KCR National Politics : తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటి వరకూ వచ్చింది కాబట్టి ఇక వెనక్కి తగ్గలేరు. అందుకే దేశవ్యాప్తంగా రైతు నేతలందర్నీ ప్రగతిభవన్‌కు పిలిపించి రెండు రోజుల పాటుమేధోమథనం నిర్వహించారు. రైతులు రాజులు కావాల్సిన సమయం వచ్చిందన్నారు. రైతు ప్రతినిధులు పార్లమెంట్‌లో ఉండాల్సిన అవసరం వచ్చేసిందన్నారు. కేసీఆర్ మాటలను బట్టి చూస్తే.. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ సింగిల్ పాయింట్‌గా రైతు ఎజెండాతో వెళ్లబోతున్నారని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. రైతుల్ని ఏకతాటిపైకి తెస్తే కేసీఆర్ అనుకున్నది సాధించగలరా ? బీజేపీని ఓడించి రైతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరా ? జాతీయ రైతు నేతగా కేసీఆర్ చరిత్ర సృష్టించగలరా ?    


దేశవ్యాప్తంగా రైతు సంఘాల నేతలందర్నీ రాజకీయ తెరపైకి తెస్తున్న కేసీఆర్ 


తెలంగాణ సీఎం కేసీఆర్  రెండు రోజుల పాటు ప్రగతి భవన్‌లో దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాల ప్రతినిధులోత మేథమథనం జరిపి.. రాజకీయం  పోరాటాలు చేయాల్సిన అవసరాన్ని వారికి  వివరించారు.  మోదీని ఎుదర్కొనేలా రాజకీయం చేయాలని వారికి ఉద్భోదించారు. వారంతా చట్టసభల్లో ఉండాల్సిన అవసరం ఉందని .. కూడా ఉన్నారు. అంటే.. వారంతా రైతు ఉద్యమాలను రాజకీయాలను కలపాలని కేసీఆర్ ... సూటిగా సలహా ఇచ్చేశారు. వారికి కూడా ఆ సలహాలు బాగా నచ్చాయని.. తమ తమ రాష్ట్రాల్లో కార్యాచరణ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.  తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు ఉద్యమం చేస్తామని కేసీయార్ చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆ ఉద్యమానికి నేతృత్వం వహించేందుకా అన్నట్లుగా..  రైతు సంఘాలను  కలుపుకుంటున్నారు. ఇప్పటికే ఓ సారి రైతు సమస్యలపై ఢిల్లీలో ధర్నా చేశారు కూడా. ముందు ముందు ఈ పోరాటాలు పెంచనున్నారు. రైతు సెంటిమెంట్‌ను పట్టిస్తే.. ఇక ఎదురే ఉండదని కేసీఆర్ గట్టి నమ్మకం . ఉత్తరాది రైతులు కేంద్రంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని కేసీఆర్ నమ్ముతున్నారు. సకల జనుల సమ్మె తరహాలో సకల రైతుల సమాహారంగా నిరసనలు, దీక్షలు, ధర్నాలు, ఆందోళనలు చేస్తే ..  దానికి నాయకత్వం వహిస్తే..  జాతీయ స్థాయికి వెళ్లినట్లేనని కేసీఆర్ భావిస్తున్నారు.


తెలంగాణ రైతు పథకాల విస్తృత ప్రచార వ్యూహం ! 
 
కేసీఆర్ కొన్ని రోజులుగా దేశ్‌కి నేతగా... ప్రచారంలోకి వస్తున్నారు. దీని కోసం ఆయన... ఫెడరల్ ఫ్రంట్ అనే కూటమిని ప్రారంభించాలనుకున్నారు. కానీ వర్కవుట్ కాలేదు. అయితే కేసీఆర్ దగ్గర ఓ ఫార్ములా ఉంది.  రాజకీయాల్లో ఓటు బ్యాంక్ సృష్టి కీలకం. ఇప్పటి వరకూ రాజకీయ పార్టీలు కులం, మతం, ప్రాంతం ఆధారంగా రాజకీయాలు చేసి సక్సెస్ అయ్యాయి. అయితే ఏ రాజకీయ పార్టీ కూడా రైతులను ఏకతాటిపైకి తెచ్చి ఓటు బ్యాంక్‌గా మాల్చుకుని రాజకీయాలు చేయలేకపోయింది. అక్కడక్కడ కొన్ని రైతు పార్టీలుగా గుర్తింపు పొందినప్పటికీ.. దేశవ్యాప్తంగా రైతులందరిలో ఆదరణ పొందిన పార్టీ లేదు. అందుకే కేసీఆర్  రైతులను ఆకట్టుకుని దేశ రాజకీయాలను మలుపు తిప్పాలనుకుంటున్నారు. అందుకే తెలంగాణలో అమలవుతున్న అన్ని రైతు పథకాలపై జాతీయ మీడియాలో ఇప్పటికే విస్తృత ప్రచారం నిర్వహించారు.  నిర్వహిస్తున్నారు కూడా. 


రైతు సమస్యలపై స్పష్టమైన అవగాహనతో కేసీఆర్ !


కాంగ్రెస్, బీజేపీలు దశాబ్దాల పాటు దేశాన్ని పాలించి... సమృద్ధిగా ఉన్న నీళ్లను కూడా.. పొలాలకు అందివ్వలేకపోయాయన్నది కేసీఆర్ ఆ రెండు జాతీయ పార్టీలపై మోపుతున్న అభియోగం. రైతులందరికీ.. నీటి సౌకర్యం కల్పిండమే అజెండా అని... దానికి సంబంధించిన లెక్కలనూ చెబుతున్నారు. తాను తెలంగాణ రైతులకేం చేస్తున్నానో... దేశవ్యాప్తంగా అదే చేస్తానని కేసీఆర్ రైతుల్లోకి సందేశం పంపుతున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల రైతు సమస్యలపై అవగాహన ఉంది. రైతు ప్రతినిధులతో నిర్వహించిన చర్చా సమావేశాల్లోనూ అన్నిచోట్ల రైతుల సమస్యల గురించి కేసీఆర్ చర్చించి ప్రస్తావించారు. దీంతో రైతు సంఘాల నేతలకు కేసీఆర్‌పై మరింత నమ్మకం ఏర్పడింది. 


రైతులందర్నీ ఏకతాటిపైకి తెస్తే సంచలనమే !


మన దేశంలో పట్టణీకరణ పెరుగుతున్నపప్పటికీ ఇప్పటికీ వ్యవసాయాధారిత దేశమే. రైతులే మెజార్టీ ఉంటారు. రైతు బిడ్డలే ఇతర వ్యాపకాల్లోనూ ఉంటారు. అందుకే రైతుల్ని ఏకతాటిపైకి తీసుకు వస్తే రాజకీయంగా సంచలనం నమోదవుతుంది. అయితే అదంతా తేలిక కాదు. కానీ కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో.. ఎవరూ నమ్మకపోయినా అనుకున్నది సాధించడానికి రంగంలోకి దిగారు.  మొక్కవోనిపట్టుదలతో రాష్ట్రాన్ని సాధించే వరకూ వెనక్కి తగ్గలేదు. అందుకే కేసీఆర్ అంచనా వేస్తున్న రైతు రాజకీయం.. క్లిష్టంగా ఉందని.. అసాధ్యమని ఎక్కువ మంది భావిస్తున్నప్పటికీ ఆయనకు మాత్రంఫుల్ క్లారిటీ ఉంది. అందుకే ముందు ముందు జాతీయ రాజకీయాలు రైతుల చుట్టూ తిరేగే అవకాశం కనిపిస్తోంది.