హుజురాబాద్‌లో టీఆర్ఎస్ ఓటమి ఖరారుతో ఇప్పుడు ఎవరు "ఫలితం" అనుభవించబోతున్నారన్న చర్చ టీఆర్ఎస్‌లో ప్రారంభమయింది. మొదటి నుంచి హుజురాబాద్ విషయంలో ఫలితం తేడా వస్తే హరీష్‌కు గడ్డు పరిస్థితి వస్తుందన్న ప్రచారం ఆ పార్టీలో ఉంది. ఇప్పటికే హరీష్ బాధ్యతలు తీసుకున్న దుబ్బాకలో టీఆర్ఎస్ పరాజయం పాలైంది. హుజురాబాద్ రెండో నియోజవకర్గం. దీంతో ఆయనకు ఇబ్బందికర పరిస్థితి ఖాయమని అంచనా వేస్తున్నారు.
ఉమ్మడి కరీంనగర్ నుంచి మంత్రిగా కేటీఆర్ ఉన్నా హరీష్‌కే బాధ్యతలు !
ఈటల రాజేందర్ రాజీనామా చేసిన తరవాత ఉపఎన్నిక ఖాయమని తేలింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్‌కు సీఎం నియోజకవర్గ బాధ్యతలిచ్చారు. కానీ పరిస్థితి బాగో లేదనుకున్నారో ఏమో కానీ.. తర్వాత హరీష్ రావును కేసీఆర్ రంగంలోకి దింపారు. అప్పట్నుచి హరీష్ రావు హుజురాబాద్‌లోనే మకాం వేశారు. తన రాజకీయ టాలెంట్‌ను అంతా ప్రదర్శించి టీఆర్ఎస్‌ను గట్టెక్కించడానికి తన వంతు ప్రయత్నం చేశారు. కానీ ఆయనకు అగ్రనాయకత్వం నుంచి అందుతున్న సహకారం అంతంతమాత్రమే. కేసీఆర్‌తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మంత్రిగా ఉన్న కేటీఆర్ కూడా ప్రచారానికి రాలేదు. దళిత బంధును ప్రారంభించడానికి కేసీఆర్ హుజురాబాద్ వెళ్లారు .. ఓ సారి సమీక్ష చేయడానికి వెళ్లారు కానీ.. అంతకు మించి దృష్టి పెట్టలేదు. రోడ్ షో, బహిరంగసభలు పెట్టాలనుకున్నప్పటికీ వర్కవుట్ కాలేదు.
Also Read: ఈటల రాజేందర్ ఆధిక్యం వెనుక ఎవరి ‘హస్తం’ ఉంది..? కౌంటింగ్ సరళి చెబుతోంది అదేనా ?
శక్తివంచన లేకుండా ప్రయత్నించినా హరీష్‌కు కలసి రాని కాలం !
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మంత్రిగా... తెలంగాణ ప్రభుత్వంలో సీఎం స్థాయి అధికారాలు చెలాయిస్తున్న నేతగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎలా చూసినా కేటీఆర్‌కు హుజూరాబాద‌్ ఎన్నికల విషయంలో ప్రత్యేక బాధ్యత ఉంటుంది. మాములుగా అయితే ఇలాంటి ఎన్నికలు ఉమ్మడి మెదక్ జిల్లా బయట ఎక్కడ జరిగినా బాధ్యతలన్నీ చాలా కాలంగా కేటీఆర్‌కే ఇస్తూ వస్తున్నారు కేసీఆర్. కానీ ఈ సారి మాత్రం ఉద్యమకారుడి ఇమేజ్ ఉన్న ఈటలను ఎదుర్కోవడానికి అదే ఇమేజ్ ఉన్న హరీష్‌కు చాన్సి ఇచ్చారు. కేసీఆర్ ఇచ్చిన బాధ్యతల్ని హరీష్ శక్తివంచన లేకుండా నెరవేర్చేందుకు ప్రయత్నించారు. హుజూరాబాద్‌లోనే మకాం వేసి ఈటలను ఒంటరి చేయడంలో సక్సెస్ అయ్యారు. టీఆర్ఎస్ నేతలెవరూ ఈటల వెంట వెళ్లకుండా చూసుకున్నారు. కానీ అంతిమంగా ఫలితం మాత్రం కలసి రాలేదు.
Also Read: "దళిత బంధు"గా కేసీఆర్‌ను దళితులు గుర్తించలేదా ? నమ్మలేకపోయారా ?
ఈటల, రేవంత్ రెడ్డి జోస్యం చెప్పినట్లుగా బలి పశువు అవబోతున్నారా ?
హుజురాబాద్‌లో ఓడితే హరీష్ రావునే బలి పశువును చేస్తారని విపక్షపార్టీల నేతలుకొద్ది రోజులుగా విమర్శలు చేస్తున్నారు. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఈటల రాజేందర్ కూడా అదే చెబుతున్నారు. తనపై ఆరోపణలు చేసిన ప్రతీ సారి ఈటల రాజేందర్ కూడా తన లాంటి పరిస్థితే హరీష్ రావుకు వస్తుందని కౌంటర్ ఇస్తూండేవారు. ఇప్పుడు హరీష్ ఫలితం అనుభవిస్తారా లేక వైఫల్యం ఉమ్మడిది అని కేసీఆర్ లైట్ తీసుకుంటారా అన్నది ఆసక్తికరగా మారింది.
Also Read: హుజురాబాద్‌లో గెలుపు ఈటలదా ? బీజేపీదా ?