టాలీవుడ్ ప్రముఖులకు డ్రగ్స్ వ్యవహారాలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చిన కేసులో ఆధారాలన్నీ  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌కు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈడీ దరఖాస్తు చేస్తే 15 రోజుల్లో వివరాలు ఇవ్వాలని విచారణ  డ్రగ్స్‌ కేసులో కాల్‌డేటా రికార్డులను నెల రోజుల్లో ఈడీకి ఇవ్వాలని స్పష్టం చేసింది. తమ ఆదేశాలు అమలు చేయకపోతే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. డ్రగ్స్‌ యువతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ..దేశ ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఈడీ దర్యాప్తునకు సహకరించాలని హైకోర్టు సూచించింది. 


Also Read: చర్యలు తీసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు.. రోడ్డెక్కడం ఆపి చర్చలకు రావాలని ఉద్యోగ నేతలకు సజ్జల సలహా !


డ్రగ్స్ కేసులో  కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని పీసీసీ అధ్యక్షుడు కాక ముందే రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2017లో దాఖలు చేసిన ఆ పిటిషన్ పై ఇప్పటికీ విచారణ జరుగుతోంది. డ్రగ్స్‌ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఈడీకి సహకరించడంలేదనీ.. ఇందులో కీలక వ్యక్తుల ప్రమేయం ఉన్నట్టు  రేవంత్ తరపు న్యాయవాది రచనా రెడ్డి వాదనలు వినిపించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ జేడీ కూడా కోర్టుకు అదే తెలిపారు. ఈ కేసులో పత్రాలు, వివరాలను ప్రభుత్వం ఇవ్వడంలేదన్నారు. 


Also Read: చేప దాడిలో జాలరి మృతి.. విశాఖ తీరంలో విషాదం..


కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం  తమ వద్ద ఉన్న సమాచారం ఈడీకి, కోర్టులకు ఇచ్చామని స్పష్టం చేసింది. డ్రగ్స్‌ కేసులో ఎఫ్‌ఐఆర్‌లు, దర్యాప్తు అధికారుల రికార్డులతో పాటు పూర్తి వివరాలను ఈడీకి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.  సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్థలకు ఈ కేసు ఇవ్వాల్సిన  అవసరం లేదన్న హైకోర్టు.. రేవంత్‌ రెడ్డి పిల్‌పై విచారణను ముగించింది. 


టాలీవుడ్ డ్రగ్స్ కేసు  విషయంలో  తెలంగాణ ఎక్సైజ్ శాఖ .. సినీ ప్రముఖులందరికీ క్లీన్ చిట్ ఎప్పుడో ఇచ్చింది. ఎవరిపైనా బలమైన ఆధారాలు లేవని కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. వారి వద్ద సేకరించిన శాంపిల్స్‌లో  ఆనవాళ్లు కూడా లేవని కోర్టుకు నివేదిక సమర్పించారు. ఈడీ కూడా డ్రగ్స్ కొనుగోలుకు నిధులు ఎలా చెల్లించారో విచారణ జరిపింది. ఆ సమయంలో తెలంగాణ ప్రభుత్వం సహకరించలేదన్న ఆరోపణలు వచ్చాయి. చివరికి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఈడీ కేసు ముగించింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పిటిషన్ విచారణ కారణంగా ఆ వివరాలన్నీ ఈడీకి ఇస్తే మళ్లీ కేసును ఈడీ విచారణ ప్రారభించే అవకాశం ఉంది.