తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ప్రభుత్వం ఇవ్వకపోవడంపై  హైకోర్టు ( TS High Court )  ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 6న రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సిద్ధిపేటకు చెందిన సామాజిక కార్యకర్త కొండల్ రెడ్డి ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం ( PIL ) దాఖలు చేశారు. దీనిపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.


కర్ణాటక హిజాబ్ వివాదంపై స్పందించిన కవిత, చేతితో హిందీలో ‘కవిత’ రాసి ట్వీట్, అర్థం ఏంటంటే


ఆత్మహత్య చేసుకున్న రైతుల ( Farmer Suiside ) కుటుంబాలను ఆదుకుంటామంటూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసిందని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 2015లో జారీ చేసిన జీవో ప్రకారం ఆత్మహత్య చేసుకున్న ఒక్కో రైతు కుటుంబానికి రూ.6 లక్షలు చెల్లించాల్సి ఉందన్నారు. ఇప్పటికి జీవో జారీ చేసి ఆరు ఏళ్లు అయిందని కానీ ఇంత వరకూ ఏ ఒక్క రైతులకూ నష్టపరిహారం చెల్లించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు.  పలు జిల్లాల్లో రైతు కుటుంబాలకు పరిహారం అందాల్సి ఉందని వారంతా ఆర్థిక ఇబ్బందులో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 


ప్రధానిపై టీఆర్ఎస్ ప్రివిలేజ్ నోటీసులు - నిర్ణయం తీసుకునే వరకూ సమావేశాల బహిష్కరణ !


ప్రభుత్వం తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ మరింత గడువు కావాలని కోరారు. ధర్మాసనం ప్రభుత్వ లాయర్‌పై అసహనం వ్యక్తం చేసింది. జీవోలు జారీ చేసి ఆరేళ్లు అవుతోందని కానీ అమలు చేయడం మర్చిపోయారని వ్యాఖ్యానించారు. జీవోలు జారీ చేసి తర్వాత ప్రక్రియ వదిలేశారని మండిపడింది.  చనిపోయిన రైతుల కుటుంబాలు రోజూ ఇబ్బంది పడాలా అని ధర్మాసనం ప్రశ్నించారు. ఏప్రిల్ 6న రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ అప్పటికి ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణను వాయిదా వేసింది.  


తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయితే అధికారికంగా వాటిని నమోదు చేస్తున్నారో లేదో స్పష్టత లేదు కానీ రాజకీయ పార్టీలు మాత్రం పలువురు రైతుల కుటుంబాలను పరామర్శిస్తున్నాయి. అధికారికంగా నమోదు చేసిన రైతుల ఆత్మహత్యలకు కూడా పరిహారం చెల్లించకపోవడంతో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.