హుజురాబాద్ కౌంటింగ్ ముగిసిన తర్వాతి రోజునే తెలంగామ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ జరిగింది. ఇందులో సహజంగానే  హుజురాబాద్ ఓటమిపై ఎక్కువ సేపు చర్చ జరిగింది. కొంత మంది నేతలు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికి సీరియస్‌గా ప్రయత్నించారు. అభ్యర్థి ఎంపికలోనే లోపముందని, గెలుపు కోసం పార్టీ సీరియస్‌గా వ్యవహరించలేదని కొంత మంది రేవంత్‌ను పరోక్షంగా టార్గెట్ చేశారు. ఇతర పార్టీలతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా ప్రచారం జరుగుతోందని ఇది పార్టీకి మంచిది కాదన్నారు. 


Also Read : 14న తిరుపతిలో అమిత్ షా, జగన్, కేసీఆర్ భేటీ ... తాజ్ హోటల్‌లో ఏర్పాట్లు !


ఈ క్రమంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ నాయకురాలు రేణుకాచౌదరి మధ్య కూడా ఘాటుగానే వాదన జరిగినట్లుగా తెలుస్తోంది. తర్వాత అందరూ కూల్ అయ్యారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దృష్టిపెట్టారు.   సభ్యత్వ నమోదు, ఇకపై ఆన్‌లైన్ ద్వారా చేపట్టాల్సిన డిజిటల్ మెంబర్‌షిప్ డ్రైవ్ గురించి చర్చించారు. సభ్యులకు ప్రమాద భీమా, నవంబర్ 14 నుంచి 15 రోజుల పాటు చేపడుతున్న ప్రజా చైతన్య పాదయాత్ర, విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్,  పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు, పార్టీ పటిష్టత తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.


Also Read : విజయగర్జనతోనే టీఆర్ఎస్ మళ్లీ ట్రాక్‌లోకి ! ఇక కేటీఆర్‌దే అసలు టాస్క్ !


నవంబర్ 9- 10 తేదీల్లో జిల్లా- మండల నేతలతో సమావేశాలు జరిపి.. ప్రజా చైతన్య యాత్ర నవంబర్ 14 నుంచి 21వరకు నిర్వహించాలని నిర్ణయించామని షబ్బీర్ అలీ ప్రకటించారు. హుజురాబాద్ ఎన్నిక ఫలితాలపై పీఏసీ అభిప్రాయం సేకరణ జరిగిందని.. అది కేసీఆర్-ఈటల మధ్య వ్యక్తిగత గొడవ కాబట్టి పోటీ వారి మధ్యే జరిగిందన్నారు. కేసీఆర్ రూ. 600 కోట్లు.. ఈటల రూ. 300 కోట్లు ఖర్చు పెట్టారని ప్రచారం జరుగుతోందన్నారు. ఏమైనా హుజురాబాద్ రిజల్ట్ పై రివ్యూ కమిటీ వేస్తామన్నారు. అక్కడ గెలిచించి ఈటలే కానీ బీజేపీ కాదని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. 


Also Read : ఆ తప్పు వల్లే కాంగ్రెస్‌కు ఘోర ఓటమి, ఈ మీటింగ్‌లో మొత్తం చెప్పేస్తా.. జగ్గా రెడ్డి అసంతృప్తి


హుజురాబాద్ ఓటమిని అంగీకరిస్తూ.. మా అభ్యర్థి వెంకట్ ను అభినందిస్తున్నామమని టీ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ ప్రకటించారు. ఎన్నిక ఫలితంతో కుంగిపోవడం లేదన్నారు. రాజకీయ- వ్యాపార ప్రయోగశాలగా తెలంగాణను టీఆర్‌ఎస్ - బీజేపీ తయారు చేశాయని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. డబ్బులు- మద్యం యథేచ్ఛగా పంచినా ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదన్నారు.


Also Read: Eatala Rajender: కేసీఆర్ అహంకారాన్ని బొంద పెట్టిన.. మీ రుణం తీర్చుకోలేను.. ఉపఎన్నిక ఫలితంపై ఈటల


సమావేశానికి లేటుగా హాజరైన జగ్గారెడ్డి మంగళవారం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు.ఇక ముందు మాట్లాడబోనన్నారు. సమావేశానికి హాజరైన జానారెడ్డి.. తన అవసరం ఉన్నట్లయితేనే జోక్యం చేసుకుంటానని, ఇప్పుడు ఆ చొరవ తీసుకోలేనని చెప్పి పది నిమిషాలు మాత్రమే సమావేశంలో పాల్గొని వెళ్ళిపోయారు. హుజురాబాద్ ఇంచార్జ్ దామోదర్ రాజనరసింహ కూడా మధ్యలోనే వెళ్లిపోయారు. కాంగ్రేస్ నేతలు బహిరంగంగా మాట్లాడొద్దని మానిక్కం ఠాకూర్ మరోసారి ఆదేశించారు. పార్టీ విషయాలు పీఏసీలోనే మాట్లాడాలని తేల్చి చెప్పారు. ఎంతపెద్ద నాయకుడైనా పార్టీ లైన్ లోనే వ్యాఖ్యలు చేయాలని స్పష్టం చేశారు. 


Also Read : వేల కోట్లు గుమ్మరించినా.. నేతలందర్నీ చేర్చుకున్నా ఎందుకీ పరాజయం ! కేసీఆర్ ఎక్కడ ఫెయిలయ్యారు ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి