తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ హుజురాబాద్ ఉపఎన్నికను వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఆయన ఉపఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నించారు. నేరుగా బరిలోకి దిగలేదు కానీ ప్రగతి భవన్ కేంద్రంగా దాదాపుగా ప్రతి రోజూ హుజురాబాద్‌లో ఎలా గెలవాలన్న చర్చలు జరిగేవి. సమీక్షలు జరిగేవి. వ్యూహాలు రూపొందేవి. పథకాలు రెడీ అయ్యేవి. కానీ ఏవీ హుజురాబాద్‌లో గెలిపించలేకపోయాయి.


Also Read : గెలుపు బావుటా ఎగరేసిన ఈటల.. ఏడోసారి ఎమ్మెల్యేగా విజయం
  
అధికారికంగా, అనధికారికంగా వేల కోట్ల ఖర్చు !


హుజురాబాద్ ఉపఎన్నిక దేశంలోనే అత్యంత ఖరీదైన ఉపఎన్నికగా రికార్డులకెక్కింది. ప్రభుత్వమే అధికారికంగా ఉపఎన్నిక లక్ష్యంగా పెడుతున్న ఖర్చు ఏకంగా రూ. మూడువేల కోట్ల వరకూ ఉంటోంది. అభివృద్ధి పనులు, పథకాల కోసం చేతికి ఎముక లేకుండా కేసీఆర్ నిధులు విడుదల చేశారు. దళిత బంధుకు రూ. రెండు వేల కోట్లు విడుదల చేశారు. గ్రామాల్లో   సీసీ రోడ్లు, డ్రైనేజీలు లాంటి పనులన్నీ చకచకా పూర్తి చేశారు. సంక్షేమ పథకాల లబ్దిదారుల్ని శరవేగంగా ఎంపిక చేశారు. పద్మశాలీ, నాయిబ్రాహ్మణ, రెడ్డి, కాపు, వైశ్య, గౌడ సామాజికవర్గాలతో ఆత్మీయ సమావేశాలు పెట్టారు. వారి కోరికలను తీర్చారు. ప్రభుత్వమే అధికారికంగా అభివృద్ధి పనులు. సంక్షేమం కోసం రూ. మూడు వేల కోట్ల వరకూ ఖర్చు చేసింది. ఇక పార్టీ పరంగా టీఆర్ఎస్ చేసిన ఖర్చు రూ. రెండు వందల కోట్ల పైమాటే ఉంటుందని అనధికారిక అంచనాలు ఉన్నాయి. ఐదు నెలల పాటు ఎక్కడా తేడా లేకుండా.. రాకుండా టీఆర్ఎస్ ప్రయత్నాలు చేసింది. నేతలందర్నీ ఆర్థిక ప్రయోజనాలు చూపే టీఆర్ఎస్‌లో చేర్చుకోవడం.. చేజారిపోకుండా చూసుకోవడం వంటివి చూశారు. ఇక ఓటర్లకు పంపిణీ చేసిన మొత్తం అంచనా వేయడం కష్టం. ఎలా చూసినా ఈ ఎన్నిక టీఆర్ఎస్‌కు అత్యంత ఖరీదైనది.


Also Read : "ఫలితం" అనుభవించాల్సింది హరీష్ రావేనా !?


ఎవర్నీ వదలకుండా పార్టీలో చేర్చుకున్న కేసీఆర్ !


హుజురాబాద్ ఉపఎన్నిక సందర్భంగా వారానికొక ప్రముఖ నేతను టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు కేసీఆర్. అందులో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రచారం పాడి కౌశిక్ రెడ్డి దగ్గర్నుంచి టీ టీడీపీ అధ్యక్షునిగా ఉన్న ఈటల రాజేందర్ వరకు ఎందరో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ద్వితీయ శ్రేణి నేతల్ని కూడా చేర్చుకున్నారు. ఎల్ . రమణతో పాటు ముద్దసాని కుటుంబం నుంచి మరొకర్ని పార్టీలో చేర్చుకున్నారు.  తర్వాత మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డికీ కండువా కప్పారు. ఇలా చేరిన వారందరూ ఆషామాషీగా చేరే అవకాశం లేదు.  ఏదో ఓ పదవి హామీ తీసుకునే చేరి ఉంటారు. కానీ అంత మందిని చేర్చుకున్నా ప్రయోజనం లేకపోయింది.


Also Read : ఈటలకు కాంగ్రెస్ పరోక్ష మద్దతు... గట్టి క్యాడెర్ ఉన్నా కాంగ్రెస్ విఫలం ... ఎంపీ కోమటిరెడ్డి సంచలన కామెంట్స్
 
హుజురాబాద్‌కు పదవుల పందేరం !


హుజూరాబాద్ ఉపఎన్నిక పుణ్యమా అని అక్కడి నేతలకు కేసీఆర్ అనేక పదవులు ప్రకటించారు.  ఓ దళిత నేతకు ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇచ్చారు..  పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇంకా గవర్నర్ ఆమోదం లభించలేదు కానీ ఆయన ఎమ్మెల్సీ అయి ఉండేవారు. వకుళాభరణం కృష్ణమోహన్ రావు అనే నేతకు  బీసీ కమిషన్ చైర్మన్ పదవి ప్రకటించారు. ఇంకా పలు పదవులు హుజురాబాద్ టీఆర్ఎస్ నేతకు ఇచ్చారు. కానీ అవేమీ ఓట్లు తెచ్చిపెట్టలేకపోయాయి.


Also Read: "దళిత బంధు"గా కేసీఆర్‌ను దళితులు గుర్తించలేదా ? నమ్మలేకపోయారా ?


కేసీఆర్ ఎక్కడ ఫెయిలయ్యారు..  ఈటల విషయంలో తొందరపడ్డారా ?


నాగార్జున సాగర్ ఉపఎన్నిక తర్వాత కసీఆర్ ఇక ఎదురు ఉండదన్న ఉద్దేశంతో  ఈటల రాజేందర్ విషయంలో దూకుడుగా వ్యవహరించారని అందుకే ఎదురు దెబ్బ తిన్నారని అంటున్నారు. ఈటల ఇమేజ్‌ను తక్కువగా అంచనా వేయడం మాత్రమే కాకుండా తాను పార్టీ నుంచి పంపేసిన ఇతర నేతలు ఆలె నరేంద్ర, విజయశాంతి వంటి నేతల తరహాలోనే ట్రీట్‌మెంట్ చేయడంతో ప్రజల్లో సానుభూతి వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఎంత రాజకీయ చాణక్యుడైనా అన్ని సార్లు ఎత్తులు పారవని హుజురాబాద్ ఫలితంతో తేలిందన్న అభిప్రాయం ఇప్పుడు తెలంగాణ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. 


Also Read: హుజురాబాద్‌లో గెలుపు ఈటలదా ? బీజేపీదా ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి