారు. అదే సమయంలో తన భార్య రమ్య కృష్ణ గురించి కూడా ఆసక్తికర ముచ్చట్లు చెప్పారు. ప్రస్తుతం రమ్యకృష్ణ కెరీర్ హైరేంజ్ లో కొనసాగుతుందని చెప్పారు. ఆమె రేంజ్ ని మ్యాచ్ చేయడానికి చాలా కష్ట పడుతున్నట్లు వెల్లడించారు. ఆమెతో తనకు ఫుల్ కాంపిటీషన్ ఉన్నట్లు చెప్పారు. కొడుకుతో కలిసి రమ్యకృష్ష చెన్నైలో ఉంటున్నారని తెలిపారు. సినిమాల కోసం తాను హైదరాబాద్ లో ఉంటున్నట్లు వంశీ తెలిపారు. ఎప్పుడు ఖాళీ టైం దొరికినా తాను చెన్నైకి వెళ్తుంటానని చెప్పారు. లేదంటే, వాళ్లే ఇక్కడికి వస్తారని వెల్లడించారు. కృష్ణ వంశీ, రమ్య కృష్ణ వేర్వేరుగా ఉంటున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలాంటి రూమర్లను తాము పట్టించుకోమన్నారు. ఇండస్ట్రీలో ఉన్న వారి మీద ఇలాంటి గాసిప్స్ రావడం సాధారణమేనని అన్నారు.
మా అబ్బాయి చాలా యాక్టివ్..
ప్రస్తుతం తన కొడుకు రిత్విక్ పదవ తరగతి చదువుతున్నాడని కృష్ణ వంశీ తెలిపారు. అతడు చాలా యాక్టిగ్ గా ఉంటాడని చెప్పారు. ‘‘మాకు ఇదే కావాలని రిత్విక్‌పై ఒత్తిడి చేయం. అతడికి ఏం కావాలో అదే అవ్వుతాడు. ఓ వారం క్రెకెట్ అంటే, మరో వారు బిజినెస్ అంటాడు. ఆ తర్వాత వారం క్రిప్టో కరెన్సీ అంటాడు. మద్రాసులో తమకు దూరంగా పెరిగాడు. అప్పుడప్పుడు వాళ్లమ్మతో షూటింగ్స్ కు వెళ్తాడు. కొడుకును రమ్యకృష్ణ నిత్యం గమనిస్తూనే ఉంటారు’’ అని కృష్ణ వంశీ పేర్కొన్నారు.
Also Read : హిందీ నటుడు, విమర్శకుడు కేఆర్కేను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు