తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి విషాదం చోటు చేసుకుంది. లోదొడ్డి గ్రామంలో  జీలుగు కల్లు తాగి నలుగురు గిరిజనులు మృతి చెందారు. 


ఈ ఉదయాన్ని ఉపాధి కోసం వెళ్లిన గిరిజనులు అటవీ ప్రాంతంలో జీలుగు కల్లు తాగారు. ఇది తాగిన వెంటనే ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 


కల్లు తాగి అస్వస్థతకు గురైన వారిని స్థానికంగా ఉన్న జెడ్డింగి పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ వైద్యం చేయడానికి సిబ్బంది లేకపోయేసరికి వారిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. 


కాకినాడ జీజీహెచ్‌కు తరలిస్తున్న టైంలో మార్గ మధ్యలోనే ఇద్దరు మృతి చెందారు. ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత వైద్యులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 


తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న మరో ముగ్గుర్ని ఆసుపత్రిలో చేర్పించుకొని చికిత్స అందించారు. ఈ చికిత్స అందిస్తున్న టైంలోనే మరో ఇద్దరు చనిపోయారు. 


కల్లు తాగిన కాసేపటికే చనిపోయిన నలుగురు గంగరాజు, సన్యాసిరావు, లోవరాజు, సుగ్రీవులుగా గుర్తించారు. ఇంకో వ్యక్తి ఏసుబాబు అనే వ్యక్తి చికిత్స తీసుకుంటున్నాడు. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. 






తరచూ ఇలా ఇక్కడి వాళ్లు కల్లు తాగుతుంటారని తరచూ అస్వస్థతకు గురి అవుతుంటారని స్థానికులు చెబుతున్నారు. దీనిపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. 


నలుగురు చనిపోవడంతో లోదొడ్డిలో తీవ్ర విషాదం అలముకుంది. వారి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. పోలీసులు ఆ ఊరి చేరుకొని కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎవరైనా ఇలాంటి కల్లు తాగారా.. ఎక్కడ దొరుకుతుందీ కల్లు. ఇందులో ఏమైనా రసాయనాలు కలుపుతున్నారా అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. 


Also Read: తూర్పుగోదావరి జిల్లాలో కలకలం... కల్లు తాగిన నలుగురు మృతి.. ఇంకొకరి పరిస్థితి విషమం


Also Read: ఈ ఊర్లో వారికి పిల్లను ఇవ్వటంలేదు, హైవేకు దగ్గర్లోనే గ్రామం.. 100 ఏళ్లుగా ఎన్నో కష్టాలు


Also Read త్వరలోనే ‘ఫిష్ ఆంధ్ర’ పథకం.. ట్రయల్ రన్‌లో జగనన్న చేపల వాహనాలు


మూడో భేటీలోనూ ఎటూ తేలని చర్చలు.. "టిక్కెట్ కమిటీ" మరోసారి భేటీ అయ్యే చాన్స్ !