విశాఖ జిల్లా పరవాడలో తీవ్ర విషాదం చోటు చేసుంది. చేప దాడిలో ఓ జాలరి మృతి చెందాడు. ముత్యాలపాలెం నుంచి కొందరు జాలర్లు వేటకు వెళ్లారు. వీళ్ల వలకు ఓ భారీ చేప పడింది. ఇదే ఆనందంలో ఉండగానే ఓ పెద్ద చేప జాలరిపై దాడి చేసింది. చేపను బయటకు తీసే క్రమంలో జోగన్నపై  కొమ్ముకోనాం అనే చేప అటాక్ చేసింది. ఈ దాడికి ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. 

  
వలలో మంచి చేపలు పడ్డాయన్న ఆనందతో ఉన్న జాలర్లు ఈ ఘటనలో ఒక్కసారిగా విషాదంలోకి జారిపోయారు. జోగన్న మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. ఆ డెడ్‌బాడీని చూసి ఆయన ఫ్యామిలి కన్నీరుమున్నీరుగా విలపించింది. 


మృతి సంగతి తెలుసుకున్న పోలీసులు ముత్యాలపాలెం చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. చేప ఎలా ఉంటుందీ .. ఎలా దాడి చేసింది... జోగన్న ఎన్ని గంటలకు చనిపోయాడు వంటి విషయాలపై ఆరా తీశారు. 


కొమ్ముకోనాం అనే చాలా అరుదైన చేప ఈ దాడి చేసి జోగన్న ప్రాణాలను తీసింది. ఈ చేప దొరికిందంటే జాలర్లు ఆ రోజంతా పండగ చేసుకుంటారు. అలాంటి లాభాలను అందించే చేప ప్రాణాలు తీసింది. 


బంగాళాఖాతంలో దొరికే అతి అరుదైనా చేపల్లో ఒకటే ఈ కోనాం. కొమ్ము కోనాం భారీ సైజ్‌లో ఉంటుంది. సాధారణంగా దీన్ని కొన్ని ప్రాంతాల్లో వంజరం అని కూడా పిలుస్తారు. చిన్నగా ఉంటే అలా అంటారు. సైజ్‌ పెరిగితే కోనాం అంటారు. 


ఈ కోనాం చేపకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. కిలో వెయ్యిరూపాయల వరకు ధర పలుకుతుంది. అందుకే ఈ చేప పడిందంటే జాలర్లు ఫుల్ హ్యాపీ. కానీ ఆ చేపే ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. 


ఈ కొమ్ము కోనాం వలకు దొరకడం అంత ఈజీ కాదు. దొరికినా కొన్నిసార్లు వలను చీల్చుకొని తప్పించుకుంటుంది. ఇప్పుడు కూడా ఇదే జరిగిందంటున్నారు జోగన్నతో వెళ్లిన జాలర్లు. వలను పైకి లాగే టైంలో చేప జోగన్నను కొట్టి సముద్రంలో పడిపోయిందంటున్నారు. చేపకు ఉండే మూతి భాగం గట్టిగా తగిలేసరికి జోగన్న అక్కడికక్కడే పడిపోయాడని చెబుతున్నారు. 


Also Read: తూర్పుగోదావరి జిల్లాలో కలకలం... కల్లు తాగిన నలుగురు మృతి.. ఇంకొకరి పరిస్థితి విషమం


Also Read: ఈ ఊర్లో వారికి పిల్లను ఇవ్వటంలేదు, హైవేకు దగ్గర్లోనే గ్రామం.. 100 ఏళ్లుగా ఎన్నో కష్టాలు


Also Read త్వరలోనే ‘ఫిష్ ఆంధ్ర’ పథకం.. ట్రయల్ రన్‌లో జగనన్న చేపల వాహనాలు