కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 14వ తేదీన తిరుపతిలో పర్యటించనున్నారు. తిరుపతి తాజ్‌ హోటల్‌లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది.  ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా పాండిచ్చేరి, అండమాన్‌నికోబార్‌, లక్షద్వీప్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్లు హాజరవుతారు. ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం.. కేంద్ర, రాష్ట్రాల మధ్య పరిష్కారం కానీ పలు కీలకమైన అంశాలు చర్చిస్తారు. సమావేశం ఏర్పాట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షించారు.  


Also Read : విజయగర్జనతోనే టీఆర్ఎస్ మళ్లీ ట్రాక్‌లోకి ! ఇక కేటీఆర్‌దే అసలు టాస్క్ !
  
నిజానికి ఈ సమావేశాన్ని మార్చిలో నిర్వహించాలని అనుకున్నారు. ఏర్పాట్లు కూడా చేశారు. కానీ అప్పట్లో తిరుపతి ఉపఎన్నిక , ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతూ ఉండటంతో సమావేశం వాయిదా పడింది. ఇప్పుడు మళ్లీ నిర్వహిస్తున్నారు. అమిత్ షాతో ఇటీవల ఢిల్లీలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించారు. ఆ భేటీలోనూ సీఎం జగన్ పాల్గొనాల్సి ఉంది. అయితే అదే రోజు జగన్‌ జిమ్ చేస్తూండగా కాలు బెణకడంతో ఆయన వెళ్లలేకపోయారు. ఏపీలోనే ఈ సారి సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరుగుతూండటంతో  ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. 


Also Read : వేల కోట్లు గుమ్మరించినా.. నేతలందర్నీ చేర్చుకున్నా ఎందుకీ పరాజయం ! కేసీఆర్ ఎక్కడ ఫెయిలయ్యారు ?


దక్షిణాది రాష్ట్రాల విషయంలో కేంద్రం తీరు ఏ మాత్రం ప్రోత్సాహకరంగా లేదని ఇటీవలి కాలంలో రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవలే తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన స్టాలిన్ పలు అంశాలపై కేంద్రంపై పోరాడదామని దక్షిణాది రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు. దక్షిణాది రాష్ట్రాల సమస్యలు, కేంద్రం పెత్తనంపై చురుకుగా స్పందిస్తున్నారు. ఈ కారణంగా దక్షిణాది రాష్ట్రాల సమావేశం వాడి - వేడిగా సాగే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల మధ్య కూడా పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయి. వాటిపైనా చర్చ జరగనుంది. 


Also Read: "దళిత బంధు"గా కేసీఆర్‌ను దళితులు గుర్తించలేదా ? నమ్మలేకపోయారా ?


దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రం ఒక్క కర్ణాటక మాత్రమే. మిగతా అన్ని రాష్ట్రాల్లో బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే పార్టీలో అధికారంలో ఉన్నాయి. అందుకే సరజన్ జోనల్ కౌన్సిల్ సమావేశం సహజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. 


Also Read : చట్టాన్ని ఉల్లంఘించి అప్పులు చేసినట్లుగా ఒప్పుకున్న బుగ్గన ! ఇక కేంద్రం అప్పులు తీసుకోనివ్వకపోతే ఏం చేస్తారు ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి